Free Fire Max Tricks: ఫ్రీ ఫైర్‌లో ఈ ఐదు టిప్స్ పాటిస్తే చాలు - మీరు ప్రో ప్లేయర్స్ అయిపోతారు!
Free Fire Max Tips: మీరు ఇటీవలే ఫ్రీ ఫైర్ మ్యాక్స్ గేమ్‌ను ఇన్‌స్టాల్ చేసినట్లయితే కొన్ని టిప్స్ ఫాలో అయితే ప్రో ప్లేయర్‌గా మారిపోవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Free Fire Max: ఫ్రీ ఫైర్ మాక్స్ భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన బ్యాటిల్ రాయల్ గేమ్‌లలో ఒకటి. దీని ప్రత్యేకత ఏమిటంటే దీన్ని ప్లే చేయడానికి ఖరీదైన స్మార్ట్‌ఫోన్ అవసరం లేదు. బడ్జెట్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లలో కూడా ఈ గేమ్ సాఫీగా నడుస్తుంది. దీని గ్రాఫిక్స్, గేమ్‌ప్లేను చాలా బాగా ఆప్టిమైజ్ చేశారు. కాబట్టి చవకైన ఫోన్‌లలో కూడా ఎటువంటి అంతరాయం లేకుండా ఆడవచ్చు. భారతదేశంలోని టీనేజర్లు దీన్ని ఎక్కువగా ఇష్టపడటానికి ఇదే కారణం. మీరు ఈ గేమ్ ఇటీవలే ఆడటం మొదలు పెడితే కొన్ని ప్రత్యేక టిప్స్, ట్రిక్స్ మీకు సహాయపడతాయి.
ఫ్లైట్ నుంచి వెంటనే దూకేయకండి
ఫ్రీ ఫైర్ మాక్స్ ఆడే కొత్త గేమర్‌లు గేమ్ ప్రారంభమైన వెంటనే విమానం నుంచి మ్యాప్‌లోకి దూకుతారు. అటువంటి పరిస్థితిలో మీరు మ్యాప్‌లోకి దూకిన వెంటనే మీరు ఓడిపోయే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రారంభంలో చాలా మంది గేమర్‌లు కలిసి దిగుతారు. అందువల్ల కొత్త గేమర్‌లుగా, మీరు ఫ్లైట్ నుంచి దిగడానికి తొందరపడకూడదు. మీరు కొంచెం ఆలస్యంగా మ్యాప్‌లోకి వెళ్లాలి. దీని ద్వారా మీరు మ్యాప్‌లోకి దిగే సమయానికి కొంతమంది గేమర్‌లు చనిపోతారు. మీకు పోటీ కొంచెం తగ్గుతుంది.
మ్యాప్‌లో ఖాళీ ప్రదేశాన్ని చూసుకుని దూకాలి
మీరు మ్యాప్‌పైకి వెళ్లే ముందు ఏ స్థలం ఎక్కువ ఖాళీగా ఉందో జాగ్రత్తగా చూడండి. మీరు ఫ్లైట్ నుంచి పారాచూట్‌తో కిందకు దిగినప్పుడు కిందకి దగ్గరగా వచ్చినప్పుడు ఏ ప్రదేశంలో తక్కువ మంది పోరాడుతున్నారో జాగ్రత్తగా చూడండి. ఇది మీ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Also Read: ఇండియాలో అమెజాన్ మొట్టమొదటి బ్లాక్ ఫ్రైడే సేల్ - స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు!
ల్యాండింగ్ తర్వాత ఆయుధాలను సేకరించండి
మ్యాప్‌లో దిగిన వెంటనే మొదట మీరు వివిధ రకాలైన ఆయుధాలను సేకరించాలి. ఇది మీరు పోరాడటాన్ని సులభతరం చేస్తుంది. కొత్త గేమర్లు ఆయుధాల కొరత కారణంగా దాడిని ఎదుర్కోలేక చనిపోవడం చాలా సార్లు జరుగుతుంది.
డేంజర్ జోన్ నుంచి దూరంగా ఉండండి
మీరు ఎల్లప్పుడూ డేంజర్ జోన్‌పై నిఘా ఉంచాలి. మ్యాప్‌లో నడుస్తున్నప్పుడు డేంజర్ జోన్‌పై నిఘా ఉంచండి. దానికి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.
ప్రత్యర్థులను చంపడానికి వాహనాలను కూడా ఉపయోగించండి
మీరు మ్యాప్‌లో జీప్, కారు, ట్రక్, ట్రాక్టర్, ట్యాంక్ వంటి ఏదైనా భారీ వాహనం కనిపిస్తే దాన్ని ఉపయోగించడం నేర్చుకోండి. అందులో కూర్చున్న తర్వాత ప్రత్యర్థుల పైకి వాహనం నడిపి వారిని చంపేయవచ్చు. అయితే వాహనంలో మంటలు చెలరేగితే మాత్రం మీరు దాని నుంచి త్వరగా బయటపడాలి.
Also Read: 16 ఏళ్లలోపు పిల్లలకు నో సోషల్ మీడియా - ఆస్ట్రేలియాలో కొత్త రూల్ - ఇండియాకు కూడా వస్తుందా?
👋 Greetings, Survivors! Just a heads-up for our enhanced Armory features.
— Garena Free Fire North America (@FreeFire_NA) July 3, 2024
🛠️ We've added bar graphs 📊 to better understand weapon attributes.
Customize weapons by combining your favorite skin look 🎨 with the attributes you like using the Gunsmith system.
#FreeFireUpdate pic.twitter.com/G0mJt6mGjW