CSK Update: గాయంతో IPL 2026 నుంచి ఆల్ రౌండర్ ఔట్, చెన్నై సూపర్ కింగ్స్‌కు ఎదురుదెబ్బ
CSK Player Ramakrishna Ghosh Ruled Out IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్‌కు సీజన్ మధ్యలోనే మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. అరంగేట్రం చేసిన రామకృష్ణ ఘోష్ గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు.

Ramakrishna Ghosh | చెన్నై: చెన్నై సూపర్ కింగ్స్‌కు కీలక సమయంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. గాయపడిన ఆటగాళ్ల జాబితాలో ఆల్ రౌండర్ రామకృష్ణ ఘోష్ పేరు చేరింది. CSK టీమ్ సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని వెల్లడించింది. కాలికి ఫ్రాక్చర్ కావడంతో రామకృష్ణ ఈ సీజన్ మొత్తానికి దూరం కానున్నాడు. ముంబై ఇండియన్స్ తో చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తన IPL అరంగేట్రం చేశాడు. సూర్యకుమార్ యాదవ్ ను అవుట్ చేయడం ద్వారా ఐపీఎల్ కెరీర్ లో మొదటి వికెట్ దక్కించుకున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ మ్యాచ్ లో కొత్త ఆటగాడు రామకృష్ణ ఘోష్ కుడి కాలికి ఫ్రాక్చర్ అయిందని CSK టీమ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. అతను IPL 2026 సీజన్ లో తదుపరి మ్యాచ్ లకు అందుబాటులో ఉండడు. తన అరంగేట్రం మ్యాచ్ లో అద్భుతమైన క్యాచ్ పట్టి విల్ జాక్స్ కావడంలో కీలకంగా వ్యవహరించాడు. సీఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా ఘోష్ గాయపడటం చెన్నై జట్టుకు పెద్ద ఎదురుదెబ్బ అని తెలిపారు.
చెన్నై సూపర్ కింగ్స్ IPL 2025 మెగా వేలంలో రామకృష్ణ ఘోష్ ను తమ జట్టులో చేర్చుకుంది. 2026 సీజన్ కోసం జట్టు అతన్ని రిటైన్ చేసుకుంది. రామకృష్ణ ఘోష్ గాయపడటం కూడా ఒక పెద్ద ఎదురుదెబ్బ, ఎందుకంటే అతను ఒక మంచి ఆల్ రౌండర్ ఆటగాడు.
OFFICIAL ANNOUNCEMENT:
— Chennai Super Kings (@ChennaiIPL) May 3, 2026
Ramakrishna Ghosh sustained a fracture to his right foot during the CSK v MI match at Chepauk.
He will take no further part in IPL 2026.
Get well soon, Rambo. pic.twitter.com/CQve4zLixG
CSKను వెంటాడుతున్న గాయాలు
చెన్నై సూపర్ కింగ్స్ జట్టును ఈ సీజన్లో ఆటగాళ్ల గాయాలు వెంటాడుతున్నాయి. సీజన్ ప్రారంభం కాకముందే ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ నాథన్ ఎల్లిస్ జట్టుకు దూరమయ్యాడు. ఇటీవల ఖలీల్ అహ్మద్ కూడా గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అదే సమయంలో ఓపెనర్ ఆయుష్ మాత్రే తొడ కండరాల గాయం కారణంగా మిగతా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. మరోవైపు MS ధోని లేకపోవడం చెన్నై జట్టులో లోటుగా ఉంది. అతను కాఫ్ ఇంజూరీ కారణంగా ఇప్పటివరకు ఈ IPL లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. కానీ అతడి కోసం సీఎస్కే ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ట్రెండింగ్ వార్తలు




















