అన్వేషించండి

Asus ROG Phone 6: వావ్ అనిపించే అసుస్ ఫోన్ వచ్చేసిందిగా - ధర ఎంతో తెలుసా?

ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అసుస్ తన కొత్త ఫోన్ రోగ్ ఫోన్ 6ను మనదేశంలో లాంచ్ చేసింది.

అసుస్ రోగ్ ఫోన్ 6 స్మార్ట్ ఫోన్ మనదేశంలో లాంచ్ అయింది. ఇందులో క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉన్న 6.78 అంగుళాల డిస్‌ప్లే, 12 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్‌గా ఉంది.

అసుస్ రోగ్ ఫోన్ 6 ధర
ఇందులో కేవలం ఒక్క వేరియంట్ మాత్రమే ఉంది. 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధరను రూ.71,999గా నిర్ణయించారు. ఫాంటం బ్లాక్, స్టార్మ్ వైట్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. దీని సేల్ ఎప్పుడు జరగనుందో తెలియరాలేదు.

అసుస్ రోగ్ ఫోన్ 6 స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రోగ్ యూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇందులో 6.78 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ శాంసంగ్ అమోఎల్ఈడీ డిస్‌ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 165 హెర్ట్జ్ కాగా, టచ్ శాంప్లింగ్ రేట్ 720 హెర్ట్జ్‌గా ఉంది. హెచ్‌డీఆర్10+ సపోర్ట్ కూడా ఇందులో అందించారు. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. 

12 జీబీ ఎల్పీడీడీఆర్5 ర్యామ్, 256 జీబీ యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్ ఈ స్మార్ట్ ఫోన్‌లో అందించారు. క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 ప్రాసెసర్‌పై అసుస్ రోగ్ ఫోన్ 6 పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 6000 ఎంఏహెచ్ కాగా, 65W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే... ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా కూడా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ కెమెరా అందించారు.

కనెక్టివిటీ కోసం 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, వైఫై డైరెక్ట్, బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, రెండు యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు ఉన్నాయి. దీంతోపాటు జీఎన్ఎస్ఎస్ జీపీఎస్, గ్లోనాస్, గెలీలియో, బైదు, నావిక్, యాక్సెలరోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాంబియంట్ లైట్ సెన్సార్లు అందించారు. దీని మందం 1.03 సెంటీమీటర్లు కాగా, బరువు 239 గ్రాములుగా ఉంది.

Also Read: వన్‌ప్లస్ 10ఆర్ వచ్చేసింది - ఏకంగా 150W ఫాస్ట్ చార్జింగ్ - ధర ఎంతంటే?

Also Read: రూ.10 వేలలోనే ట్యాబ్లెట్ - లాంచ్ చేసిన రియల్‌మీ - ఎలా ఉందో చూశారా!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

హనుమంత వాహనంపై పద్మావతి అమ్మవారుVenkata Satyanarayana Penmetsa Mumbai Indians | IPL 2024 Auction లో దుమ్మురేపిన కాకినాడ కుర్రోడుPrime Ministers XI vs India 2Day Matches Highlights | వర్షం ఆపినా మనోళ్లు ఆగలేదు..విక్టరీ కొట్టేశారుల్యాండ్ అవుతుండగా పెనుగాలులు, విమానానికి తప్పిన ఘోర ప్రమాదం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sajjala Bhargav Reddy Latest News: సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
సజ్జల భార్గవ్‌రెడ్డికి షాక్- ముందస్తు బెయిల్‌కు సుప్రీంకోర్టు నిరాకరణ
Vajedu SI Suicide News: వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
వారం రోజుల్లో నిశ్చితార్థం- ఇంతలో వాజేడు ఎస్సై సూసైడ్‌- హరిత రిసార్ట్స్‌లో ఏం జరిగింది?
Honor Killing In Hyderabad : కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
కారుతో ఢీ కొట్టి కత్తితో పొడిచి అక్కను చంపిన తమ్ముడు-కులాంతర వివాహం చేసుకుందని కసితో హత్య
Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
తిరుమల తిరుపతి స్థానికుల కళ్లల్లో ఆనందం- ఐదేళ్ల తర్వాత అమలులోకి ప్రత్యేక దర్శన భాగ్యం
Tiger Attack Latest News Today: సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
సిర్పూర్‌లో తిరుగుతున్నది ఒకటి కాదు నాలుగు పులులు- జాడ కోసం జల్లెడ పడుతున్న అధికారులు
Silk Smitha : అప్పుడు విద్యాబాలన్, ఇప్పుడు బాలయ్య భామ.. మార్కెట్‌లోకి మరో సిల్క్‌ వచ్చేసింది
అప్పుడు విద్యాబాలన్, ఇప్పుడు బాలయ్య భామ.. మార్కెట్‌లోకి మరో సిల్క్‌ వచ్చేసింది
Kannada TV actor Shobitha Suicide : కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే పెళ్లి, అంతలోనే తిరిగిరాని లోకాలకు
కన్నడ నటి శోభిత అనుమానాస్పద మృతి.. రెండేళ్ల క్రితమే పెళ్లి, అంతలోనే తిరిగిరాని లోకాలకు
Vikrant Massey : సినిమాల నుంచి తప్పుకుంటున్న 12th Fail హీరో... వాళ్ల కోసమే ఈ షాకింగ్ నిర్ణయమట
సినిమాల నుంచి తప్పుకుంటున్న 12th Fail హీరో... వాళ్ల కోసమే ఈ షాకింగ్ నిర్ణయమట
Embed widget