అన్వేషించండి

Shreyas Iyer: మరీ ఇలా ఉన్నావేంటి భయ్యా..టీమిండియాలో చేరాలన్న కసిని IPLలో చూపిస్తున్న శ్రేయస్

టీమిండియాలో చోటు దక్కడం లేదు…సెలక్షన్‌లో పేరు కనిపించడం లేదు…అది చాలామందిని కుంగదీస్తుంది.కానీ శ్రేయాస్ అయ్యర్‌ను మాత్రం…రెచ్చగొట్టింది!

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ అద్భుత విజయాలు సాధిస్తోంది.
  • టీమిండియాకు ఎంపిక కాని కసితో అయ్యర్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.
  • అత్యంత వేగంగా పరుగులు చేస్తూ, నాయకత్వ లక్షణాలను నిరూపించుకుంటున్నాడు.
  • PBKS జట్టును ప్లేఆఫ్స్‌కు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు.

Shreyas Iyer’s Fiery IPL Form: ఈ IPL సీజన్‌లో అన్‌బీటబుల్ జట్టు ఏదైనా ఉందంటే అది పంజాబ్ కింగ్స్-PBKS. వాళ్ల మీద మ్యాచ్ అంటే ఇక ఆ పాయింట్లను దేవుడికిచ్చువోవాల్సిందే అన్నట్లుగా అయిపోయాయి మిగతా టీమ్‌లు. ఆ జట్టును ఆస్థాయిలో నిలబెట్టిన ఆటగాడు.. శ్రేయస్ అయ్యర్. పదేళ్ల కెరీర్‌లోనే రెండుసార్లు తాను లీడ్ చేసిన జట్లను ఫైనల్‌కు తీసుకెళ్లి... ఓసారి కప్ గెలిచిన కెప్టెన్ అతను. CSK, MI వంటి టీమ్‌లు చాలా సీజన్‌లు గెలిచాయి ఇందులో గొప్పేం ఉందనుకోవద్దు. అందులో లేని పవర్ ఇక్కడ ఉంది. ఆ వవర్‌ను జట్టుకు ఇస్తోంది శ్రేయస్ అయ్యర్. ఓ టాప్‌క్లాస్ ఆటగాడినైన తనను టీమిండియా T20కి తీసుకోవడం లేదన్న కోపం.. సెలక్టర్లు పట్టించుకోవడం లేదన్న కసి అతని ఆటతీరులో కనిపిస్తోంది. అదే కసి ఆ టీమ్‌లో కనిపిస్తోది. 

ఇండియాకు తీసుకోరా..? అయితే నేనేంటో చూపిస్తా అంటున్న శ్రేయస్

ప్రతీమ్యాచ్‌లో గెలవాలన్న కసి.. తానేంటో చూపించాలన్న పట్టుదల శ్రేయస్  ఆటలో కనిపిస్తోంది. IPL 2026లో అతను లీడ్ చేస్తున్న PBKS Unbeatableగా ఏడు మ్యాచ్‌లు గెలిచింది. ఓ మ్యాచ్‌లో రిజల్ట్ రాకపోయినా.. ఆ మ్యాచ్‌లో PBKS డామినెన్స్ చూపించింది నిజం. 2024కు ముందు గాయం కారణంగా శ్రేయస్‌ అయ్యర్ టీమిండియాకు అందుబాటులోకి రాలేదు. అయితే ఆ వెంటనే IPL ఆడాడు. IPL కి ప్రిపేర్ కావడం కోసం టీమిండియాకు దూరంగా ఉన్నాడన్న విమర్శలు వచ్చాయి. కారణమేదైనా ఆ తర్వాత అతను టీమిండియకు T20, టెస్టుల్లో ఆడలేదు.  2023 డిసెంబర్ తర్వాత.. అతను T20 ఇంటర్నేషనల్‌ మ్యాచ్ ఆడలేదు. మధ్యలో వన్డే సిరిస్‌కు తీసుకున్నా.. అది ఒక ఆప్షన్‌గా మాత్రమే. సరే ఏ IPL కోసం ఆాడాడో వాళ్ల నుంచి కూడా చేదు అనుభవమే ఎదురైంది. 2024లో  KKRకి కప్‌ అందిస్తే.. వాళ్లు వెంటనే  వదిలేశారు..  ఆ  కోపంతో 2025 లో PBKSలో చేరి  రెచ్చిపోయి ఆడాడు.. టీమ్‌ను కూడా అద్భతంగా లీడ్ చేసి ఫైనల్‌కు తీసుకెళ్లాడు. అక్కడ దురదుష్టం వెన్నాడింది. ఇక అప్పటి నుంచి తనను ప్రూవ్ చేసుకోవాలన్న తపన అతనిలో కనిపిస్తోంది. టీమిండియా జెర్సీ లేకపోయినా…
క్రికెట్ మైదానంలో ఒక ప్లేయర్ ఎలా సమాధానం చెబుతాడో చూపిస్తున్నాడు Shreyas. 

