Google Play: ఆండ్రాయిడ్ ఫోన్ యూజర్లకు అదిరిపోయే అప్‌డేట్- మీరు మెచ్చిన యాప్సే గూగుల్‌ప్లే కనిపిస్తాయి!
Google Play: గూగుల్ ప్లే స్టోర్ AIతో రీవాంప్ అయ్యింది. ఇకపై మీకు నచ్చిన మీరు మెచ్చిన యాప్స్ మాత్రమే మీకు తరచూ కనిపిస్తుంటాయి.

Google Play: ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరికీ గూగుల్ ప్లే స్టోర్ బాగా పరిచయమే. కానీ ఇదో మహాసముద్రం లాంటిది. ఇందులో మిలియన్ల యాప్‌లు, గేమ్‌లు, మ్యూజిక్, మూవీలు – అన్నీ ఉంటాయి. అదే అసలైన సమస్యగా మారుతుంది. అందులో కావాల్సిన యాప్ ఏదో తెలియక తికమక పడుతుంటారు. ఇలాంటి సమస్య నుంచి బయటపడేందుకు సరికొత్త ఏఐతో రీవాంప్ చేసింది. కావాల్సిన యాప్‌ను వెతకాడనికి గంటల సమయం వృథా చేయాల్సిన పని లేదు. ఈ ఫీచర్‌ను ఉపయోగించి క్షణాల్లో కావాల్సిన యాప్‌లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
గూగుల్ ప్లే స్టోర్ ఈ మధ్య కీలకమైన అప్‌డేట్ తీసుకొచ్చింది. సరైన కావాల్సిన యాప్‌ను గుర్తించి డౌన్‌లోడ్ చేసేందుకు ఒక మ్యాజిక్ సొల్యూషన్ కనుగొంది. AIతో పూర్తిగా రీవాంప్ చేసిన ప్లే స్టోర్‌లో సరికొత్త అనుభూతి పొందవచ్చు. ఇకపై మీరు ఉపయోగించే విధానం బట్టి కావాల్సిన యాప్‌లు ప్లేలిస్ట్‌లు ఆటోమేటిక్‌గా సజెస్ట్ చేస్తుంది.
ఇప్పటి వరకు ఆన్‌లైన్ పోర్టల్స్‌లో మాత్రమే మీరు యాప్‌లను వాడే విధానం ఆధారంగా కంటెంట్ సూచిస్తూ ఉంటుంది. ఇకపై ప్లే స్టోర్‌లో కూడా ఇలాంటి ఫీచర్ వచ్చేసింది. మీరు ఎక్కువగా ఉపయోగించే యాప్‌లను ఆధారంగా చేసుకొని మీకు సజెషన్స్ వస్తాయి. వాటిలో మీకు కావాల్సిన యాప్‌లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు, మీరు షాపింగ్ యాప్‌లు ఎక్కువ ఉపయోగిస్తే, అది మీకు బెస్ట్ డీల్స్ సజెస్ట్ చేస్తుంది. మ్యూజిక్ లవర్ అయితే, మీ మూడ్ బట్టి ప్లేలిస్ట్‌లు సూచిస్తుంది. ఇది జెమిని AIతో పని చేస్తుంది. టెక్‌క్రంచ్ రిపోర్ట్ ప్రకారం, యాప్స్ ట్యాబ్‌ను రీడిజైన్ చేశారు. సెర్చ్ ఇంకా స్మార్ట్ అవుతుంది, మీ యూజ్ డేటా ఆధారంగా రికమెండేషన్స్ వస్తాయి.
