X

Amazon Festival Sale: శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్‌పై అమెజాన్‌లో సూపర్ ఆఫర్.. ఫెస్టివల్ స్పెషల్ ఇదే!

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ స్మార్ట్ ఫోన్‌పై భారీ ఆఫర్లు అందించారు.

FOLLOW US: 

శాంసంగ్ ఇటీవలే లాంచ్ చేసిన పవర్ ఫుల్ 5జీ ఫోన్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ. ఇందులో పవర్ ఫుల్ ప్రాసెసర్, పవర్ ఫుల్ బ్యాటరీ, అదిరిపోయే కెమెరా అందించారు. ఈ ఫోన్ ఐదు రంగుల్లో అందుబాటులో ఉంది. ఇప్పుడు ఈ ఫోన్‌పై డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో తక్కువ ధరకే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

అమెజాన్ నవరాత్రి ఆఫర్ల గురించి తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఫోన్ అసలు ధర రూ.38,999 కాగా, రూ.3,000 తగ్గింపును అందించారు. దీంతో ఫోన్ ధర రూ.35,999కు తగ్గింది. సిటీ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఇండస్ ఇండ్ బ్యాంకు కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,250 అదనపు తగ్గింపు లభించనుంది. అప్పుడు మరింత తగ్గి రూ.34,749కే అందుబాటులోకి రానుంది. దీంతోపాటు రూ.15,000 వరకు ఎక్స్‌చేంజ్ ఆఫర్ కూడా అందించారు. ఇది మీ పాత ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది.

ఈ ఆఫర్లతో పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అంటే వడ్డీ లేకుండా వాయిదాల్లో నగదు చెల్లించవచ్చన్న మాట.

శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ స్పెసిఫికేషన్లు
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమోఎల్ఈడీ ఇన్‌ఫినిటీ-ఓ డిస్ ప్లేను అందించారు. దీని రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది. క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. దీని బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. 25W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.

8 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది. దీన్నిమైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకునే అవకాశం ఉంది. ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్ యూఐ 3 ఆపరేటింగ్ సిస్టంపై శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ పనిచేయనుంది. 

ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 64 మెగాపిక్సెల్‌గా ఉండగా, దీంతోపాటు 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ కూడా ఉన్నాయి. ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు.

5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ వంటి కనెక్టివిటీ ఫీచర్లు కూడా ఇందులో అందించారు. దీని మందం 0.84 సెంటీమీటర్లుగానూ, బరువు 189 గ్రాములుగానూ ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ52ఎస్ 5జీ కొనడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tags: amazon Amazon Festival Sale Amazon Festival Sale 2021 Amazon Great India Festival Sale Samsung Galaxy A52s Amazon Festival Offers

సంబంధిత కథనాలు

Redmi Note 11T 5G: రెడ్‌మీ 5జీ ఫోన్ రూ.15 వేలలోపే .. సేల్ ఈరోజే! ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?

Redmi Note 11T 5G: రెడ్‌మీ 5జీ ఫోన్ రూ.15 వేలలోపే .. సేల్ ఈరోజే! ఆఫర్లు ఎలా ఉన్నాయంటే?

Redmi 10 2022: రెడ్‌మీ 10 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధర రూ.12 వేలలోనే?

Redmi 10 2022: రెడ్‌మీ 10 సిరీస్‌లో కొత్త ఫోన్లు.. ధర రూ.12 వేలలోనే?

WhatsApp Update: వాట్సాప్ చాటింగ్ మెస్సేజ్‌లతో విసిగిపోయారా.. మరో సరికొత్త ఫీచర్ వచ్చేసింది

WhatsApp Update: వాట్సాప్ చాటింగ్ మెస్సేజ్‌లతో విసిగిపోయారా.. మరో సరికొత్త ఫీచర్ వచ్చేసింది

Realme 9i: రియల్‌మీ కొత్త ఫోన్ ఫీచర్లు లీక్.. ధర రూ.15 వేలలోపే?

Realme 9i: రియల్‌మీ కొత్త ఫోన్ ఫీచర్లు లీక్.. ధర రూ.15 వేలలోపే?

Highest YouTube Subscribers: భారతీయ యూట్యూబ్ చానెల్ ప్రపంచ రికార్డు.. ఏకంగా 200 మిలియన్ సబ్‌స్కైబర్లు!

Highest YouTube Subscribers: భారతీయ యూట్యూబ్ చానెల్ ప్రపంచ రికార్డు.. ఏకంగా 200 మిలియన్ సబ్‌స్కైబర్లు!

టాప్ స్టోరీస్

Tesla Car in Space: అంతరిక్షంలో వదిలిన ఎలన్ మస్క్ టెస్లా కారు ఇప్పుడు ఎక్కడుంది? భూమి వైపు దూసుకొస్తుందా?

Tesla Car in Space: అంతరిక్షంలో వదిలిన ఎలన్ మస్క్ టెస్లా కారు ఇప్పుడు ఎక్కడుంది? భూమి వైపు దూసుకొస్తుందా?

Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?

Sasikala Meets Rajinikanth: తమిళనాడు రాజకీయంలో కొత్త ట్విస్ట్.. శశికళ కొత్త పార్టీ పెడుతున్నారా?

Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!

Watch Video: ఇదేమి అంపైరింగ్‌ సామీ..! కాళ్లు పైకెత్తి వైడ్‌ ఇచ్చిన అంపైర్‌.. అవాక్కైన ఫ్యాన్స్‌!

Akhanda: ప్రతీ తెలుగువాడు చూడాల్సిన సినిమా.. బాలయ్య సినిమాకి కూతురు రివ్యూ.. 

Akhanda: ప్రతీ తెలుగువాడు చూడాల్సిన సినిమా.. బాలయ్య సినిమాకి కూతురు రివ్యూ..