'ఇది కేవలం తన ఫామ్‌ను ప్రూవ్‌ చేయడం కాదు.. ఇది ఒక స్టేట్మెంట్!'
 
'నన్ను పట్టించుకోలేదా… సరే…ఇప్పుడు చూడండి నేను ఏంటో చూపిస్తా అని చెప్పడం!'

అది తనను వదిలేసిన KKRకు, తనను పట్టించుకోని టీమిండియా సెలక్టర్లకు చెప్పేమాట..!

ఓ మాస్ సినిమా లాంగ్వేజ్‌లో చెప్పాలంటే.. "మరీ ఇలా ఉన్నావేంట్రా?" అని ఫ్యాన్స్ అనుకోలా ఉంది. 


Shreyas Iyer: మరీ ఇలా ఉన్నావేంటి భయ్యా..టీమిండియాలో చేరాలన్న కసిని IPLలో చూపిస్తున్న శ్రేయస్

అందనంత ఎత్తులో PBKS

ఈ సీజన్‌లో PBKSను అతను ఎవరికీ అందనంత ఎత్తుకు తీసుకెళ్లి పెట్టాడు. అతని టీమ్‌లోని కుర్రాళ్లు ఎలాంటి టార్గెట్ ఇచ్చినా ఇచ్చి పడేస్తున్నారు..  265 పరుగుల టార్గెట్.. IPL లో అతిపెద్ద చేజ్... కానీ PBKS దానిని అలా ఊది పడేసింది. శ్రేయస్‌ టీమ్  ఓపెనర్లు చుక్కలు చూపిస్తే.. అతను స్వయంగా మిగతా పని పూర్తి చేశాడు. ఈ సీజన్‌లో ఇప్పటికే ఏడు మ్యాచ్‌లలో 4 హాఫ్ సెంచరీలున్నాయి అతనికి..అందులో ఓ మ్యాచ్‌లో బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. శ్రేయస్ అగ్రెషన్ ఏ రేంజ్‌లో ఉందంటే.. తన పదేళ్ల IPL కరీర్‌లో ఎప్పుడూ లేనంత Strike  Rate  ఉంది. 7 మ్యాచ్‌లలో 276 పరుగులు చేసిన అతని స్ట్రైక్‌రేట్ 180కి పైగా ఉంది. 

