అన్వేషించండి

World Chess Champion: ఐదోసారి వరల్డ్‌ చెస్‌ ఛాంపియన్‌గా కార్లసన్

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదుసార్లు వరల్డ్ ఛాంపియన్ కావడం మాటలు కాదు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ సాగిన ఆటలో రారాజుగా నిలిచాడు కార్లసన్.

ప్రపంచ చెస్‌ ఛాంపియన్‌గా మాగ్నస్‌ కార్లసన్ మరోసారి నిలిచాడు. దుబాయ్‌లో జరిగిన ఫిడే చెస్‌ ఛాంపియన్‌ షిప్‌లో సత్తా చాటి ఐదోసారి చెస్ రారాజుగా నిలిచాడు. 

ఫిడే వరల్డ్‌ ఛాంపియన్ షిప్‌ ఫైనల్‌లో రష్యా ఆటగాడితో తలపడ్డాడీ చెస్‌ రారాజు. ఇయాన్‌ నెపోనియాచీతో తలపడిన మ్యాచ్‌లో అద్భుతమైన విజయం సాధించి తనకు తిరుగులేదని చాటాడు. 7.5-3.5 తేడాతో ఇంకో మూడు గేమ్‌లు మిగిలి ఉండగానే ఆధిపత్యం చూపి ఛాంపియన్‌గా నిలిచాడు కార్లసన్. 
ఆఖరి వరకు చాలా ఉత్కంఠతో సాగిందీ టోర్నీ. చివరి మ్యాచ్‌ కూడా అదే మజా ఇచ్చింది. ప్రత్యర్థి చేసిన తప్పులను తనకు అనుకూలంగా మలుచుకొని జయభేరీ మోగించాడీ వరల్డ్ ఛాంపియన్. 23వ ఎత్తులో నెపోనియా చేసిన తప్పిదాన్ని అనుకూలంగా మార్చుకొని 49 ఎత్తుల్లో గేమ్‌ క్లోజ్ చేసేశాడు కార్లసన్. 
మెగా టోర్నీల్లో రెండోసారి నల్లపావులతో బరిలోకి దిగిన ఈ చెస్‌ దిగ్గజం... నాలుగో విజయాన్ని తన అకౌంట్‌లో వేసుకున్నాడు. టోర్నీలో మొదట్లో అంతగా ప్రభావం చూపలేకపోయిన కార్లసన్‌ క్రమంగా పుంజుకున్నాడు. తొలి ఐదు గేమ్‌లను డ్రాగా ముగించాడు. తర్వాత నుంచి గేర్ మార్చి ఛాంపియన్ అయ్యాడు. 
కార్లసన్ తన కేరీర్‌లో ఐదోసారి ప్రపంచ ఛాంపియన్ అయ్యాడు. నాలుగోసారి తన టైటిల్ నిబెట్టుకున్నాడు. తొలిసారిగా 2013లో భారత్‌ చెస్ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌పై విజయం సాధించాడు కార్లసన్. 

Also Read: ఆగని విరాట్ మంట.. జట్టును నాశనం చేయడం సులభం అన్న మాజీ క్రికెటర్!

Also Read: Hardik Pandya Test Retirement: హార్దిక్‌ పాండ్య సంచలన నిర్ణయం.. టెస్టు క్రికెట్‌కు వీడ్కోలు యోచనలో ఆల్‌రౌండర్‌!

Also Read: ICC Test Rankings: మయాంక్‌ దూకుడు..! 10 వికెట్ల అజాజ్‌ ర్యాంకు ఎంత మెరుగైందంటే..!

Also Read: Watch: మళ్లీ కలిసిన యువీ, ధోనీ..! ఎక్కడ.. ఎందుకు?

Also Read: Australian Open 2022: ఆస్ట్రేలియన్ ఓపెన్‌కు ఆ స్టార్ ఆటగాడు దూరం.. వీరిద్దరికీ లక్కీ చాన్స్!

Also Read: Rahul Dravid: ద్రవిడ్‌ శాసనం..! కుంబ్లే నాటి రూల్‌ కఠినతరం చేసిన వాల్‌.. ఇక ఎంత పెద్ద ఆటగాడైనా..!!

Also Read: Team India Announced: రోహిత్‌కు ప్రమోషన్.. పరిమిత ఓవర్లకు పూర్తిస్థాయి కెప్టెన్.. కింగ్ కోహ్లీ టెస్టుల వరకే!

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

MS Dhoni Christmas Santa | జివా అడిగితే ధోనీ చేయకుండా ఉంటాడా | ABP DesamChiranjeevi Meeting CM Revanth Reddy | సినీ పరిశ్రమ సమస్యలపై సీఎంతో భేటీ | ABP Desamకశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లో

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Telangana CM Revanth Reddy: తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
తెలంగాణ సీఎంతో సమావేశాలో పాల్గొనే సినీ ప్రముఖులు వీళ్లే 
Nandyal  News:   కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య -  వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
కొడుకు ట్రాన్స్ జెండర్ లవ్ - తల్లిదండ్రుల ఆత్మహత్య - వాళ్ల నిర్ణయం కరెక్టేనా ?
Lookback 2024: ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
ఈ ఏడాది అంతర్జాతీయ వేదికపై సత్తా చాటిన యువ ప్లేయర్లు - భవిష్యత్తుపై భరోసా నింపిన ఆటగాళ్లు
VRS For Wife: విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
విధి అంటే ఇదేనేమో! - అనారోగ్యంతో ఉన్న భార్యను చూసుకునేందుకు వీఆర్ఎస్ తీసుకున్నాడు, ఇంతలోనే!
Airlines Plane Crash: కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
కజకిస్థాన్‌ విమాన ప్రమాదంలో కొత్త కోణం-వీడియో వైరల్
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Embed widget