By: ABP Desam | Updated at : 11 Jul 2022 03:47 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
మోటో జీ42 సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అయింది.
మోటో జీ42 స్మార్ట్ ఫోన్ సేల్ మనదేశంలో ప్రారంభం అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్‌లో అమోఎల్ఈడీ డిస్‌ప్లే, వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌పై మోటో జీ42 పనిచేయనుంది.
మోటో జీ42 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే లాంచ్ అయింది. 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ వేరియంట్ ధరను రూ.13,999గా నిర్ణయించారు. అట్లాంటిక్ గ్రీన్, మెటాలిక్ రోజ్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ లభించనుంది. అట్లాంటిక్ గ్రీన్, మెటాలిక్ రోజ్ రంగుల్లో మోటో జీ42 అందుబాటులో ఉంది.
మోటో జీ42 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై మోటో జీ42 పనిచేయనుంది. ఇందులో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది. మోటో జీ42 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 60 హెర్ట్జ్‌గా ఉండగా... యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఆక్టాకోర్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 680 ప్రాసెసర్‌ను ఈ ఫోన్‌లో అందించారు.
ఇక కెమెరాల విషయానికి వస్తే... ఇందులో వెనకవైపు మూడు కెమెరాల సెటప్ ఉంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా... దీంతోపాటు 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ కూడా అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ కెమెరా అందుబాటులో ఉంది.
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది. 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఆప్షన్లు ఉన్నాయి. యాక్సెలరో మీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, లైట్ సెన్సార్, కంపాస్ సెన్సార్లు కూడా మోటో జీ42లో అందించారు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్కభాగంలో ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా... 20W టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్‌ను సపోర్ట్ చేయనుంది. మోటో జీ42 మందం 0.82 సెంటీమీటర్లు కాగా... బరువు 174.5 గ్రాములుగా ఉంది.
Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?
Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!
Moto G62 5G: మోటొరోలా చవకైన 5జీ ఫోన్ వచ్చేస్తుంది - రూ.15 వేలలోపే!
Oppo Reno 8Z: ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లేతో ఒప్పో కొత్త ఫోన్ - ధర ఎంతో చూశారా?
Realme 9i 5G: రియల్‌మీ చవకైన 5జీ ఫోన్ - ఈ నెలలోనే లాంచ్ - ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
ఈ శాంసంగ్ ఫోన్‌పై భారీ తగ్గింపు - 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఫోన్ రూ.13 వేలలోపే!
Nokia 110 2022: రూ.2 వేలలోపే నోకియా కొత్త ఫోన్ - సెకండరీ ఫోన్‌గా వాడుకోవచ్చు!
Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం
CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్
Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్ పవర్ - బాక్సర్ నిఖత్‌కు స్వర్ణం
Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్