ప్లేయర్‌ను కాదు.. లీడర్‌ను

అంటే అర్థమవుతోంది కదా.. అతను ప్రతీ మ్యాచ్‌తో ఓ మెసేజ్ ఇస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌ను గెలిపిస్తూ.. తానెంత వాల్యూబుల్ అనేది ప్రూవ్ చేస్తున్నాడు. తాను కేవలం ఆటగాడిని కాదని... ఓ లీడర్‌నని చాటుతున్నాడు. మొదట్లో ఢిల్లీ కేపిటల్స్ కు అడిన శ్రేయస్... ఆ తర్వాత కెప్టెన్ అయి ఆ టీమ్‌ను ఫైనల్‌కు తీసుకెళ్లాడు..  తర్వాత... KKR ఆడి దానిని ఫైనల్‌కు చేర్చాడు.. లాస్ట్ ఇయర్‌ PBKSను ఫైనల్‌కు తీసుకెళ్లాడు.. IPl చరిత్రలోనే చాలా దారుణమైన ట్రాక్ రికార్డ్ ఉన్న  PBKS ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. ఈ సీజన్‌లో ఆల్‌మోస్ట్ వాళ్లకు ప్లే ఆఫ్ బెర్త్ కన్ఫామ్ అయిపోయినట్లే.. మరి ఈ సారి కప్పు అందుకుంటే కనుకు శ్రేయస్‌ను సెలక్టర్లు ఆపగలుగుతారా..?

Frequently Asked Questions

ఈ IPL సీజన్‌లో పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టు యొక్క ప్రదర్శన ఎలా ఉంది?

ఈ సీజన్‌లో PBKS అద్భుతంగా ఆడుతోంది. ఏడు మ్యాచ్‌లలో విజయం సాధించింది, ఒక మ్యాచ్‌లో ఫలితం రాకపోయినా ఆధిపత్యం చూపించింది.

శ్రేయస్ అయ్యర్ IPLలో PBKS జట్టుకు ఎందుకు చేరాడు?

2024లో KKRను ఫైనల్‌కు తీసుకెళ్లిన తర్వాత, వాళ్లు వెంటనే అతన్ని వదిలేశారు. ఆ కోపంతో 2025లో PBKSలో చేరి రెచ్చిపోయి ఆడాడు.

శ్రేయస్ అయ్యర్‌ IPL కెరీర్‌లో అతని ప్రస్తుత స్ట్రైక్‌రేట్ ఎలా ఉంది?

ఈ సీజన్‌లో అతని స్ట్రైక్‌రేట్ 180కి పైగా ఉంది, ఇది అతని పదేళ్ల IPL కెరీర్‌లోనే అత్యధికం. 7 మ్యాచ్‌లలో 276 పరుగులు చేశాడు.

టీమిండియా T20 జట్టులోకి శ్రేయస్ అయ్యర్‌ను తీసుకోకపోవడంపై అతని ప్రతిస్పందన ఏమిటి?

సెలక్టర్లు పట్టించుకోవడం లేదన్న కసి అతని ఆటతీరులో కనిపిస్తోంది. 'నన్ను పట్టించుకోలేదా… సరే…ఇప్పుడు చూడండి నేను ఏంటో చూపిస్తా' అని చెబుతున్నాడు.

టాప్ హెడ్ లైన్స్

Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Bhogapuram Airport: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు ప్రారంభం! హైదరాబాద్‌ నుంచి తొలి విమానం రాక! ముగిసిన విశాఖ ఎయిర్‌పోర్ట్ సేవలకు భావోద్వేగ వీడ్కోలు!  
Addanki Ganja News: అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
అద్దంకి సమీపంలో రోడ్డు ప్రమాదం.. పోలీసుల వాహనంలో గంజాయి చూసి స్థానికులు ఆగ్రహం
Gavaskar Comments : జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
జిమ్ ఫిట్‌నెస్ కాదు మ్యాచ్ ఫిట్‌నెస్ ముఖ్యం.. బుమ్రా, హార్దిక్ గాయాలపై గవాస్కర్ క్లాస్, ట్రెయినింగ్ పద్ధతులపై ఫైర్ !
Visakhapatnam to Bhogapuram Airport Buses: విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
విశాఖ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏరో ఎక్స్‌ప్రెస్ బస్సులు.. స్టాప్స్, ఛార్జీల పూర్తి వివరాలు
Embed widget