Shreya Iyer Comments: ప్లేయింగ్ లెవన్ లో లేనని మూవీ చూస్తున్నాను.. ఇంతలో రోహిత్ కాల్ చేసి.. కట్ చేస్తే.. స్టన్నింగ్ ఫిఫ్టీతో..
Shreya Iyer Comments: తొలి వన్డే ముందు రోజు రాత్రి, తుదిజట్టులో లేనని తెలిసి, మూవీ చూడటంలో శ్రేయస్ మునిగి పోయాడట. రోహిత్ కాల్ చేసి ఆడుతున్నట్లు చెప్పాడట.

Kohli Vs Shreyas: ఇంగ్లాండ్ తో జరిగిన తొలి వన్డేలో నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి భారత జట్టు విజయంలో శ్రేయస్ అయ్యర్ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే నిజానికి తనను ఈ మ్యాచ్ లో ఆడే అవకాశం చాలా లక్కీగా వచ్చిందని చెప్పాడు. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గాయపడటంతో కెప్టెన్ రోహిత్ శర్మ.. తొలివన్డేకు సిద్ధంగా ఉండమని చెప్పాడని వివరించాడు. అది చాలా సరదాగా జరిగిందని మురిసిపోతూ శ్రేయస్ చెప్పాడు. నిజానికి తొలి వన్డే ముందు రోజు రాత్రి, ఎలాగూ తను తుదిజట్టులో లేనని తెలిసి, మూవీ చూడటంలో శ్రేయస్ మునిగి పోయాడట. ఆ సమయంలో సడెన్ గా రోహిత్ కాల్ చేసి, కోహ్లీ మోకాలిలో వాపు వచ్చిందని, అతను గాయపడటంతో, తొలి వన్డేలో నువ్వు ఆడుతున్నట్లు చెప్పినట్లు పేర్కొన్నాడు. దీంతో వెంటనే టీవీ కట్టేసిన శ్రేయస్ తర్వాతి రోజు మ్యాచ్ కు సిద్ధమయ్యాడు. ఇది చాలా ఫన్నీగా జరిగిందని పేర్కొన్నాడు. ఇలాగే గతేడాది కూడా ఒక సన్నివేశం జరిగిందని గుర్తు చేశాడు. గాయం కారణంగా తనకు విశ్రాంతినిస్తే తన స్థానంలో వచ్చిన ప్లేయర్ సెంచరీ చేశాడని పేర్కొన్నాడు.
సహజ శైలిలో ఆడాలని భావించా..
ఇక తొలి వన్డేలో శ్రేయస్ బ్యాటింగ్ కు దిగినప్పుడు ఇండియా కాస్త ఒత్తిడిలో ఉంది. అప్పటికే ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ వికెట్లు కోల్పోవడంతో 19/2తో తీవ్రమైన ఒత్తిడిలో నిలిచింది. ఈ దశలో మరో వికెట్ పడిపోతే, ఇంగ్లాండ్ చేతుల్లోకి మ్యాచ్ వచ్చేదే. అయితే ఈ దశలో బ్యాటింగ్ కు దిగిన శ్రేయస్.. ఉగ్రరూపం దాల్చాడు. రావడం రావడంతోనే ఇంగ్లాండ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రెండు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లతో మెరుపు వేగంతో అర్థ సెంచరీ సాధించాడు. ఈక్రమంలో 30 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఓవరాల్ గా 59 పరుగులు చేసి జట్టును కాస్త సురక్షిత పరిస్థితుల్లో నిలిపాడు. తన ఇన్నింగ్స్ పై ఆనందం వ్యక్తం చేశాడు. సహజ శైలిలో ఆడుతూ, బంతిని గ్యాపులోకి పంపించానని పేర్కొన్నాడు. మరోవైపు ఇంగ్లాండ్ జట్టులో 140+ వేగంతో బంతులు విసిరే బౌలర్లు ఉన్నారని, అందుకే కాస్త జాగ్రత్తగా ఆడినట్లు పేర్కొన్నారు. ఇక దేశవాళీల్లో ఆడటం తన ఆటతీరును మెరుగుపర్చిందని పేర్కొన్నాడు. గతేడాది మొత్తం దేశవాళీల్లో ఆడటంతో ఫిట్ నెస్ తో పాటు అప్రోచ్ మారిందని చెప్పుకొచ్చాడు. నెట్ లో కూడా కఠోర శ్రమ చేయడం పనికొచ్చొందని వ్యాఖ్యానించాడు.
350 టార్గెట్ అని అనుకున్నా..
ఇక తొలి వన్డేలో ఇంగ్లాండ్ కు శుభారంభం లభించినా యూజ్ చేసుకోలేకపోయింది. ఓపెనర్లు బెన్ డకెట్, ఫిల్ సాల్ట్ ధాటిగా ఆడటంతో ఒక దశలో 75/0తో నిలిచింది. ఈ దశలో సాల్ట్ ను శ్రేయస్ రనౌట్ చేయడం మ్యాచ్ ను ములుపు తిప్పింది. ఆ తర్వాత వరుస విరామాల్లో భారత పేసర్లు వికెట్లు తీయడంతో మ్యాచ్ ఇండియా చేతుల్లోకి వచ్చింది. అయితే తను రనౌట్ గురించి ఆలోచించలేదని తెలిపాడు. సాల్ట్ కొట్టిన బంతిని బౌండరీకి వెళ్లకుండా అడ్డుకుని, వెంటనే కీపర్ వైపు బంతిని విసిరానని పేర్కొన్నాడు. అయితే మూడో పరుగుకు ప్రయత్నించి అయ్యర్ త్రోకు సాల్ట్ రనౌటయ్యాడు. అక్కడి నుంచి ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కుదుపునకు గురై, కేవలం 248 పరుగులకే ఆలౌటైంది. భారత్ టార్గెట్ ను 38.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్ డౌన్ బ్యాటర్ శుభమాన్ గిల్ (87) తుదికంటా నిలిచి జట్టును విజయం దిశగా నడిపించాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్ లో 1-0తో ఇండియా ఆధిక్యంలో ఉంది. తర్వాత వన్డే ఈనెల 9న కటక్ లో జరుగుతుంది.
Also Read: Harshit Rana Record: హర్షిత్ అరుదైన రికార్డు.. మూడు ఫార్మాట్లలో అది సాధించిన తొలి బౌలర్ గా ఘనత..
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