ఇకపై,'గేమింగ్'కి ప్రత్యేకంగా ప్లే గేమ్స్ ప్లాట్‌ఫాం లాంచ్ చేశారు. ఇక్కడ జెమిని AI 'సైడ్‌కిక్' ఉంటుంది. గేమ్ ఆడుతుంటే, టిప్స్, హెల్ప్ చేస్తుంది. ఉదా: మీరు ఫ్రీఫైర్ ఆడుతుంటే, "ఎలా విన్ అవ్వాలని?" అని అడిగితే, రియల్-టైమ్ సలహాలు ఇస్తుంది. ఇది PCలకు కూడా విస్తరిస్తుంది, అంటే మీ ఫోన్ గేమ్స్ PCలో కంటిన్యూ చేయవచ్చు.
గేమ్స్‌లో తర్వాత లెవెల్‌కు చేరాలంటే, సైడ్‌కిక్ సహాయంతో హెల్ప్ తీసుకోవచ్చు. PC క్రాస్-ప్లే కూడా అవుతుంది. ఫోన్‌లో ఆడి, ల్యాప్‌టాప్‌లో కంటిన్యూ చేయవచ్చు.
మీరు ఫోన్ తీసుకుని ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెర్చ్ బార్‌లో "షాపింగ్ యాప్" టైప్ చేసి, ఎన్నో ఆప్షన్లు చూసి కన్ఫ్యూజ్ అయ్యేవాళ్లు. కానీ ఇప్పుడు మీరు గతంలో యూజ్ చేసిన యాప్‌లను ఆధారంగా చేసుకొని AI సహాయంతో మీకు ఏది బెటర్ సూచిస్తోంది. మీరు ఏ డిస్కౌంట్స్ ఇష్టపడతారో కూడా చెబుతుంది. ఇది AI-పవర్డ్ సెర్చ్‌తో మీ కంటెంట్‌ను ఆర్గనైజ్ చేస్తుంది. మీ లైబ్రరీలో యాప్‌లు, గేమ్‌లు క్యాటగిరీల వారీగా వస్తాయి.
స్టూడెంట్స్, హౌస్‌వైవ్స్, ఆఫీస్ వర్కర్లకు: మ్యూజిక్ ప్లేలిస్ట్‌లు మీ మూడ్ బట్టి మారతాయి. వర్క్ టైమ్‌లో "ఫోకస్ మ్యూజిక్"సజెస్ట్, ఈవెనింగ్‌లో "రిలాక్స్"పాటలు సూచిస్తుంది. ఇది మీ ఫోన్‌ను మీ 'పర్సనల్ అసిస్టెంట్'గా మారుస్తుంది. ఈ అప్‌డేట్‌లో యూనిక్ వాల్యూ ఏంటంటే? ముందు, పర్సనలైజేషన్. గూగుల్ 50 బిలియన్ ప్రొడక్ట్ ఇండెక్స్ ఉపయోగించి, మీకు టైలర్డ్ సజెషన్స్ ఇస్తుంది.
ఇది యాప్‌ల డొన్‌లోడ్‌లను 20-30% పెంచుతుందని అంచనా వేస్తున్నారు. రెండోది, సీక్యూరిటీ. సైడ్‌లోడింగ్ వెరిఫికేషన్ జోడించం వల్ల అన్‌ట్రస్టెడ్ యాప్‌లు డౌన్‌లోడ్ అయ్యే అవకాశం తగ్గుతుంది. మూడోది, గేమింగ్ ఇంటిగ్రేషన్. జెమిని AI ఇన్-గేమ్ అసిస్టెంట్‌తో గేమర్ ప్రొఫైల్స్ మెరుగుపడతాయి – అచీవ్‌మెంట్స్, స్టాట్స్ అన్నీ సింక్ అవుతాయి.
ఇది ఫ్రీ యూజర్లకు కూడా అందుబాటులో ఉంటుంది, ప్రీమియం కాదు. ఈ వాల్యూ మీ టైమ్, మనీ, ఎనర్జీని సేవ్ చేస్తుంది. ఉదాహరణకు, ఒక సర్వేలో 70% యూజర్లు "సెర్చ్ టైమ్ తగ్గింది" అన్నారు.






















