News
News
X

Realme 10 Pro+ 5G Sale: రూ.25 వేలలో బెస్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా - శాంసంగ్, మోటో ఫోన్లకు పోటీ ఇచ్చే ఈ రియల్‌మీ మొబైల్ సేల్ ప్రారంభం!

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ రియల్‌మీ మనదేశంలో ఇటీవలే లాంచ్ చేసిన 10 ప్రో ప్లస్ 5జీ సేల్ ప్రారంభం అయింది.

FOLLOW US: 
Share:

రియల్‌మీ తన కొత్త స్మార్ట్ ఫోన్‌ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. అదే ఇటీవల లాంచ్ అయిన రియల్‌మీ 10 ప్రో ప్లస్ 5జీ. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ అందుబాటులో ఉంది. ఇందులో వెనకవైపు 108 మెగాపిక్సెల్ కెమెరాను కంపెనీ అందించింది. ఐకూ జెడ్6 ప్రో, శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ, మోటొరోలా ఎడ్జ్ 30 స్మార్ట్ ఫోన్లతో రియల్‌మీ 10 ప్రో ప్లస్ 5జీ పోటీ పడనుంది.

రియల్‌మీ 10 ప్రో ప్లస్ 5జీ ధర, ఆఫర్లు
ఇందులో మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.24,999 కాగా, 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.25,999గానూ, 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను రూ.27,999గానూ నిర్ణయించారు. అయితే మొదటి సేల్‌లో వీటిపై రూ.1,000 తగ్గింపును అందించారు. అంటే రూ.25 వేలలోపే దీన్ని కొనుగోలు చేయవచ్చన్న మాట. డార్క్ మేటర్, హైపర్ స్పేస్, నెబ్యులా బ్లూ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.

రియల్‌మీ 10 ప్రో ప్లస్ 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 ఆధారిత రియల్‌మీ యూఐ 4.0 ఆపరేటింగ్ సిస్టంపై రియల్‌మీ 10 ప్రో ప్లస్ 5జీ పని చేయనుంది. ఈ ఫోన్‌లో 6.7 అంగుళాల కర్వ్‌డ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, పీడబ్ల్యూఎం డిమ్మింగ్ 2160 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్10+ సపోర్ట్, 93.65 శాతం స్క్రీన్ టు బాడీ రేషియో, 950 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.

ఇక కెమెరాల విషయానికి వస్తే... దీని వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 4 సెంటీమీటర్ల మాక్రో సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 67W సూపర్‌వూక్ చార్జింగ్‌ను రియల్‌మీ 10 ప్రో ప్లస్ 5జీ సపోర్ట్ చేయనుంది. రియల్‌మీ 10 ప్రో ప్లస్ ద్వారా చార్జింగ్ చేస్తే కేవలం 47 నిమిషాల్లోనే ఈ ఫోన్ పూర్తిగా చార్జ్ కానుంది. 0 నుంచి 50 శాతం చార్జింగ్ కేవలం 17 నిమిషాల్లోనే ఎక్కనుందని కంపెనీ అంటోంది. దీని మందం 0.78 సెంటీమీటర్లు కాగా, బరువు 173 గ్రాములుగా ఉంది.

Also Read: ఐఫోన్ 14 సిరీస్ వ‌చ్చేసింది - ధర విషయంలో జాగ్రత్త పడ్డ యాపిల్ - మనదేశంలో ఎంతంటే?

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by realme India (@realmeindia)

Published at : 15 Dec 2022 03:55 PM (IST) Tags: Realme New Phone Realme 10 Pro Plus 5G Price in India Realme 10 Pro Plus 5G Realme 10 Pro Plus 5G Specifications Realme 10 Pro Plus 5G Features Realme 10 Pro Plus 5G Flipkart Sale Realme 10 Pro Plus 5G Sale

సంబంధిత కథనాలు

WhatsApp Update: వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ - ఈ ఆప్షన్‌తో ఇకపై ఈజీగా కాల్ చేసుకోవచ్చు!

WhatsApp Update: వాట్సాప్ నుంచి మరో చక్కటి ఫీచర్ - ఈ ఆప్షన్‌తో ఇకపై ఈజీగా కాల్ చేసుకోవచ్చు!

iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు!

iPhone 14 Offer: ఐఫోన్ 14పై భారీ ఆఫర్ - ఏకంగా రూ.25 వేల వరకు తగ్గింపు!

Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!

Samsung Galaxy Unpacked 2023: 200 మెగాపిక్సెల్ కెమెరాతో శాంసంగ్ ఫోన్ - అదిరిపోయే స్మార్ట్ ఫోన్ సిరీస్!

WhatsApp New Features: సూపర్ ఆప్షన్స్‌తో టెక్స్ట్ ఎడిటర్, త్వరలో వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్!

WhatsApp New Features: సూపర్ ఆప్షన్స్‌తో టెక్స్ట్ ఎడిటర్,  త్వరలో వాట్సాప్ నుంచి సరికొత్త ఫీచర్!

WhatsApp: మీరు ఈ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా? అయితే, ఈ రోజు నుంచి ఇందులో వాట్సాప్ పని చేయదు!

WhatsApp: మీరు ఈ స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారా? అయితే,  ఈ రోజు నుంచి ఇందులో వాట్సాప్ పని చేయదు!

టాప్ స్టోరీస్

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Kapu Reservations : కాపు రిజర్వేషన్లపై హరిరామ జోగయ్య పిటిషన్, రేపు హైకోర్టులో విచారణ!

Majilis Congress : మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ - వర్కవుట్ అవుతుందా ?

Majilis Congress :  మజ్లిస్‌ను దువ్వే ప్రయత్నంలో కాంగ్రెస్ -  వర్కవుట్ అవుతుందా ?

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Baasha Movie: 'బాషా' మూవీ రీమేక్ - రజినికాంత్ అభిమానులకు బ్యాడ్ న్యూస్!

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్

Adani Group : అదానీకి మరో షాక్, రూ.5400 కోట్ల బిడ్ రద్దు చేసిన యూపీ డిస్కమ్