అన్వేషించండి

IPL 2026 Playoff Venues: ఐపీఎల్ 2026 ఫైనల్ వేదికపై వీడని ఉత్కంఠ.. బెంగళూరులో టికెట్ల లొల్లితో బీసీసీఐ కొత్త ప్లాన్! పంజాబ్ వర్సెస్ కర్ణాటక వేదికగా ప్లేఆఫ్స్ పోరు

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ వేదికల ప్రకటనకు బీసీసీఐ సిద్ధమవుతోంది. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బెంగళూరులో ఫైనల్ జరగాల్సి ఉన్నా, టికెట్ల విషయంలో ఎంఎల్ఏల డిమాండ్ల వల్ల వేదిక మారే ఛాన్స్ కనిపిస్తోంది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ పంజాబ్, కర్ణాటకలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
  • బెంగళూరులో ఫైనల్ టికెట్ వివాదం, రాజకీయ నేతల డిమాండ్లు వేదికపై ప్రభావం చూపవచ్చు.
  • ప్లేఆఫ్స్ రేసులో పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.
  • ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్స్ అవకాశాలు దాదాపుగా ముగిశాయి.

IPL 2026 Playoff Venues and Bengaluru Final: ఐపీఎల్ 2026 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. లీగ్ దశ ముగింపుకు వస్తుండటంతో ఇప్పుడు అందరి దృష్టి ప్లేఆఫ్స్, ఫైనల్ వేదికలపై పడింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) త్వరలోనే వీటిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది. అయితే, ఫైనల్ మ్యాచ్ ఎక్కడ జరుగుతుందనే దానిపై ఇంకా క్లారిటీ రావడం లేదు. తాజా సమాచారం ప్రకారం, ప్లేఆఫ్స్ మ్యాచ్‌లను పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. కానీ, బెంగళూరులో నెలకొన్న కొన్ని రాజకీయ పరిణామాల వల్ల అక్కడ ఫైనల్ నిర్వహించడం కష్టంగా మారేలా కనిపిస్తోంది.

టికెట్ల గొడవ - బెంగళూరుకు సెగ..
ఐపీఎల్ నిబంధనల ప్రకారం, గత సీజన్ విజేత (డిఫెండింగ్ ఛాంపియన్) హోమ్ గ్రౌండ్‌లోనే ఫైనల్ మ్యాచ్ జరగాలి. దీని ప్రకారం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఫైనల్‌కు వేదిక కావాలి. అయితే, అక్కడ ఎంఎల్ఏల టికెట్ల డిమాండ్ పెద్ద తలనొప్పిగా మారింది. ప్రతి ఎంఎల్ఏకు కనీసం ఐదు ఐపీఎల్ టికెట్లు ఇవ్వాలని కాంగ్రెస్ ఎంఎల్ఏ విజయానంద్ కాశప్పనవర్ డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు వీఐపీలని, వారు లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదని ఆయన చేసిన కామెంట్స్ దుమారం రేపాయి.

Also  Read: ముంబై రికార్డు ఛేజింగ్.. LSGపై ఘ‌న‌విజ‌యం, స‌త్తా చాటిన రోహిత్, రికెల్ట‌న్

దీనిపై స్పందించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డి.కె. శివకుమార్.. ఎంఎల్ఏలు, ఎంపీలకు మూడు టికెట్ల చొప్పున ఇస్తామని హామీ ఇచ్చారు. అయితే హోం మంత్రి పరమేశ్వర మాత్రం టికెట్ల దుర్వినియోగం ఏమీ జరగడం లేదని, ఆన్‌లైన్ లో బుక్ చేసుకున్న వారే మ్యాచ్‌లు చూస్తున్నారని చెప్పారు. ఈ టికెట్ల ఇష్యూ ఒకవేళ సద్దుమణగకపోతే, బీసీసీఐ ఫైనల్ వేదికను బెంగళూరు నుంచి మరో నగరానికి మార్చే ఆలోచనలో ఉంది.

