అన్వేషించండి

Vaibhav Sooryavanshi: "సూర్యవంశీ ఒంట్లో ఏఐ చిప్ ఉందేమో, ల్యాబ్‌లో టెస్టు చేయాలి" పాకిస్తాన్ క్రికెటర్ల విస్మయం!

Vaibhav Sooryavanshi: ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌లో సూర్యవంశీ అత్యంత భయంకరమైన బ్యాటర్‌గా మారాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతను చూపిస్తున్న పరిణతి, ఆత్మవిశ్వాసం ఆమోఘం.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో అద్భుత ప్రతిభ కనబరుస్తున్నాడు.
  • రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు 8 మ్యాచ్‌లలో 357 పరుగులు చేశాడు.
  • పాకిస్థాన్ నిపుణులు అతని ఆటను చూసి ల్యాబ్ పరీక్షలు చేయాలని అంటున్నారు.
  • అతని టెక్నిక్, రిస్ట్ వర్క్ తో బౌలర్లను ఇబ్బంది పెడుతున్నాడు.

Vaibhav Sooryavanshi: ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తన అసాధారణ ప్రతిభతో దుమ్మురేపుతున్నాడు. 15ఏళ్ల ప్రాయంలోనే అంతర్జాతీయ బౌలర్లను ఉతికి ఆరేస్తున్నాడు. దీన్ని చూసిన పాకిస్తాన్ క్రికెట్ పండితులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. అతని ఒంట్లో ఏఐ చిప్ ఉందేమో, ల్యాబ్‌లో టెస్టులు చేయాలని అంటున్నారు. 

బుల్డోజర్‌లా విరుచుకుపడుతున్న బుడ్డోడు

భారత‌్లో క్రికెట్ అనేది కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు. అది ఒక భావోద్వేగం. అందుకే ఏటా జరిగే ఐపీఎల్‌కు అంత క్రేజ్ ఉంటుంది. ఈ ఐపీఎల్‌లో ఎందరో యువ ఆటగాళ్లు తమ సత్తా చాటుకుంటున్నారు. అలాంటి వారిలో ఒకడు సూర్యవంశీ. రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న 15 ఏళ్ల బుడ్డోడు ప్రస్తుతం క్రికెట్ ప్రపంచానికి ప్రశ్నగా మారాడు. ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం బెంబేలెత్తిస్తున్న అతని బ్యాటింగ్ శైలి, ఇప్పుడు పాకిస్థాన్‌లోని క్రికెట్ దిగ్గజాలను కూడా ఆశ్చర్యపరుస్తోంది. 

15 ఏళ్లకే అతని పరిణితి, ఆట అమోఘం

ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌లో సూర్యవంశీ అత్యంత భయంకరమైన బ్యాటర్‌గా మారాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే అతను చూపిస్తున్న పరిణతి, ఆత్మవిశ్వాసం ఆమోఘం. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్‌లలో 357 పరుగులు సాధించి, ఆరెంజ్ క్యాప్ రేసులో రెండో స్థానంలో ఉన్నాడు. అతనిస్ట్రైక్ రేట్‌ 234 కంటే ఎక్కువగా ఉంది. ఇప్పటికే ఒక సెంచరీ సాధించాడు. 

Also Read: మరీ ఇలా ఉన్నావేంటి భయ్యా..టీమిండియాలో చేరాలన్న కసిని IPLలో చూపిస్తున్న శ్రేయస్

ల్యాబ్‌లో టెస్ట్ చేయాలంటున్న పాకిస్తాన్ క్రీడా నిపుణులు

ఐపీఎల్‌ 2026 ప్రారంభం నుంచే తన బ్యాట్‌తో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సాధారణంగా 15-16 ఏళ్ల వయసులో క్రీడాకారులు శరీర ఆకృతి ఇప్పుడిప్పుడే మారుతుంటుంది. కానీ వైభవ్ మాత్రం ఎక్స్‌పీరియన్స,్ ఆటగాడిలా భారీ సిక్సర్స్‌ బాదుతున్నాడు. పాకిస్థాన్ క్రికెట్ నిపుణుడు నౌమాన్ నియాజ్ ఒక షోలో మాట్లాడుతూ... వాడా డోపింగ్ పరీక్షలు చేస్తున్నట్టు వైభవ్ సూర్యవంశీని ఏదైనా ల్యాబ్‌కు పంపించి పరీక్షించాలి. బహుశా అతని శరీరంలో ఏదైనా ఏఐ చిప్ అమర్చి ఉండొచ్చు. అతను మనిషిలా అనిపించడం లేదు" అని చమత్కరించాడు. 

సూర్యవంశీ బ్యాటింగ్‌లో పవర్ కంటే అతని టెక్నిక్, రిస్ట్ వర్క్ కీలక పాత్ర పోషిస్తున్నాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. బంతిని స్టేడియం వెలుపలకు పంపే అతని ఆర్క్‌ అద్భుతంగా ఉందని నౌమాన్ నియోజ్ ప్రశంసించాడు.  

