Smartphones: సోమవారం నుంచి ఈ ఫోన్లు ఇక పనిచేయవు.. అధికారికంగా ప్రకటించిన కంపెనీ!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ బ్లాక్‌బెర్రీ తన స్మార్ట్ ఫోన్లకు లెగసీ సర్వీసెస్‌ను నిలిపివేయనుంది.
ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ల మార్కెట్లో బ్లాక్‌బెర్రీ ఒక దిగ్గజం. 2010 దశకం ప్రారంభంలో ఏకంగా యాపిల్‌కే బ్లాక్ బెర్రీ గట్టిపోటీని ఇచ్చింది. అయితే క్రమక్రమంగా తన మార్కెట్‌ను కోల్పోయింది. బ్లాక్ బెర్రీ ఫోన్లను అమితంగా ఇష్టపడే వారు కూడా తర్వాత ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్‌లకు మారిపోయారు. అయితే కొందరు ఇప్పటికీ బ్లాక్‌బెర్రీ ఫోన్‌ను ఉపయోగిస్తున్నారు.
కానీ వారు కూడా ఇప్పుడు తమ ఫోన్లను మార్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బ్లాక్ బెర్రీ డివైస్‌లు ఇకపై మొబైల్ నెట్‌వర్క్, వైఫైలకు కనెక్ట్ కావని కంపెనీ ప్రకటించింది. అసలు సెప్టెంబర్‌కే ఈ సేవలు ముగిసిపోవాల్సి ఉన్నప్పటికీ.. వినియోగదారులకు ఒక గిఫ్ట్‌లా ఉండేందుకు ఇప్పటివరకు పొడిగించినట్లు తెలిపింది.
అయితే ఇది కేవలం పూర్తిగా బ్లాక్‌బెర్రీ ఆపరేటింగ్ సిస్టం మీద పనిచేసే ఫోన్లకు మాత్రమే. ఇటీవల ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంపై పనిచేసే కొన్ని బ్లాక్‌బెర్రీ ఫోన్లు మార్కెట్లోకి వచ్చాయి. అవి మామూలుగా పనిచేయనున్నాయి. జనవరి 4వ తేదీ నుంచి బ్లాక్ బెర్రీ 7.1 ఓఎస్ లేదా అంతకుముందు వెర్షన్లు, బ్లాక్ బెర్రీ 10 సాఫ్ట్ వేర్ లేదా అంతకుముందు వెర్షన్లు, బ్లాక్‌బెర్రీ ప్లేబుక్ ఓఎస్ 2.1 లేదా అంతకుముందు వెర్షన్లపై పనిచేసే ఫోన్లకు రియలబ్లీ ఫంక్షన్ పనిచేయబోదని కంపెనీ తన వెబ్‌సైట్లో పేర్కొంది.
అంటే బ్లాక్ బెర్రీ ఫోన్లకు సెల్యులార్, వైఫై కనెక్టివిటీ పనిచేయబోదన్న మాట. ఫోన్ కాల్స్, టెక్స్ట్ మెసేజెస్, ఎమర్జెన్సీ కాల్స్ కూడా పని చేసే అవకాశం లేదని కంపెనీ తెలిపింది. బ్లాక్‌బెర్రీ స్మార్ట్ ఫోన్లు ప్రజల్లో ఆదరణ కోల్పోయి చాలా కాలం అవుతుండటంతో... కంపెనీ ఈ నిర్ణయం తీసుకోవడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు.
Also Read: Tecno Camon 18: ముందు, వెనక 48 మెగాపిక్సెల్ కెమెరాలు.. ధర రూ.15 వేలలోపే.. వైర్‌లెస్ ఇయర్‌బడ్స్ ఫ్రీ!
Also Read: Honor 60: 108 మెగాపిక్సెల్ కెమెరాతో హానర్ కొత్త ఫోన్.. వ్లాగర్ల కోసం ప్రత్యేక ఫీచర్ కూడా!
Also Read: Lost Aadhar Card: ఆధార్ కార్డు పోయిందా.. స్మార్ట్ ఫోన్‌లో ఇలా చేస్తే చాలు.. కొత్త ఆధార్ ఇంటికి!
Also Read: Moto G51 5G: అత్యంత చవకైన మోటో 5జీ ఫోన్ వచ్చేస్తుంది.. మరో వారంలో లాంచ్.. ధర ఎంతంటే?