By: ABP Desam | Updated at : 21 Sep 2023 09:50 PM (IST)
మోటొరోలా ఎడ్జ్ 40 నియో మనదేశంలో లాంచ్ అయింది. ( Image Source : Motorola )
మోటొరోలా ఎడ్జ్ 40 నియో 5జీ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఈ ఎడ్జ్ సిరీస్ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఈ రేంజ్‌లో బెస్ట్ మొబైల్ అని చెప్పవచ్చు. 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న పీఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లేను ఈ ఫోన్‌లో అందించారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌పై మోటొరోలా ఎడ్జ్ 40 నియో పని చేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 68W ఫాస్ట్ ఛార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. రూ.25 వేలలోపు రియల్‌మీ 10 ప్రో ప్లస్, ఐకూ నియో 6, శాంసంగ్ గెలాక్సీ ఎం53 5జీ మొబైల్స్‌తో మోటొరోలా ఎడ్జ్ 40 నియో 5జీ పోటీ పడనుంది.
మోటొరోలా ఎడ్జ్ 40 నియో ధర, ఆఫర్లు
ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లాంచ్ అయింది. ఇందులో ప్రారంభ వేరియంట్ అయిన 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.23,999గా నిర్ణయించారు. టాప్ ఎండ్ వేరియంట్ అయిన 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ధర రూ.25,999గా ఉంది. బ్లాక్ బ్యూటీ, కెనీల్ బే, సూతింగ్ సీ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
సెప్టెంబర్ 28వ తేదీన రాత్రి ఏడు గంటలకు దీనికి సంబంధించిన సేల్ జరగనుంది. ఈ ఫోన్‌పై రూ.3,000 వరకు ఫెస్టివల్ డిస్కౌంట్ కూడా లభించనుంది. అయితే ఈ ఆఫర్ ఎంత కాలం వరకు అందుబాటులో ఉండనుందో తెలియరాలేదు. ఎంపిక చేసిన బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు కూడా లభించనుంది. రూ.3,500 నుంచి నో కాస్ట్ ఈఎంఐ ప్రారంభం కానుంది.
Read Also: వేళ్లు కదిపితే ఫోన్ ఎత్తేయచ్చు - మైండ్ బ్లోయింగ్ టెక్నాలజీతో యాపిల్ వాచ్ సిరీస్ 9 - ధర ఎంత?
మోటొరోలా ఎడ్జ్ 40 నియో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
ఆండ్రాయిడ్ 13 క్లీన్ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పని చేయనుంది. ఇందులో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ పీఓఎల్ఈడీ కర్వ్డ్ డిస్‌ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 144 హెర్ట్జ్‌గా ఉంది. రెండు సంవత్సరాల పాటు ఓఎస్ అప్‌డేట్ ఈ హ్యాండ్‌సెట్‌కు లభించనుందని మోటొరోలా అంటోంది. ఆక్టాకోర్ 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7030 ప్రాసెసర్‌పై మోటొరోలా ఎడ్జ్ 40 నియో రన్ కానుంది. 12 జీబీ వరకు ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 32 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది. డస్ట్, స్ప్లాష్ రెసిస్టెన్స్ కోసం ఐపీ68 రేటింగ్ కూడా అందించారు.
వైఫై, బ్లూటూత్ వీ5.3, ఎఫ్ఎం రేడియో, జీపీఎస్, ఏ-జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. యాక్సెలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ఈ-కంపాస్, గైరోస్కోప్, ప్రాక్సిమిటీ సెన్సార్, సార్ సెన్సార్లు ఇందులో ఉన్నాయి.
ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ద్వారా సెక్యూరిటీ లభించనుంది. డాల్బీ అట్మాస్ టెక్నాలజీ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 68W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 36 గంటల ప్లేబ్యాక్ టైమ్‌ను కంపెనీ అందించనుంది.
Read Also: డైనమిక్ ఐల్యాండ్‌తో లాంచ్ అయిన ఐఫోన్ 15 సిరీస్ - ధర ఎంత పెట్టారు?
Read Also: అత్యధిక బ్యాటరీ బ్యాకప్ ఇచ్చే యాపిల్ వాచ్ ఇదే - యాపిల్ వాచ్ అల్ట్రా 2 వచ్చేసింది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
Infinix Smart 8 HD: రూ.ఆరు వేలకే స్మార్ట్ ఫోన్ - భారీ బ్యాటరీ, పెద్ద డిస్ప్లే - ఇన్ఫీనిక్స్ కొత్త ఫోన్ వచ్చేసింది!
Indian Smartphone Brands: భారతీయ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ల పతనానికి కారణం ఇదే - చైనా కంపెనీలు చేశాయా? చేజేతులా చంపేసుకున్నారా?
Smartphone Hacking Signs: మీ ఫోన్ ఇలా ప్రవర్తిస్తుందా? - అయితే హ్యాక్ అయినట్లే - రీసెట్ చేయాల్సిందే!
Smartphone Charging Tips: ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ తప్పులు చేస్తున్నారా? - పేలిపోయే అవకాశం ఉంది జాగ్రత్త!
Upcoming Smartphones: డిసెంబర్ మొదటి వారంలో ఏకంగా ఐదు ఫోన్లు లాంచ్ - ఏమేం వస్తున్నాయి? - వీటి కోసం వెయిట్ చేయవచ్చా?
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>