Google Warning: ‘గూగుల్’ ఉద్యోగుల్లో గుబులు - ఆ వార్నింగ్‌తో వణికిపోతున్న సిబ్బంది
గూగుల్‌లో జాబ్ అంటే అదో డ్రీమ్. అందుకే చాలామంది టెక్ దిగ్గజాలు గూగుల్ బాట పట్టారు. కానీ, గూగుల్ తాజా హెచ్చరికలతో కలవరం మొదలైంది.
గూగుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ చిన్న విషయం గురించి తెలుసుకోవాలన్నా మన చేతులు తొలుత వెళ్లేది గూగుల్ మీదికే. ప్రపంచ సెర్చ్ ఇంజిన్ దిగ్గజంగా కొనసాగుతున్న గూగుల్.. ఎప్పుడూ లేని విధంగా తమ ఉద్యోగులపై సీరియస్ అయ్యింది. కష్టపడి పని చేయండి, లేదంటే తొలగింపు తప్పదంటూ వార్నింగ్ ఇచ్చింది. కంపెనీ సీఈవో సుందర్ పిచాయ్ తాజాగా జారీ చేసిన హెచ్చరికలు ఉద్యోగుల్లో వణుపుట్టిస్తోంది.
చేసే పనికంటే ఉద్యోగులే ఎక్కవ!
నిజానికి గూగుల్ కంపెనీలో ఉద్యోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉందట. చేయాల్సిన పనితో పోల్చితే ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారట. ఉన్నవాళ్లు కూడా సరిగా పని చేయడం లేదని భావిస్తున్నారట సీఈవో పిచాయ్. ఇప్పటికే ఈ విషయాన్ని ఉద్యోగస్తుల దృష్టికి తీసుకెళ్లారట. అయినా చాలా మందిలో పని విధానానికి సంబంధించి పెద్దగా మార్పు కనిపించలేదట. కావాల్సిన సంఖ్య కన్నా ఎక్కువ మంది ఉద్యోగులున్నా.. అనుకున్న లక్ష్యాలను చేరకపోవడంతో అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అందుకే, ఉద్యోగులు తీరును మార్చుకోవాలని హెచ్చరించారట. మంచి పనితీరుతో సంస్థను ముందుకు నడపాలని సూచించారట.
మరోవైపు గూగుల్ తమ ఉద్యోగస్తుల తొలగింపు గురించి కూడా కసరత్తు చేస్తుందట. ఆయా విభాగాల్లో అవసరానికి మించి ఉన్న ఉద్యోగులను తొలగించాలని భావిస్తుందట. ఇందులో భాగంగా టాప్ ఎగ్జిక్యూటివ్ లు తమ పని తీరును గణనీయంగా మెరుగుపర్చుకోవాలని హెచ్చరించిందట. లేదంటే ఇంటికి పంపడం ఖాయమని తేల్చి చెప్పిందట. ఉద్యోగులు సైతం వీలైనంత త్వరగా పనితీరులో మార్పు చూపించకపోతే జాబ్ కు బై బై చెప్పేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పడంతో ఎన్నడూలేని విధంగా గూగుల్ ఉద్యోగుల్లో గుబులు పట్టుకుంది.ఉద్యోగుల తొలగింపు విషయం అనేది రాబోయే త్రైమాసిక ఫలితాల మీద ఆధారపడి ఉంటుందట. ఈ ఫలితాల్లో ఉద్యోగుల పనితీరు మెరుగ్గా కనిపించకపోతే తొలగింపు ప్రక్రియ ఉంటుందని కంపెనీ ఇంటర్నల్ సమావేశాల్లో ప్రస్తావించిందట.
ఇప్పటికే ఉద్యోగులను తొలగిస్తున్న టాప్ టెక్ కంపెనీలు
కరోనా తర్వాత కంపెనీలో పనితీరు కాస్త మందగించినట్లు గూగుల్ గుర్తించింది. అనుకున్న స్థాయిలో పని జరగడం లేదని భావిస్తుంది. అందులో భాగంగానే ఉద్యోగుల నియామకాలను రద్దు చేసింది. ఉన్న ఉద్యోగుల్లో చాలా మందిని ఇంటికి పంపేందుకు ప్రయత్నిస్తున్నది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనప్పటికీ.. జరుగుతున్న పరిణామాలు అలాగే కనిపిస్తున్నట్లు ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్, మైక్రోసాఫ్ట్ సహా పలు టెక్ దిగ్గజాలు ఉద్యోగులను తగ్గించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే మైక్రో సాఫ్ట్ 2 వేలకు పైగా ఉద్యోగులను ఇంటికి పంపించింది. కాస్ట్ కటింగ్ లో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచే గూగుల్ కంపెనీ ఉద్యోగుల్లోనూ భయం మొదలయ్యింది. ఈ కంపెనీ కూడా కొంత కాలంగా ఉద్యోగులకు పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది. పని తీరు మెరుగు చేసుకోకపోతే కోత తప్పదని చెప్తూ వస్తుంది. తాజాగా వచ్చే త్రైమాసిక ఫలితాలను బేస్ చేసుకుని ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మొదలు పెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొత్తగా ఉద్యోగులను తీసుకోవడం మానేసింది. ఉన్న ఉద్యోగుల్లోనూ చాలా మందికి ఉద్వాసన పలికే అవకాశం ఉంది. కంపెనీ నిర్ణయంతో ఉద్యోగుల్లో భయం మొదలైంది. తమనకు కూడా తొలగిస్తారేమోనని వణికిపోతున్నారు.
Also Read: 200 మెగాపిక్సెల్ కెమెరాతో షావోమీ కొత్త ఫోన్ - ఫొటోలు అదిరిపోతాయ్!