Pat Cummins about Vaibhav Suryavanshi IPL 2026 | కమిన్స్‌కే చుక్కలు చూపించిన 15 ఏళ్ల కుర్రాడు
ఐపీఎల్ 2026లో ఒక 15 ఏళ్ల కుర్రాడు ప్రపంచ స్థాయి బౌలర్లను వణికిస్తున్నాడు. అతనే రాజస్థాన్ రాయల్స్ టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో వైభవ్ ఇన్నింగ్స్ చూస్తుంటే.. వయసు కేవలం ఒక నెంబర్ లాగా మాత్రమే కనిపిస్తుంది. 36 బంతుల్లోనే సెంచరీ బాది జైపూర్ స్టేడియాన్ని హోరెత్తించాడు.
అయితే ఉప్పల్ వేదికగా జరిగిన ముందు మ్యాచ్ లో ప్రఫుల్ హింగే బౌలింగ్‌లో గోల్డెన్ డకౌట్‌గా పెవిలియన్ చేరిన వైభవ్, ఈ మ్యాచ్‌లో పగ తీర్చుకున్నాడు. ప్రఫుల్ వేసిన తొలి ఓవర్లోనే వరుసగా 4 సిక్సర్లు బాదాడు. SRH కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌ను కూడా వదల్లేదు ఈ బుడ్డోడు.
వైభవ్ కేవలం 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా, 36 బంతుల్లో 103 పరుగుల మార్కును చేరుకున్నాడు. ఇందులో 13 భారీ సిక్సర్లు, 5 ఫోర్లు ఉండటం విశేషం. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో ఫాస్టెస్ట్ సెంచరీ. అయితే రెండో ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు కూడా వైభవ్ పేరిటే ఉండటం విశేషం. ఇప్పటికే బుమ్రా, రబడా వంటి బౌలర్లను చితక్కొట్టిన వైభవ్, ఇప్పుడు కమిన్స్‌కు కూడా తన బ్యాటింగ్ రుచి చూపించాడు.
ట్రెండింగ్ వార్తలు






















