Virat Kohli : టీ-20 ప్రపంచకప్ 2024లో విరాట్ కోహ్లీని చూడలేమా?
T20 World Cup 2024: టీంఇండియాను ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో గెలిపించాడు విరాట్‌కోహ్లీ. గత ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆట తీరు చూసిన ఎవరైనా టీంకి విరాట్ ఎంత కీలకమో చెప్పొచ్చు
Team India: టీమిండియా ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ మజా నుంచి క్రికెట్ అభిమానులు టీ-20 మజాకు వచ్చేశారు .టెస్ట్ సిరీస్‌లో మన వాళ్ల అద్భుత ఆటతీరు, దూకుడుగా ఆడిన విధానం అభిమానులకు మంచి ట్రీట్ అందించిందనే చెప్పాలి. ఇక అభిమానులకు అసలైన విందు అందించే ఇండియన్ ప్రీమియర్‌లీగ్ మార్చి 22 న ఆరంభం కాబోతోంది. ఆ తర్వాత టీ-20 ప్రపంచకప్ జూన్‌లోనే మొదలవబోతోంది. దీంతో బీసీసిఐ కూడా తుది ఆటగాళ్ల ఎంపికపై దాదాపు ఓ నిర్ణయానికి వచ్చేసింది. అయితే అందర్నీ ఆశ్చ్యర్య పరిచేలా టీ-20 ప్రపంచకప్‌నకు టీంఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ని ఎంపిక చేయట్లేదట బీసీసిఐ. అయితే, ఎందుకు ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది ? అసలు దీని వెనుక ఎవరున్నారు ? ఒకవేళ కోహ్లీని ఎంపిక చేయకపోతే ఆ స్థానానికి సరిపోయే ఆటగాడు ఎవరు ?
విరాట్‌కోహ్లీ... టీంఇండియాను ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటిచేత్తో విజయాలతీరానికి చేర్చిన మొనగాడు. గత ప్రపంచకప్‌లో మన చిరకాల ప్రత్యర్ధి పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లి ఆట తీరు చూసిన ఎవరైనా విరాట్ కోహ్లి టీంఇండియాకు ఎంత కీలకమో అర్ధం చేసుకోగలరు. కానీ, ఈ ఏడాది జరగబోయే టీ-20 ప్రపంచకప్‌నకు మాత్రం ఈ స్టార్ ఆటగాడిని దూరం పెట్టాలని చూస్తోందట బీసీసిఐ. అంతేకాదు... కోహ్లీ కి ఈ విషయం ముందుగానే చేరవేశారు అని కూడా అంటున్నారు.
అయితే, టీంఇండియా గత ప్రపంచకప్‌లో అద్భుత ఆటతీరు కనబర్చి పైనల్ కి చేరింది. తృటిలో వరల్డ్‌కప్ చేజారినా ఈ టోర్నమెంట్‌లో విరాట్ ఆడిన ఇన్నింగ్స్ అందరికి గుర్తే. 765 పరుగులు సాధించి లీడింగ్ రన్‌స్కోరర్ గా రికార్డ్ సాధించాడు. దాదపు 95 యావరేజ్‌తో ఆడిన కోహ్లీ మెత్తం 3 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలతో కదం తొక్కాడు. ఇంత అద్భుత ఫాంలో ఉన్న విరాట్ ఇంగ్లాండ్‌తో టెస్ట్ సిరీస్ లో ఆడలేదు. కొడుకు పుట్టడంతో దూరంగా ఉండాల్సి వచ్చింది.
గత టీ20 వరల్డ్ కప్‌లో టీమిండియా సెమీఫైనల్లో ఓడిపోయింది... అయినా కూడా విరాట్ అద్భుత ప్రదర్శన చేశాడు. ముఖ్యంగా ఓడిపోతామనుకొన్న పాకిస్థాన్ తో మ్యాచ్‌లో 53 బాల్స్‌లో 82 పరుగులు చేసి అద్భుత విజయాన్ని అందించాడు. మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో 98.66 యావరేజ్‌తో 296 రన్స్ చేసిన కోహ్లి టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగానూ నిలిచాడు. అసలు పాక్‌తో మ్యాచ్ గెలిచాక టీంఇండియా అభిమానులు వరల్డ్‌కప్ గెలిచినంత సంబరపడ్డారు. ఇదంతా కోహ్లీ ఘనతే.
