By: ABP Desam | Updated at : 07 Apr 2023 03:08 PM (IST)
పోకో సీ51 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ( Image Source : Poco )
Poco C51: పోకో సీ51 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. రెండు కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ లాంచ్ కానుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. రెడ్‌మీ ఏ2+ పేరుతో మార్చిలో గ్లోబల్ లాంచ్ అయిన ఫోన్‌ను మనదేశంలో పోకో సీ51గా రీబ్రాండ్ చేసినట్లు తెలుస్తోంది.
పోకో సీ51 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ వేరియంట్ ధర రూ.8,499గా నిర్ణయించారు. పవర్ బ్లాక్, రాయల్ బ్లూ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ప్రత్యేక లాంచ్ ఆఫర్ కింద కొన్నాళ్ల పాటు దీన్ని రూ.7,999కే విక్రయించనున్నారు.
దీనిపై పలు సేల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే ఐదు శాతం క్యాష్ బ్యాక్ లభించనుంది. ఎంపిక చేసిన బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ. 700 అదనపు డిస్కౌంట్ కూడా అందించనున్నారు. దీని స్టాండర్డ్ ఈఎంఐ రూ. 299 నుంచి ప్రారంభం కానుంది.
పోకో సీ51 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 గో ఎడిషన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.52 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. దీని టచ్ శాంప్లింగ్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. వాటర్ డ్రాప్ నాచ్ కూడా ఇందులో అందించారు. మీడియాటెక్ హీలియో జీ36 ప్రాసెసర్‌పై పోకో సీ51 పని చేయనుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు డెప్త్ సెన్సార్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, బైదు, మైక్రో యూఎస్‌బీ పోర్టు, 3.5 ఎంఎం ఆడియో జాక్ వంటి ఫీచర్లు అందించారు. ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. దీని మందం 0.9 సెంటీ మీటర్లు కాగా, బరువు 192 గ్రాములుగా ఉంది.
ఇటీవలే పోకో ఎం5 అనే కొత్త స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్‌లో వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను కూడా అందించారు. ఆక్టాకోర్ మీడియాటెక్ జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. పోకో సీ51లో 6 జీబీ వరకు ర్యామ్ ఉంది. వెనకవైపు మూడు 50 మెగాపిక్సెల్ కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్‌గా ఉంది. ఇందులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రారంభ వేరియంట్ అయిన 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.12,499గా ఉంది. ఇక 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.14,499గా నిర్ణయించారు.
Redmi K50i 5G Offer: రెడ్‌మీ కే50ఐపై కళ్లు చెదిరే ఆఫర్ - రూ.19 వేలలోపు బెస్ట్ 5జీ ఫోన్!
WhatsApp Job Scams: వాట్సాప్ జాబ్ స్కామ్స్ - వీరి ఉచ్చులో పడితే అంతే సంగతులు, ఇలా అస్సలు చేయొద్దు!
Galaxy F54 5G India: అదిరిపోయే కెమెరా, అద్భుతమైన ఫీచర్లు, Galaxy F54 5G లాంచింగ్ డేట్ ఫిక్స్
Top 5 smartphones: మంచి స్టోరేజ్, చక్కటి బ్యాటరీ ఫర్ఫార్మెన్స్- రూ.12,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్ ఫోన్లు ఇవే!
WhatsApp New Feature: ఇకపై స్టేటస్ కూడా ఆర్కైవ్ చేసుకోవచ్చు, వాట్సాప్ నుంచి మరో సరికొత్త ఫీచర్
PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ
Coromandel Express Accident: రాంగ్ ట్రాక్‌లోకి కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, అందుకే ఘోర ప్రమాదం - ప్రాథమిక రిపోర్ట్
Avinash Reddy To CBI : అవినాష్ రెడ్డిని 6 గంటల పాటు ప్రశ్నించిన సీబీఐ - వాట్సాప్ కాల్స్ పైనే సమాచారం సేకరించారా ?
Coromandel Train Accident: రైళ్లు పట్టాలు తప్పడానికి కారణాలేంటి? ఆ నిర్లక్ష్యమే ప్రాణాలు తీస్తోందా?