Also Read: రింకూ సింగ్ హిస్టారికల్ నాక్ - ఆరో స్థానంలో వచ్చి ఆకాశమే హద్దుగా విధ్వంసం.. 15 ఏళ్ల ధోనీ రికార్డు గల్లంతు

అసాధారణ ప్రతిభకు ప్రపంచం దాసోహం 

వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనను ప్రత్యేకంగా మార్చిన కొన్ని అంశాలు ఉన్నాయి. అతను పుట్టే నాటికి విరాట్ కోహ్లీ ప్రపంచ ఛాంపియన్‌గా ఎదిగాడు. అటువంటి దిగ్గజాల గురించి తెలుసుకునేలోపే  అదే స్థాయిలో రాణించడం సామాన్య విషయం కాదు. 18 ఏళ్లు వచ్చే వరకు శరీరంలో హార్మోన్ల మార్పులు జరుగుతుంటాయి. కానీ వైభవ్‌ అంత కంటే ముందే కండరాల బలం, కోర్ స్ట్రెంత్‌ ద్వారా ప్రపంచ మేటి బౌలర్లపై ఆధిపత్యం చలాయిస్తున్నాడు. అతను క్రీజ్‌లో ఉన్నప్పుడు బౌలింగ్ వేయడానికి ఒత్తిడికి గురి అవుతున్నారు. సన్‌రైజ్స్ హైదరాబాద వంటి జట్టుపై అతను ఆడిన తీరు చూసి అతని స్ట్రైక్ రేటు 300 ఉండాల్సిందని పాక్ నిపుణులు చెబుతున్నారు. 

Also Read: అరుదైన రీతిలో అవుటైన రఘువంశీ.. ఐపీఎల్ చరిత్రలో నాలుగోసారి! అసలేమిటి ఈ 'అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్' రూల్?

Frequently Asked Questions

వైభవ్ సూర్యవంశీ వయసు ఎంత?

వైభవ్ సూర్యవంశీ వయసు 15 సంవత్సరాలు.

వైభవ్ సూర్యవంశీ ఏ జట్టుకు ఆడుతున్నాడు?

వైభవ్ సూర్యవంశీ రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడుతున్నాడు.

ఐపీఎల్ 2026 లో వైభవ్ సూర్యవంశీ ప్రదర్శన ఎలా ఉంది?

8 మ్యాచ్‌లలో 357 పరుగులు చేసి, స్ట్రైక్ రేట్ 234 కంటే ఎక్కువగా ఉన్నాడు. ఒక సెంచరీ కూడా సాధించాడు.

పాకిస్తాన్ క్రికెట్ నిపుణులు వైభవ్ సూర్యవంశీ గురించి ఏమంటున్నారు?

అతని ఆటతీరు చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, అతనిని ల్యాబ్‌లో పరీక్షించాలని, అతని శరీరంలో ఏఐ చిప్ ఉండవచ్చని చమత్కరించారు.

టాప్ హెడ్ లైన్స్

IPL Hardik Drama: ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
ఆ ఫ్రాంచైజీ ఆఫర్‌ను తిరస్కరించిన హార్దిక్ .. కెప్టెన్సీ కండిషన్ తో రివర్స్ అయిన డీల్
DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !

వీడియోలు

VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Sarfaraz Khan Makes India Test Comeback | టెస్టు టీమ్‌లోకి సర్ఫరాజ్ ఖాన్ బిగ్ కమ్‌బ్యాక్
Gundenininda Gudigantalu Serial August 11 | మనోజ్‌కు శీలా డార్లింగ్ వార్నింగ్
Who Is Mounisha Chowdary Snow Akka? | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో 'స్నో అక్క'
Kadali Satyanarayana in Bigg Boss 10 | బిగ్ బాస్ 10 లోకి రచయిత్రి కడలి సత్యనారాయణ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Adilabad Latest News: నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేసిన కలెక్టర్! గూడానికి ఆయన పేరు పెట్టిన గిరిజనం!
Pocharam Srinivas Reddy:
"అన్నం పెట్టిన కేసీఆర్‌ను మర్చిపోలేను" బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు 
Pawan Kalyan Latest Look:విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
విశాఖ పర్యటనలో పవన్ కళ్యాణ్ - చేతికి కట్టులేకుండా హుషారుగా ఉపముఖ్యమంత్రి !
AP Municipal Elections 2026: ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు కౌంట్‌డౌన్! సెప్టెంబర్‌ 3న ఓటర్ల జాబితా విడుదల! తర్వాత ఏం జరుగుతుంది?
Toyota Hiluxకు గట్టి పోటీ.. Mahindra Scorpio N Pickupలో ఇవన్నీ ఉంటాయా?
మహీంద్రా స్కార్పియో N పికప్‌: ఆగస్టు 14న గ్రాండ్ డెబ్యూ.. టీజర్‌తో రచ్చ మొదలు
NTR Surgery : ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
ఎన్టీఆర్‌కు సర్జరీ కంప్లీట్ - 6 నుంచి 8 వారాల రెస్ట్... డాక్టర్స్ ఏమన్నారంటే?
Defection MLAs: అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
అటు కాంగ్రెస్‌లో అధికారికంగా భాగం కాలేకపోయారు - ఇటు బీఆర్ఎస్‌కూ దూరమే - నిధులూ నిల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకు దారేది?
Anupama Parameswaran : రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
రెండేళ్లు నరకం చూశా - అది టాక్సిక్ రిలేషన్ షిప్... అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్ స్టోరీ
Embed widget