అన్వేషించండి

iPhone SE 4 : ఈ నెలాఖరులో లాంచ్ కాబోతున్న ఆపిల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ - ధరెంతంటే..

iPhone SE 4 : లేటెస్ట్ A18 చిప్‌సెట్‌తో రాబోతున్న ఆపిల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ ఐఫోన్ ఎస్ఈ 4 ఈ నెల చివర్లో స్టోర్‌లలోకి వచ్చే అవకాశం ఉంది.

iPhone SE 4 : ఆపిల్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తోన్న చవకైన, బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్ లాంచింగ్ కు సిద్ధమవుతోంది. ఐఫోన్ ఎస్ఈ 4 ఫిబ్రవరి 11న లాంచ్ అవుతుందని ఇప్పటికే పలు నివేదికలు సూచించాయి. ఆపిల్ సాధారణంగా తన ఉత్పత్తులను గ్రాండ్ ఈవెంట్ లను నిర్వహించి లాంచ్ చేస్తూంటుంది. కానీ ఈ ఫోన్ ను మాత్రం అలా కాకుండా కేవలం వెబ్‌సైట్ ద్వారా మాత్రమే అందుబాటులోకి తేనున్నట్టు భావిస్తున్నారు. ఈ స్మార్ట్‌ఫోన్ ఈ నెల చివర్లో స్టోర్‌లలోకి వచ్చే అవకాశం ఉంది. 

ఐఫోన్ SE 4 స్పెసిఫికేషన్లు:

పెద్ద డిస్ప్లే, OLED అప్‌గ్రేడ్

ఐఫోన్ ఎస్ఈ 4 కి సంబంధించి ఇప్పటికే పలు వెబ్ సైట్ లు కొన్ని స్పెసిఫికేషన్స్ ను సూచించారు. 6.06-అంగుళాల పెద్ద OLED డిస్ప్లే తో ఈ ఫోన్ రానుందని భావిస్తున్నారు. ఇది మునుపటి మోడళ్లలో కనిపించే 4.7-అంగుళాల LCD ప్యానెల్ స్థానంలో ఉంటుందంటున్నారు. ఇది మోడ్రన్ స్క్రీన్ టెక్నాలజీ వైపు గణనీయమైన మార్పును సూచిస్తుంది. ఇది షార్ప్ విజువల్స్ అందిస్తుందని ఆశిస్తున్నారు. ఫేస్ ఐడీకి సైతం ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుందని ఊహిస్తున్నారు.

పవర్-ప్యాక్డ్ పనితీరు

ఐఫోన్ ఎస్ఈ 4 లేటెస్ట్ A18 చిప్‌సెట్‌ను కలిగి ఉండవచ్చు. ఇది ఐఫోన్ 16 లాంటి పనితీరు, మెరుగైన సామర్థ్యాన్ని ప్రదర్శించనుంది. ఈ ఫోన్ 8 జీబీ ర్యామ్ తో రావచ్చని, ఇది సున్నితమైన మల్టీ టాస్కింగ్ అండ్ రిసోర్స్-ఇంటెన్సివ్ యాప్‌ల నిర్వహణను అనుమతిస్తుందని పలు నివేదికలు సూచిస్తున్నాయి.

కెమెరా, AI ఇన్నోవేషన్స్

ఈ ఫోన్లలో వచ్చే సింగిల్ 48 ఎంపీ బ్యాక్ కెమెరా ఫొటోగ్రఫీ ప్రియులను ఆకర్షించవచ్చు. ఇది దాని ముందున్న లో-రిజల్యూషన్ లెన్స్ కంటే ఒక పెద్ద ముందడుగును సూచిస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, 12 ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను ఆశిస్తున్నారు. ఫొటోగ్రఫీ, వాయిస్ రికగ్నిషన్ లాంటి ఫీచర్స్ యూజర్స్ ను ఆకట్టుకోనున్నాయి.

