Viral Video: మాజీ క్రికెటర్ కైఫ్ నోట... మహేశ్ బాబు దూకుడు డైలాగ్... మొన్న సెహ్వాగ్ నోట పవన్ కల్యాణ్ డైలాగ్
తాజాగా మరో మాజీ క్రికెటర్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన దూకుడు సినిమాలోని డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు.
![Viral Video: మాజీ క్రికెటర్ కైఫ్ నోట... మహేశ్ బాబు దూకుడు డైలాగ్... మొన్న సెహ్వాగ్ నోట పవన్ కల్యాణ్ డైలాగ్ Mohammed Kaif delivers Mahesh Babu’s Dookudu dialogue Viral Video: మాజీ క్రికెటర్ కైఫ్ నోట... మహేశ్ బాబు దూకుడు డైలాగ్... మొన్న సెహ్వాగ్ నోట పవన్ కల్యాణ్ డైలాగ్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/09/10/7b898d47a7a2c41c9ca9d02facd5acc4_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
రెండు రోజుల క్రితం టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్... పవన్ కల్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాలోని డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో ఎంత వైరల్‌గా మారిందో మనందరికీ తెలిసిందే.
Sehwag Naidu mass 🔥🔥🔥 pic.twitter.com/y8fj0674sG
— Chirag Arora (@Chiru2020_) September 6, 2021
తాజాగా మరో మాజీ క్రికెటర్ ప్రిన్స్ మహేశ్ బాబు నటించిన దూకుడు సినిమాలోని డైలాగ్ చెప్పి ఆకట్టుకున్నాడు. ఇంతకీ ఆ మాజీ క్రికెటర్ ఎవరంటే మహమ్మద్ కైఫ్. ఓ యూ ట్యూబ్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కైఫ్.. దూకుడు సినిమాలోని ‘మైండ్‌లో ఫిక్సైతే బ్లైండ్‌గా వెళ్లిపోతా’ అనే డైలాగ్‌ను చెప్పాడు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అటు మహేశ్ బాబు అభిమానులు... ఇటు క్రికెట్ అభిమానులు కైఫ్ డైలాగ్‌కి ఫిదా అయిపోయారు. ‘బాగా చెప్పావు’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా కైఫ్ చెప్పిన డైలాగ్ వినండి.
Indian Cricketer #MohammedKaif About Superstar #MaheshBabu 🔥🌟
— ꓷ A Я K 🦇 (@GothamHero_) September 8, 2021
"MIND LO FIX AITHE BLIND GA VELLIPOTHA "⚡💥 pic.twitter.com/TCLx62N3kb
నాలుగు రోజుల క్రితం కైఫ్ నాగిని డ్యాన్స్ చేసిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ఓవల్ టెస్టులో ఆతిథ్య ఇంగ్లాండ్ చేతిలో భారత్ గెలిస్తే నాగిని డ్యాన్స్ చేస్తానని కైఫ్... సెహ్వాగ్‌కి మాటిచ్చాడంట. నాలుగో టెస్టు అనంతరం సెహ్వాగ్ ఆ మాటలను గుర్తుచేయగా కైఫ్ నిజంగానే నాగిని డ్యాన్స్ చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.
View this post on Instagram
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)