Google Maps: మీకు కావాల్సిన వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవాలా? జస్ట్ ఇలా చేస్తే సరిపోతుంది..
మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు కొత్త ప్రదేశానికి వెళ్తున్నారా? అక్కడికి వెళ్లాక.. ఎక్కడున్నారు? ఏం చేస్తున్నారు? అని తెలుసుకోవాలి అనుకుంటున్నారా.? అయితే ఇలా చేయండి..
టెక్నాలజీ.. జనాలకు ఎంతో మేలు చేస్తుంది. ఆపదలో ఉన్నవారిని గండం నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తుంది. అలాంటి వాటిలో ముఖ్యమైనది ఫోన్ ట్రాకింగ్. సాధారణంగా మనం మన కుటుంబ సభ్యులతో పాటు, మిత్రులతో నిత్యం ఫోన్లలో మాట్లాడుకుంటాం.. రోజు కలిసినా.. కొన్ని విషయాలను ఫోన్ ద్వారానే తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. మనం చాలా ముఖ్యం అనుకున్న వాళ్లు దగ్గర ఉంటే ఓకే.. ఒకవేళ ఏదైనా పనిమీద దూరం వెళ్తే? అక్కడ ఏదైనా ఇబ్బంది ఎదురైతే? ప్రతి ఒక్కరికి ఇలాంటి ఆలోచన వస్తుంది. అందుకే.. వారు దూరంగా ఉన్నా.. ఎక్కడికి వెళ్తున్నారు? ఏం చేస్తున్నారు? అనే విషయాలను తెలుసుకునే అవకాశం ఉంది. టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతున్న నేపథ్యంలో ఇది పెద్ద విషయం ఏమీ కాదు. ఫోన్ ట్రాకింగ్ ఉపయోగించి మన ఫ్రెండ్స్, కుటుంబ సభ్యులు.. ఎక్కడ ఉన్నారో.. ఎటు వెళ్తున్నారో ట్రాక్ చేసుకొనే అవకాశం ఉంది. అయితే, ఈ టెక్నాలజీని మిస్ యూజ్ చేయకుండి మంచి పనులకు మాత్రమే ఉపయోగించండి.
లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ఆన్ చేయాల్సిందే
ఇతరుల ఫోన్ ట్రాక్ చేసేందుకు బాగా ఉపయోపడే యాప్.. గూగుల్ మ్యాప్స్. దీన్ని ఉపయోగించి మన వాళ్లు ఎక్కడ ఉన్నారో? తెలుసుకోవచ్చు. మన సొంత లొకేషన్ హిస్టరీని సైతం తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఈ ట్రాకింగ్ యాప్ చాలా మోబైల్స్ లో కామన్ గా ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసి కొన్ని సెటప్ లు చేసుకుంటే మీ కుటుంబ సభ్యులను లేదంటే.. మిత్రులను ట్రాక్ చేస్తూ ఉండొచ్చు. అయితే మీరు ట్రాక్ చేసే స్నేహితులు కచ్చితంగా లొకేషన్ షేరింగ్ ఆప్షన్ ను ఆన్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది.
గూగుల్ మ్యాప్స్ తో ఎలా ట్రాక్ చేయాలి?
ఆండ్రాయిడ్ ఫోన్‌లో మీరు ఎవరినైనా ట్రాక్ చేయాలి అనుకుంటే గూగుల్ కు సంబంధించిన లైవ్ లొకేషన్ షేరింగ్ ఫీచర్ ని ఉపయోగించాలి. అయితే గూగుల్ మ్యాప్స్‌ని ఉపయోగించి ఎదుటి వారి అనుమతి లేకుండా ట్రాక్ చేయడం అనేది కుదరని పని. అయితే.. మీరు వాట్సాప్ లో మీ లొకేషన్‌ను షేర్ చేసిన స్నేహితుడిని ట్రాక్ చేయడానికి ప్రయత్నిస్తే గూగుల్ మ్యాప్స్ అందుకు అనుమతిస్తుంది.
ఐఫోన్, ఐపాడ్‌లో ఎలా?: మీ మిత్రులను ట్రాక్ చేయడానికి iPhone, iPadలో గూగుల్ మ్యాప్స్ లో వారి జీమెయిల్ ఐడీని యాడ్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు గూగుల్ మ్యాప్స్ ను ఓపెన్ చేసి మీ ప్రొపైల్ పిక్ నొక్కి.. మీ మిత్రుడిని యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత షేర్ లొకేషన్ బటన్ ను ట్యాప్ చేయాలి. ఇప్పుడు మీరు మీ లొకేషన్‌ను ఎంతసేపు షేర్ చేయాలనుకుంటున్నారు? ఎవరికి షేర్ చేయాలి అనుకుంటున్నారు? అనేది పొందుపర్చాలి. మీకు నచ్చినన్ని కాంటాక్ట్ నెంబర్లకు మీరు టిక్ చేయవచ్చు. ట్రాకింగ్ కు రెడీ గా ఉన్నప్పుడు మీ iPhoneలో షేర్ బటన్‌ను నొక్కాలి. మీరు సెలెక్ట్ చేసుకున్న వ్యక్తులు ఇప్పుడు మిమ్మల్ని ట్రాక్ చేయడానికి నొటిఫికేషన్ అందుకుంటారు. ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ దాదాపు ఇదే పద్దతిని ఉపయోగించి మిత్రులను, కుటుంబ సభ్యులను ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.
Also Read: ఓ మై గాడ్, కోవిడ్ సోకినవారికి మూర్చల ముప్పు - మాస్క్ పెట్టుకోపోతే కష్టమే!
Also Read: టాయిలెట్‌లో టైంపాస్? గంటలు గంటలు దానిపై కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!