అన్వేషించండి

IPL అరంగేట్రంలోనే అదరగొట్టిన RCB బౌలర్.. ఎవరీ Jacob Duffy, అతడి బ్యాక్‌గ్రౌండ్ ఏంటీ?

Who is Jacob Duffy | న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్.. ఆర్సీబీ ప్లేయర్ జాకబ్ డఫీ (Jacob Duffy) ప్రొఫైల్, ఐపీఎల్ 2026 వేలం, సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై అతని అద్భుత ప్రదర్శన వివరాలపై ఓ లుక్కేయండి.

IPL 2026 RCB vs SRH | బెంగళూరు: ఐపీఎల్ 2026 సీజన్ ప్రారంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ఆర్సీబీ పేసర్ జాకబ్ డఫీ కళ్లు చెదిరే ప్రదర్శన చేశాడు. ఎం. చిన్నస్వామి స్టేడియంలో శనివారం (మార్చి 28న) రాత్రి జరిగిన ఈ మ్యాచ్‌లో తన అరంగేట్రంలో 4 ఓవర్లలో 3 వికెట్లు పడగొట్టి 22 పరుగులు మాత్రమే ఇచ్చాడు. తద్వారా సన్‌రైజర్స్ పతనాన్ని శాసించాడు. కేవలం 8 ఓవర్లకే ఇన్నింగ్స్ లో తన స్పెస్ పూర్తి చేసి కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టాడు. ఇదే మ్యాచ్ ద్వారా అభినందన్ సింగ్ అనే యూపీకి చెందిన పేసర్ సైతం ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు.

పవర్ ప్లేలో సన్ రైజర్స్ పై ఆధిపత్యం:  సాధారణంగా పవర్ ప్లేలో విధ్వంసం చేసే సన్‌రైజర్స్ ప్రమాదకర ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ లను త్వరగా పెవిలియన్ చేర్చాడు జాకబ్ డఫీ. తరువాత నితీష్ కుమార్ రెడ్డిని సైతం పవర్ ప్లేలోనే అవుట్ చేసి హైదరాబాద్ బ్యాటింగ్ టాపార్డర్‌ను దెబ్బకొట్టాడు. 

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్:  అరంగేట్రంలోనే అద్భుత స్పెల్ వేసి SRH జోరుకు బ్రేకులు వేసి ఆర్‌సీబీ విజయంలో కీలకపాత్ర పోషించిన జాకబ్ డఫీ తన మొదటి ఐపీఎల్ మ్యాచ్‌లోనే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు. పేసర్ డఫీ వేసిన షార్ట్ పిచ్ బాల్స్, స్వింగ్ సన్‌రైజర్స్ టాప్ ఆర్డర్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాయి. అయితే అరంగేట్రం మ్యాచ్‌లోనే అదరగొట్డడంతో ఎవరీ జాకబ్ డఫీ అని క్రికెట్ ప్రేమికులు సెర్చ్ చేస్తున్నారు.

ఎవరీ జాకబ్ డఫీ (Jacob Duffy Profile)
జాకబ్ డఫీ ఆగస్టు 2, 1994న న్యూజిలాండ్‌లోని లమ్స్‌డెన్‌లో జన్మించారు. కుడిచేతి వాటం ఫాస్ట్ మీడియం బౌలర్. న్యూజిలాండ్ డొమెస్టిక్ క్రికెట్‌లో ఒటాగో (Otago) జట్టు తరపున ఆడుతూ అద్భుతమైన రికార్డును కలిగి ఉన్నాడు. 2012లో తన 18వ ఏటనే ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అడుగుపెట్టి, అతి తక్కువ కాలంలోనే కీలక బౌలర్‌గా ఎదిగాడు.

టీ20ల్లో నెంబర్ 1 ర్యాంక్..

అంతర్జాతీయ స్థాయిలో 2020లో పాకిస్థాన్‌తో జరిగిన టీ20 మ్యాచ్ ద్వారా న్యూజిలాండ్ పేసర్ అరంగేట్రం చేశాడు. డఫీ తన బౌలింగ్‌లో కచ్చితత్వం, స్వింగ్, బౌన్స్‌ను రాబట్టడంలో దిట్ట. ముఖ్యంగా కొత్త బంతితో వికెట్లు తీయడంలో సరైన బౌలర్. 2025 సంవత్సరంలో ఇతను టీ20 క్రికెట్‌లో ఐసీసీ నంబర్ 1 బౌలర్‌గా కూడా నిలిచాడు. న్యూజిలాండ్ క్రికెట్ అవార్డ్స్ 2026లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 'సర్ రిచర్డ్ హ్యాడ్లీ మెడల్' ను కూడా గెలుచుకున్నాడు. మరోవైపు భువనేశ్వర్ సైతం ఉండటంతో ఆర్సీబీకి బెస్ట్ పేస్ బౌలింగ్ అటాక్ దొరికినట్లే.