జూన్‌లో జరగబోయే టీ-20 ప్రపంచకప్‌కోసం భారత్ రోహిత్ శర్మ సారథ్యంలో బరిలోకి దిగనుంది అని జైషా ఇప్పటికే ప్రకటించాడు. కానీ కోహ్లీ గురించిన సమాధానం మాత్రం దాటవేశాడు. భారత చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కోహ్లి ఎంపిక విషయాన్ని చూస్తున్నాడని ఈ మేరకు నిర్ణయాన్ని బీసీసీఐ అతనికే వదిలేసాడని కూడ వార్తలు వినిపిస్తున్నాయి. మరో వైపు ఈ అంశంపై ఇతర బీసీసిఐ పెద్దలు చొరవ చూపడానికి సిద్ధంగా లేరని తెలుస్తోంది.
2013లో ఛాంపియన్స్ ట్రోఫీ నెగ్గిన భారత్ తర్వాత ఇప్పటి దాకా ఒక్క ఐసీసీ ట్రోఫీ కూడా గెలవని నేపథ్యంలో.. కఠిన నిర్ణయాలకు బీసీసీ సిద్ధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లిని టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేయకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్‌లో అత్యద్భుతంగా రాణిస్తే తప్పితే.. కోహ్లిని టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసే అవకాశం లేదని కూడా బీసీసిఐ భావిస్తోందట.
అటు, 2022లో జరిగిన టీ20 వరల్డ్ కప్ తర్వాత కోహ్లి ఈ ఏడాది జనవరిలో అప్ఘానిస్థాన్‌తో జరిగిన టీ20 సిరీస్ ఆడాడు. ఏడాదికిపైగా భారత్ తరఫున టీ20ల్లో ఆడలేదు. అయితే ఆ సిరీస్ లో దూకుడుగా ఆడాలని కోహ్లీకి అగార్కర్ సూచించినట్లు కూడా వార్తలొచ్చాయి. ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్‌లో కోహ్లీ పెద్దగా పరుగులు చేయకపోవడం, ప్రపంచకప్‌లో కూడా నెమ్మదిగా ఆడటంవల్ల దూకుడుగా ఆడటంలో కోహ్లి కాస్త వెనకబడ్డట్లు కూడా బీసీసిఐ భావిస్తోందట.
ఇప్పటికే జట్టులో కుర్రాళ్లు బాగా పోటీపడటం...ఓపెనింగ్‌లో రోహిత్ తో పాటు శుభ్‌మన్‌గిల్, యశస్వి జైశ్వాల్ ఉండటం.... కె.యల్. రాహుల్, రింకూ సింగ్,తిలక్ వర్మ, శివమ్ దూబే, హార్ధిక్ పాండ్యా లాంటివాళ్లు టీం మిడిలార్డర్‌లో ఉండటం, సూర్యకుమార్ యాదవ్ ఫస్ట్‌డౌన్ లో బ్యాటింగ్ చేయడానికి సిద్ధంగా ఉండటం కూడా బీసీసీఐ ఈ ఆలోచనకు కారణమని అనుకొంటున్నారు. కానీ, ఎంతమంది ఉన్నా జట్టులో విరాట్ ఉంటే ఆ బలమే వేరని, బ్యాటింగ్‌లోనే కాదు తన అద్భుత ఫీల్డింగ్‌తోనూ జట్టు విజయాలకు కారకుడవుతాడని బీసీసిఐలోనే మరికొంతమంది అంటున్నారు.
అయితే, 2024 టీ20 ప్రపంచకప్‌నకు కోహ్లిని ఎంపిక చేయకపోవచ్చే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో విరాట్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. టీ20 లకు మాత్రమే కాదు, క్రికెట్ లో కోహ్లీ రికార్డులను గుర్తుచేస్తున్నారు. గతంలో గెలిపించిన మ్యాచ్‌లను గుర్తు చేస్తున్నారు. బీసీసిఐ ఈ ఆలోచనను తక్షణం విరమించుకోవాలనే కింగ్ కోహ్లీ జట్లులో ఉండాల్సిందే అని అభిప్రాయపడుతున్నారు.
ఏది ఏమైనా ఈ సారి ఐపీయల్ ని బీసీసిఐ కూడా చాలాసీరియస్ గా తీసుకొనే అవకాశమే ఉంది. మే మొదటి వారంలో జట్టు ఆటగాళ్ల వివరాలను ఐసీసీకి అందజేయాల్సి ఉంది. ఈలోగా బీసీసిఐ ఏ నిర్ణయం తీసుకొంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.