Also Read: MI ప్లేయర్ రఘు శర్మ ఎమోషనల్ సెలబ్రేషన్.. వికెట్ తీశాక జేబులోంచి నోట్ తీసి ఏం చూపించాడంటే! LSGతో మ్యాచ్‌లో మిస్టరీ నోట్ వైరల్

పాయింట్ల పట్టికలో జోరు..
మే 5వ తేదీ నాటికి పాయింట్ల పట్టికను పరిశీలిస్తే.. ప్లేఆఫ్స్ రేసు చాలా సీరియస్‌గా ఉంది. పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో టేబుల్ టాప్ లో ఉంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ తలో 12 పాయింట్లతో పోటాపోటీగా ఉన్నాయి. నెట్ రన్ రేట్ పరంగా ఆర్సీబీ కాస్త ముందంజలో ఉంది.

మధ్యలో నిలిచిన జట్లు..
చెన్నై సూపర్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్ చెరో 8 పాయింట్లతో మిడిల్ టేబుల్ లో ఉన్నాయి. ఇవి ప్లేఆఫ్స్ కు వెళ్లాలంటే రాబోయే మ్యాచుల్లో నిలకడగా రాణించాల్సి ఉంటుంది. కోల్‌కతా నైట్ రైడర్స్ 7 పాయింట్లతో ఎనిమిదో ప్లేస్ లో ఉంది. వీరికి టెక్నిక‌ల్ పరంగా అవకాశాలు ఉన్నప్పటికీ, అది చాలా కష్టమైనదని విశ్లేష‌కులు అంటున్నారు.

ముంబై, లక్నో ఔట్..
ముంబై ఇండియన్స్ 10 మ్యాచుల్లో కేవలం 6 పాయింట్లు మాత్రమే సాధించి టాప్-4 రేసులో వెనుకబడిపోయింది. ఇక లక్నో సూపర్ జెయింట్స్ పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కేవలం 4 పాయింట్లతో టేబుల్ లో ఆఖరి స్థానంలో ఉంది. లక్నో ప్లేఆఫ్స్ ఆశలు దాదాపుగా గల్లంతయ్యాయనే చెప్పాలి. ప్లేఆఫ్స్ వేదికలపై క్లారిటీ వస్తే ఫ్యాన్స్ తమ ప్లాన్స్ చేసుకోవడానికి వీలవుతుంది. బెంగళూరులో ఫైనల్ జరుగుతుందా లేదా అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్ గా మారింది.

Frequently Asked Questions

ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు ఏ రాష్ట్రాల్లో జరగనున్నాయి?

బీసీసీఐ ఐపీఎల్ 2026 ప్లేఆఫ్స్ మ్యాచ్‌లను పంజాబ్, కర్ణాటక రాష్ట్రాల్లో నిర్వహించాలని భావిస్తోంది.

ఐపీఎల్ 2026 ఫైనల్ బెంగళూరులో జరుగుతుందా?

గత సీజన్ విజేత హోమ్ గ్రౌండ్‌లో ఫైనల్ జరిగే నిబంధన ప్రకారం బెంగళూరు ఫైనల్ వేదిక కావాలి. కానీ, టికెట్ల వివాదం వల్ల దీనిపై సందిగ్ధత నెలకొంది.

ఎంఎల్ఏల టికెట్ల డిమాండ్ వల్ల ఫైనల్ వేదిక మారే అవకాశం ఉందా?

ఎంఎల్ఏలకు టికెట్లు ఇవ్వడంపై నెలకొన్న వివాదం సద్దుమణగకపోతే, బీసీసీఐ ఫైనల్ వేదికను బెంగళూరు నుంచి మరో నగరానికి మార్చే ఆలోచనలో ఉంది.

పాయింట్ల పట్టికలో ముందున్న జట్లు ఏవి?

మే 5 నాటికి పంజాబ్ కింగ్స్ 13 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాత ఆర్సీబీ, సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ 12 పాయింట్లతో పోటీపడుతున్నాయి.