ఆర్సీబీ వేలం వివరాలు (RCB Auction Details)
ఐపీఎల్ 2026 కోసం జరిగిన మినీ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) పేసర్ జాకబ్ డఫీని అతని కనీస ధర రూ. 2 కోట్లకు సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాకు చెందిన పేసర్ జోష్ హాజిల్‌వుడ్‌కు ప్రత్యామ్నాయంగా లేదా బ్యాకప్ బౌలర్‌గా జాకబ్ డఫీని ఆర్సీబీ తుది జట్టులోకి తీసుకుంది. తక్కువ ధరకు లభించినప్పటికీ, టీ20ల్లో డఫీకి ఉన్న అనుభవం, ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇతడ్ని ఆర్సీబీకి ఒక స్టేల్ డీల్ (తక్కువ ధరకు దక్కిన గొప్ప ఆటగాడు) గా క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. 

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More

టాప్ హెడ్ లైన్స్

DC Coaching Setup: ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
ఢిల్లీ క్యాపిటల్స్ లోకి దాదా, సిక్సర్ల కింగ్ ఎంట్రీ.. యువరాజ్ కొత్త రోల్ తో ఐపీఎల్ లో న్యూ జోష్!
Rishabh Pant Tweet: అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
అర్థరాత్రి వేళ  పంత్ సంచలన పోస్ట్.. సొంత రాష్ట్ర సీఎంను సహాయం కోరిన స్టార్ వికెట్ కీపర్, ధామీ రిప్లైలో ఊరించే ట్విస్ట్!
IPL Hardik Trade: హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
హార్దిక్ ట్రేడింగ్ రూమర్లతో ఐపీఎల్ లో కలకలం.. సిఎస్కే, కేకేఆర్ రేసులో ఉండటంతో ముంబైకి మాస్టర్ ప్లాన్ సూచించిన అశ్విన్ !
CSK Coaching Crisis: ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. హస్సీకి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!
ఫ్లెమింగ్ బాటలోనే మరో సిఎస్కే లెజెండ్.. ఆ దిగ్గజానికి ఇంగ్లాండ్ టీమ్ ఆఫర్, చెన్నై క్యాంప్ లో క‌ల‌క‌లం!

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mamata Banerjee Car Attack: మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
మమతా బెనర్జీ కారుపై దాడి.. టీఎంసీ అధినేత్రి ఏ కారును ఉపయోగిస్తారు? అది ఎంత సురక్షితం
BWF Title Win: కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
కొరియా మాస్టర్స్ లో అశ్మిత చాలిహా హిస్టారిక్ విక్టరీ.. చైనా షట్లర్ పై మైండ్ బ్లాకింగ్ కంబ్యాక్, ఫస్ట్ వరల్డ్ టూర్ టైటిల్ సొంతం!
KCR: దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
దశదినకర్మకు హాజరై పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన కేసీఆర్, అండగా ఉంటామని భరోసా
Rajahmundry Medico Passes Away: రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
రాజమండ్రి రోడ్డు ప్రమాదం విషాదాంతం.. మెడికో ప్రియాంక మృతి, వెల్లడించిన డాక్టర్లు
AP CM Chandrababu: ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
ప్రకాశం బ్యారేజ్ వద్ద గోదావరి జలాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు, అధికారులకు కీలక సూచనలు
Spider Man OTT : ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
ఆ ఓటీటీలోకి స్పైడర్ మ్యాన్ - 12 వేల కోట్ల మూవీ ఎప్పుడు స్ట్రీమింగ్ కావొచ్చంటే?
Rajahmundry Medico Priyanka: మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
మీకు ఆడపిల్లలు లేరా? సీఎం, డిప్యూటీ సీఎం పట్టించుకోకపోవడం దారుణం: ప్రియాంక తండ్రి వెంకటేష్
Rahane -Jaiswal Incident:  గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. స్మార్ట్ మూవ్ తో యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన అజింక్య‌.. 
గ‌తంలో బ్యాన్ నుంచి జైస్వాల్ ను త‌ప్పించిన ర‌హానే.. యువ క్రికెట‌ర్ కెరీర్ కాపాడిన సీనియర్
Embed widget