VVS Laxman Refuse BCCI Offer: షాక్..! బీసీసీఐ ఆఫర్ తిరస్కరించిన వీవీఎస్ లక్ష్మణ్.. ఎందుకంటే?
మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ బీసీసీఐకి షాకిచ్చాడు! ఎన్సీయే డైరెక్టర్‌గా ఉండేందుకు నిరాకరించాడని తెలిసింది. బోర్డు పెద్దలు ఆయన్ను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని వినికిడి.
టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ బీసీసీఐకి షాకిచ్చాడు! జాతీయ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ఉండేందుకు నిరాకరించాడని తెలిసింది. బోర్డు పెద్దలు ఆయన్ను ఒప్పించేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని సమాచారం.
ప్రస్తుతం బెంగళూరులోని ఎన్‌సీయేకు రాహుల్ ద్రవిడ్ డైరెక్టర్‌గా ఉన్నారు. త్వరలోనే ఆయన టీమ్‌ఇండియా ప్రధాన కోచ్‌గా ఎంపిక అవుతారని బీసీసీఐ వర్గాలు పరోక్షంగా సూచనలు చేశాయి. నిజానికి అతడు అంగీకరించపోయినా అనేక చర్చల తర్వాత ఒప్పుకున్నారని తెలిసింది. రవిశాస్త్రికి ఏటా రూ.5.5 కోట్లు వేతనంగా ఇవ్వగా ద్రవిడ్‌కు ఏకంగా రూ.10 కోట్లు ఆఫర్ చేశారని అంటున్నారు. టీ20 ప్రపంచకప్ తర్వాత ద్రవిడ్ కోచ్‌గా రానున్నారు. 2023 వరకు ఉంటారని సమాచారం.
ద్రవిడ్ భారత కోచ్‌గా వస్తే ఎన్‌సీయే చీఫ్ పదవి ఖాళీ అవుతుంది. భారత క్రికెట్లో పేరున్న, రాణించిన, అనుభవం ఉన్న వ్యక్తిని నియమించాలని బీసీసీఐ భావిస్తోంది. అందుకు వీవీఎస్ లక్ష్మణే సరైన వ్యక్తిగా అనుకుంటోంది. అయితే బోర్డు ఇచ్చిన ఆఫర్‌ను ఆయన సున్నితంగా తిరస్కరించారని తెలిసింది. ఎందుకన్న కారణాలు ఇంకా తెలియరాలేదు.
అంతర్జాతీయ క్రికెట్లో వీవీఎస్ లక్ష్మణ్ ప్రభావం అందరికీ తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌ను శాసించే ఆసీస్‌ను చితక్కొట్టేవాడు. 134 టెస్టుల్లో 8781 పరుగులు చేశారు. వీడ్కోలు పలికాక సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు మెంటార్‌గా ఉన్నారు. అంతర్జాతీయ మ్యాచులకు కామెంటరీ చేస్తున్నారు. అంతేకాకుండా బెంగాల్ క్రికెట్ సంఘంలో ఆయన సలహాదారుగా పనిచేస్తున్నారు. బెంగాల్ యువ క్రికెటర్లకు ఆయన బ్యాటింగ్‌లో మెలకువలు నేర్పిస్తున్నారు. వారిని ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నారు. చాలా కమిట్‌మెంట్స్ ఉండటంతో ఆయన ఎన్‌సీయే డైరెక్టర్ పదవిని తిరస్కరిస్తున్నారని కొందరు అంటున్నారు.
Also Read: టీ20 ప్రపంచకప్‌లో ముందే ఫైనల్ ఆడేస్తున్న కోహ్లీసేన! ఇప్పటి వరకు పాక్‌పై తిరుగులేని భారత్
Also Read: విజయంతో వరల్డ్ కప్ ఖాతా తెరిచిన టీమిండియా.. ఏడు వికెట్లతో ఇంగ్లండ్ చిత్తు
Also Read: గబ్బర్ అవతారమెత్తిన కింగ్.. నీలో మంచి నటుడున్నాడయ్యా అంటున్న నెటిజన్లు!
Also Read: కూతురితో కోహ్లీ ఫొటో.. ‘ఒక్క ఫ్రేమ్‌లో నా మొత్తం హృదయం’ అన్న అనుష్క!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
The game of cricket is considered incomplete without its devoted fans, the #GameKeDeewane! If you are a die-hard fan of the game, then here's a chance for you to enjoy thoroughly during this T20 season. Download the @My11Circle app and show your deewangi for cricket! pic.twitter.com/zK1cKv3nwX
— VVS Laxman (@VVSLaxman281) October 18, 2021