Lava Yuva 2: రూ.7 వేలలోపే 6 జీబీ ర్యామ్ ఫోన్ - ‘లావా యువ 2’ని లాంచ్ చేసిన భారతీయ బ్రాండ్!
ప్రముఖ భారతీయ బ్రాండ్ లావా తన కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. అదే లావా యువ 2.
Lava Yuva 2: లావా యువ 2 స్మార్ట్ ఫోన్ మనదేశంలో బుధవారం (ఆగస్టు 2వ తేదీ) లాంచ్ అయింది. ఈ స్మార్ట్ ఫోన్ మనదేశంలో గ్లాస్ బ్యాక్ ప్యానెల్‌తో ఎంట్రీ ఇచ్చింది. లావా యువ 2 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ను సపోర్ట్ చేయనుంది. వాటర్ డ్రాప్ తరహా నాచ్‌ను ఈ ఫోన్‌లో అందించారు. ఆక్టాకోర్ యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై లావా యువ 2 పని చేయనుంది. 3 జీబీ వరకు ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఉన్నాయి. వర్చువల్ ర్యామ్ ఫీచర్ ద్వారా ర్యామ్‌ను 6 జీబీ వరకు పెంచుకోవచ్చు. ఫోన్ వెనకవైపు రెండు కెమెరాల సెటప్ అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 600 గంటల బ్యాకప్ అందించనుందని కంపెనీ తెలిపింది.
లావా యువ 2 ధర (Lava Yuva 2 Price in India)
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది. 3 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్‌తో వచ్చిన ఈ ఫోన్ ధరను రూ.6,999గా నిర్ణయించారు. గ్లాస్ బ్లూ, గ్లాస్ గ్రీన్, గ్లాస్ లావెండర్ కలర్ ఆప్షన్లలో దీన్ని కొనుగోలు చేయవచ్చు. దీనికి సంబంధించిన సేల్ కూడా ఇప్పటికే ప్రారంభం అయింది. లావా ఈ-స్టోర్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
లావా యువ 2 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు (Lava Yuva 2 Specifications)
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టం ద్వారా లావా యువ 2 రన్ అవుతుంది. డ్యూయల్ నానో సిమ్‌లను ఇందులో వేసుకోవచ్చు. 6.51 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఇందులో ఉంది. స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్, పిక్సెల్ డెన్సిటీ 269 పీపీఐ వంటి డిస్‌ప్లే ఫీచర్లు కూడా అందించారు. యూనిసోక్ టీ606 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది. 3 జీబీ ర్యామ్ ఉంది. వర్చువల్ ర్యామ్ ద్వారా మరో 3 జీబీ ర్యామ్ పెంచుకోవచ్చు. అంటే మొత్తంగా 6 జీబీ వరకు ర్యామ్ పెరుగుతుందన్న మాట.
ఇక కెమెరా విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు రెండు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగాపిక్సెల్‌గా ఉంది. ఈ కెమెరాలో రకరకాల మోడ్లు, ఫిల్టర్లు ఉన్నాయి. హెచ్‌డీఆర్, పొర్‌ట్రెయిట్, బ్యూటీ, స్లో మోషన్ వంటి ఫీచర్లు అందించారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. స్క్రీన్ ఫ్లాష్ ఫీచర్‌ను అందించారు. 64 జీబీ స్టోరేజ్ ఉంది. అయితే మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకునే ఆప్షన్ కూడా ఉంది.
4జీ, బ్లూటూత్ 5, వైఫై, 3.5 ఎంఎం ఆడియో జాక్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు వంటి కనెక్టివిటీ ఫీచర్లు అందించారు. యాక్సెలరో మీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు. ఫేస్ అన్‌లాక్‌ను కూడా ఇది సపోర్ట్ చేయనుంది.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 10W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేస్తే 40 గంటల టాక్ టైం, 533 నిమిషాల యూట్యూబ్ ప్లేబ్యాక్ టైం, 600 గంటల స్టాండ్ బై టైం లభించనుంది. దీని మందం 0.87 సెంటీమీటర్లు కాగా, బరువు 202 గ్రాములుగా ఉంది.
Read Also: ఐఫోన్ లవర్స్ కు బ్యాడ్‌న్యూస్ - 15 ప్రో సిరీస్ ధరలు భారీగా పెంపు - రూ.2 లక్షలు దాటించేస్తారా?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial