అన్వేషించండి

Amazon Black Friday Sale 2024: ఇండియాలో అమెజాన్ మొట్టమొదటి బ్లాక్ ఫ్రైడే సేల్ - స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు!

Black Friday Sale in India: దిగ్గజ ఈ-కామర్స్ బ్రాండ్ అమెజాన్ మనదేశంలో బ్లాక్ ఫ్రైడే సేల్‌ను షురూ చేసింది. ఈ సేల్‌లో భాగంగా స్మార్ట్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లపై భారీ ఆఫర్లు లభించనున్నాయి.

Amazon Black Friday Sale 2024 Offers: అమెజాన్ మనదేశంలో మొట్టమొదటి బ్లాక్ ఫ్రైడే సేల్‌ను ప్రకటించింది. నవంబర్ 28వ తేదీ నుంచే ఈ సేల్ ప్రారంభం అయింది. స్మార్ట్ ఫోన్లు, టీవీలు, గృహోపకరణాలు, గేమింగ్ కన్సోల్స్, ఫ్యాషన్, బ్యూటీ ప్రొడక్ట్స్ వంటి వాటిపై వినియోగదారులకు డిస్కౌంట్లు ఇవ్వనున్నారు. అంతే కాకుండా ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులతో ట్రాన్సాక్షన్ చేస్తే ఇన్‌స్టంట్ డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ కూడా లభించనున్నాయి. డిసెంబర్ 2వ తేదీ వరకు ఈ బ్లాక్ ఫ్రైడే సేల్ జరగనుంది.

అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్ 2024 ఆఫర్లు ఇవే...
అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా 5జీపై భారీ ఆఫర్ అందించారు. ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర రూ.1,24,999 కాగా, సేల్‌లో రూ.74,999కే కొనుగోలు చేయవచ్చు. యాపిల్, ఐకూ, వన్‌ప్లస్, రియల్‌మీ, రెడ్‌మీ, టెక్నో వంటి ప్రముఖ కంపెనీల స్మార్ట్ ఫోన్లపై ఏకంగా 40 శాతం వరకు తగ్గింపు లభించనుంది.

మ్యాక్‌బుక్‌పై కళ్లు చెదిరే ఆఫర్...
అమెజాన్‌లో యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ (ఎం1, 2020 మోడల్) ల్యాప్‌టాప్‌పై మంచి ఆఫర్ ఉంది. దీని లిస్టింగ్ ధర రూ.89,900 కాగా, అమెజాన్‌లో కేవలం రూ.59,990కే కొనుగోలు చేయవచ్చన్న మాట. అంటే ఏకంగా రూ.30 వేల వరకు డిస్కౌంట్‌ను అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌లో పొందవచ్చు.

Also Read: రూ.ఏడు వేలలోపే 50 మెగాపిక్సెల్ కెమెరా ఫోన్ - లావా యువ 4 వచ్చేసింది!

స్మార్ట్ టీవీలపై 65 శాతం తగ్గింపు
అమెజాన్‌లో స్మార్ట్ టీవీలపై ఏకంగా 65 శాతం వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. అలాగే ప్లేస్టేషన్ 5పై ఏకంగా రూ.7,500 ఫ్లాట్ డిస్కౌంట్ అందించారు. అమెజాన్ బ్రాండ్ల ఉత్పత్తులపై కనీసం 50 శాతం తగ్గింపును బ్లాక్ ఫ్రైడే సేల్ సమయంలో అందిస్తున్నారు. రోబోట్ వాక్యూమ్ క్లీనర్ల వంటి ప్రీమియం కిచెన్ అప్లయన్స్‌పై కనీసం 50 శాతం, అమెజాన్ అలెక్సా, ఫైర్ టీవీ డివైస్‌లపై 25 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.

ధరలు తగ్గించడంతో పాటు ఎంపిక చేసిన డెబిట్, క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐసీఐసీఐ బ్యాంకు, ఐడీఎఫ్‌సీ ఫస్ట్ బ్యాంకు, వన్ కార్డ్ లాంటివి ఈ లిస్ట్‌లో ఉన్నాయి. అమెజాన్ కో బ్రాండెడ్ కార్డులతో షాపింగ్ చేస్తే అమెజాన్ ప్రైమ్ కస్టమర్లకు ఏకంగా ఐదు శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది.

మనదేశంలో అమెజాన్ బ్లాక్ ఫ్రైడే సేల్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. ఇంతవరకు ఈ దిగ్గజ ఈ-కామర్స్ ప్లాట్‌ఫాం ఒక్కసారి కూడా మనదేశంలో బ్లాక్ ఫ్రైడే సేల్‌ను నిర్వహించలేదు. ఎందుకంటే బ్లాక్ ఫ్రైడే సేల్‌కు గతంలో యూఎస్‌లో ఉన్నంత ఆదరణ ఇక్కడ ఉండేది కాదు. ఇక్కడ చాలా మందికి బ్లాక్ ఫ్రైడే సేల్ గురించి ఎక్కువ అవగాహన కూడా ఉండేది కాదు. కానీ ప్రస్తుతం బ్లాక్ ఫ్రైడే సేల్ గురించిన వివరాలు టైర్ 2, 3 నగరాలకు కూడా పాకాయి. దీని కారణంగా అమెజాన్ కూడా మొదటి సారి ఈ సేల్‌ను నిర్వహిస్తుంది.

Also Read: సూపర్ కెమెరా, భారీ బ్యాటరీలతో లాంచ్ అయిన రెడ్‌మీ కే80 సిరీస్ - ధర ఎంతంటే?

టాప్ హెడ్ లైన్స్

YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు

వీడియోలు

Dussehra in Telangana and Andhra Pradesh | బతుకమ్మ కేవలం తెలంగాణలోనే ఎందుకు చేస్తారు?
Uses of GPS Vests Worn by Cricket Players | ప్లేయర్స్ వేసుకునే జీపీఎస్ జాకెట్ తో లాభం ఏంటి?
400-Year History of Mysore Dussehra 2026 | ప్రపంచ ప్రసిద్ధ మైసూర్ దసరా ప్రత్యేకత
Virat Kohli Test Retirement & Ajit Agarkar | కోహ్లీ రిటైర్మెంట్‌పై వసీం జాఫర్ సంచలన వ్యాఖ్యలు
Tilak Varma Fist Bump Runout vs West Indies | వెస్టిండీస్‌పై తిలక్ వర్మ మైండ్ బ్లాంక్ రనౌట్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Jagan Cases: జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
జగన్ అక్రమాస్తుల కేసులో కీలక పరిణామం.. రోజువారీ విచారణకు సీబీఐ కోర్టు నిర్ణయం
AP NDA Seat Sharing: సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
సీట్ల కేటాయింపుపై మరోసారి కూటమి నేతల భేటీ.. జనసేన డిమాండ్‌ నెరవేరుతుందా?
APPSC Group 2: నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
నిరుద్యోగులకు ఏపీపీఎస్సీ గుడ్‌న్యూస్.. 1,466 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు.. గ్రూప్-2లో 686 ఉద్యోగాలు!
Droupadi Murmu Durga Temple Visit: ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
భక్తులకు అలర్ట్.. ఇంద్రకీలాద్రికి రానున్న రాష్ట్రపతి ముర్ము.. భద్రతా కారణాలతో పలు మార్పులు
Janasena Seat Sharing: ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
ఏపీ స్థానిక ఎన్నికలు..కూటమి ముందు జనసేన భారీ డిమాండ్.. 2,091 స్థానాలు కేటాయించాలని ప్రతిపాదన
Salur Municipal Chairperson Post: పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
పదవి కోసం రాత్రికి రాత్రే పెళ్లి ఫిక్స్! సాలూరులో మున్సిపల్ ఛైర్మన్ సీటు కోసం కొత్త డ్రామా
Shikhar Dhawan Warning: పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
పాక్ ప్లేయర్లతో కలిసి ఆడే ప్రసక్తే లేదంటూ గబ్బర్ ఆగ్రహం.. వరల్డ్ టీ20 కాంటినెంట్ కప్ నిర్వాహకులపై లీగల్ వార్
Dalit Denied Entry to Temple: గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
గుడిలోకి వెళ్లకుండా దళితుడ్ని అడ్డుకున్న ఎమ్మెల్యే బంధువు.. వనపర్తిలో దుమారం
Embed widget