Advertisement

టాప్ హెడ్ లైన్స్

Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
CSK Head Coach Fleming Exit: CSKతో 18 ఏళ్ల బంధానికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై, వరుస ఫెయిల్యూర్స్ జ‌ట్టును వీడిన లెజెండ‌రీ కోచ్..
CSKతో 18 ఏళ్ల బంధానికి స్టీఫెన్ ఫ్లెమింగ్ గుడ్ బై, వరుస ఫెయిల్యూర్స్ జ‌ట్టును వీడిన లెజెండ‌రీ కోచ్..
Knight Riders Creates History: అమెరికాలో షారుఖ్ ఖాన్ నైట్ రైడర్స్ గ్రూప్ సంచలనం.. లాస్ ఏంజిల్స్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టేడియం ఓపెనింగ్, హిస్టరీ క్రియేట్ చేసిన బాలీవుడ్ బాద్‌షా!
నైట్ రైడర్స్ గ్రూప్ సంచలనం.. లాస్ ఏంజిల్స్ లో ఫస్ట్ ఇంటర్నేషనల్ స్టేడియం ఓపెనింగ్, హిస్టరీ క్రియేట్ చేసిన బాలీవుడ్ బాద్‌షా!
IPL Star Shashank Singh : పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు, !
పంజాబ్ కింగ్స్ క్రికెటర్ శశాంక్ సింగ్ కు గట్టి షాక్.. రిటైర్డ్ ఐపీఎస్ తండ్రితో కలిసి కుక్ పై దాడి కేసు !
Advertisement

వీడియోలు

IND vs ENG 2nd T20 Highlights | రెండో టీ20లో భారత్‌కు షాక్
Vaibhav Sooryavanshi Debut vs ENG | 15 ఏళ్లకే వైభవ్ సూర్యవంశీ హిస్టారిక్ డెబ్యూ
Shreyas Iyer Worst Captaincy Record | శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ రికార్డు
Who Is Podarillu Serial Heroine Kruthika? | హీరోయిన్ కృతిక బ్యాక్‌గ్రౌండ్ తెలుసా?
Shreyas Iyer about T20 Loss vs ENG | రవి బిష్ణోయ్‌పై కెప్టెన్ శ్రేయస్ హాట్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh Tweet to Galla Jayadev: ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
ఆంధ్రప్రదేశ్ మీకు క్షమాపణ చెప్పాలి - గల్లా జయదేవ్‌కు లోకేష్ భావోద్వేగ ట్వీట్ - ఏం జరిగిందంటే ?
Hyderabad Drugs Seized: హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడితో పాటు ముగ్గురు అరెస్ట్.. పరారీలో మరో నలుగురు
AI Intimacy Survey: లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
లైంగిక ఆరోగ్య సమాచారం కోసం AIని వాడేస్తున్న వైజాగ్‌ వాసులు! దేశంలోనే బెంగుళూరు తర్వాత రెండో స్థానం!
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
పూరి రథం మేకుల్లేకుండా ఎలా నిలుస్తుంది? చెక్క ఎక్కడి నుంచి వస్తుంది? మిగిలిన చెక్కను ఏం చేస్తారు?
Dhoni As CSK Coach: సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
సీఎస్కే నెక్స్ట్ బాస్ గా ధోనీ గ్రాండ్ ఎంట్రీ..! స్టీఫెన్ ఫ్లెమింగ్ ఎగ్జిట్ పై  దిగ్గ‌జ ఆల్ రౌండ‌ర్ వ్యాఖ్య‌లు
Oneplus: వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
వన్‌ప్లస్ భారత్ మార్కెట్ నుంచి తప్పుకుటుందా? జరుగుతున్న ప్రచారంలో వాస్తవమేంటీ?
Agniveer Recruitment: భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
భారత సైన్యంలో అగ్నివీర్ పరీక్షల ఫలితాలు విడుదల.. నెక్ట్స్ ఫేజ్ ముఖ్యమైన తేదీలివే
YS Jagan New Political Strategist: జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
జగన్ మేకోవర్ రీలోడెడ్ - ఐ ప్యాక్ ప్లేస్‌లో విజయ్ స్ట్రాటజిస్ట్ కపిల్ సాహు - మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Embed widget