ధర అంచనాలు

యూస్ లాంచ్ ధర ఈ ఫోన్ ధర 499 డాలర్లు అంటే సుమారు రూ. 42,700గా అంచనా వేస్తున్ననప్పటికీ,  భారతీయ మార్కెట్ లో దీని ధర రూ. 50వేలకు కు దగ్గరగా ఉండవచ్చని అంటున్నారు. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ లాంటివన్నీ కూడా కేవలం ఊహాజనితమైనవే కానీ. కంపెనీ ఈ విషయంపై అధికారికంగా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కాబట్టి ఈ అంచనాలను ధృవీకరించడానికి ఆపిల్ నిర్ధారణ చాలా అవసరం. అత్యాధునిక ఫీచర్లతో రాబోతున్న ఈ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మరిన్ని సౌకర్యాలను అందిస్తుందని కూడా యూజర్స్ భావిస్తున్నారు.

Also Read : Aadhaar Cost: ఆధార్ కోసం 1.3 బిలియన్ డాలర్ల ఖర్చు దండగ - హాట్ మెయిల్ కో ఫౌండర్ సబీర్ భాటియా వివరణ ఇదీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
CM Revanth Reddy: ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
YSRCP MLAs:  అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
KTR Padayatra: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Sunita Williams Return to Earth | సునీత సాహసంపై Cousin Dinesh Rawal మాటల్లో | ABP DesamSSMB29 Location | ఒడిశా అడవుల్లో జక్కన్న | ABP DesamBRS MLAs Supreme Court Affidavit | వేటు పడకుండా..10మంది BRS ఎమ్మెల్యేల రహస్య వ్యూహం..! | ABPNara Lokesh Holds Jr NTR Flexi | లోకేశ్ చర్యల వెనుక రీజన్ ఇదేనా.! | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
చంద్రబాబు వరుసగా మూడు సార్లు సీఎం కావాలి - ఆయన దగ్గర చాలా నేర్చుకోవాలి - పవన్ కల్యాణ్ కీలక ప్రకటన
CM Revanth Reddy: ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
ప్రజలకు మాపై ఎందుకు కోపం ? - కొలువుల పండగలో సీఎం రేవంత్ ప్రశ్న
YSRCP MLAs:  అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
అనర్హతా వేటు తప్పించుకోవడానికా? జీతం కోసమా ? - సీక్రెట్‌గా హాజరు పట్టీలో సంతకాలు పెట్టిన వైసీపీ ఎమ్మెల్యేలు
KTR Padayatra: వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా - బీఆర్ఎస్‌ను అధికారంలోకి తెస్తా - కేటీఆర్ సంకల్పం
Andhra Pradesh Latest News: ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్- శుక్రవారం ఖాతాల్లో బకాయిల డబ్బులు 
ఆంధ్రప్రదేశ్‌ ఉద్యోగులకు గుడ్ న్యూస్- శుక్రవారం ఖాతాల్లో బకాయిల డబ్బులు 
Betting Apps Promotion Case: విష్ణుప్రియను బుక్ చేసిన రీతూ చౌదరి- 25న మళ్లీ విచారణకు పిలిచిన పోలీసులు  
విష్ణుప్రియను బుక్ చేసిన రీతూ చౌదరి- 25న మళ్లీ విచారణకు పిలిచిన పోలీసులు  
AP MLAs Cultural programs: ఏపీ ప్రజాప్రతినిధుల కళాపోషణ అదుర్స్ - సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన ఎమ్మెల్యేలు - వీడియోలు
ఏపీ ప్రజాప్రతినిధుల కళాపోషణ అదుర్స్ - సాంస్కృతిక కార్యక్రమాల్లో ప్రతిభ చూపిన ఎమ్మెల్యేలు - వీడియోలు
Prakash Raj: బెట్టింగ్ యాప్స్ కేసుపై ప్రకాష్ రాజ్ వినూత్న స్పందన - పోలీసులకే కాదు ప్రజలకూ చెప్పాలంటూ ...
బెట్టింగ్ యాప్స్ కేసుపై ప్రకాష్ రాజ్ వినూత్న స్పందన - పోలీసులకే కాదు ప్రజలకూ చెప్పాలంటూ ...
Embed widget