KKR Big Move: టీమ్ ఇండియా కోచ్ పదవి వీడిన మరుసటి రోజే ఆ ఐపీఎల్ టీమ్ లోకి రీ-ఎంట్రీ.. హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా టెన్ డోషేట్
టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ పదవికి రాజీనామా చేసిన మరుసటి రోజే ర్యాన్ టెన్ డోషేట్ కేకేఆర్ హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీగా జాయిన్ అయ్యాడు.

Ten Doeschate Joins Kolkata Knight Riders: హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా అసిస్టెంట్ కోచ్ రోల్ నుంచి తప్పుకున్న మరుసటి రోజే ర్యాన్ టెన్ డోషేట్ త్రీ-టైమ్స్ ఐపీఎల్ విన్నర్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) ఫ్రాంచైజీలో జాయిన్ అయ్యాడు. కేకేఆర్ గ్లోబల్ ఫ్రాంచైజీలలో క్రికెట్ స్ట్రాటజీ, టాలెంట్ రిక్రూట్‌మెంట్, ప్లేయర్ డెవలప్‌మెంట్ వ్యవహారాలను పర్యవేక్షించే 'హెడ్ ఆఫ్ క్రికెట్ స్ట్రాటజీ'గా అతడు బాధ్యతలు స్వీకరించాడు. నైట్ రైడర్స్ నెట్‌వర్క్ లో రిక్రూటింగ్, స్కాౌటింగ్, స్క్వాడ్ ప్లానింగ్ తో పాటు సిపిఎల్ (CPL) లో ట్రిన్‌బాగో నైట్ రైడర్స్, ఐఎల్ టి20 (ILT20) లో అబుదాబి నైట్ రైడర్స్, ఎమ్ఎల్ సి (MLC) లో లాస్ ఎంజెల్స్ నైట్ రైడర్స్ టీమ్‌లకు అసిస్టెంట్ కోచ్ గా కూడా అతడు సర్వీస్ అందించనున్నాడు.
After stepping down as India's men's assistant coach, Ryan ten Doeschate has been appointed as Head of Cricket Strategy at Knight Riders Sports pic.twitter.com/h2pJ7BDcX0
— Cricinfo (@cricinfo) July 29, 2026
కేకేఆర్ సీఈఓ వెంకీ మైసూర్ హ్యాపీ..
నైట్ రైడర్స్ స్పోర్ట్స్ సీఈఓ వెంకీ మైసూర్ మాట్లాడుతూ.. "టెండోను మళ్లీ నైట్ రైడర్స్ ఫ్యామిలీలోకి వెల్‌కమ్ చెప్పడం చాలా హ్యాపీగా ఉంది. మా టీమ్ ఫిలాసఫీ, ప్లానింగ్ పై అతనికి ఉన్న క్లారిటీ కేకేఆర్ గ్రోత్ కి ఫుల్ గా హెల్ప్ అవుతుంది" అని అన్నాడు. కేకేఆర్ లో చేరడం పై ర్యాన్ టెన్ డోషేట్ స్పందిస్తూ.. "నైట్ రైడర్స్ ఫ్యామిలీలోకి అసిస్టెంట్ కోచ్ గా, స్ట్రాటజిస్ట్ గా రీ-ఎంట్రీ ఇవ్వడం ఎగ్జైటింగ్ గా ఉంది. గ్లోబల్ ఫ్రాంచైజీలలో స్కౌటింగ్, అనలిటిక్స్ టీమ్‌లతో వర్క్ చేసి లాంగ్ టర్మ్ క్రికెట్ స్ట్రాటజీ బిల్డ్ చేస్తా" అని క్లారిటీ ఇచ్చాడు.
2011 లో ప్లేయర్ గా జర్నీ స్టార్ట్.. టైటిల్ విన్నింగ్ హిస్టరీ
కేకేఆర్ తో ర్యాన్ సంబంధం 2011 లో ప్లేయర్ గా స్టార్ట్ అయింది. 2012, 2014 లో కేకేఆర్ ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన టీమ్‌లలో ఇతను కీ మెంబర్ గా ఉన్నాడు. ఆ తర్వాత 2022 లో కోచింగ్ స్టాఫ్ లో జాయిన్ అయి, 2024 లో కేకేఆర్ థర్డ్ టైమ్ ఐపీఎల్ ట్రోఫీ కొట్టినప్పుడు కోచింగ్ గ్రూప్ లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాడు.
టీమ్ ఇండియా నుంచి ఎగ్జిట్.. కేకేఆర్ గ్లోబల్ బ్రాండ్ వింగ్ లో కీ రోల్
ఇండియన్ నేషనల్ టీమ్ కాంట్రాక్ట్ ముగిసిన వెంటనే కేకేఆర్ తో బిగ్ డీల్ కుదుర్చుకోవడం క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. నైట్ రైడర్స్ గ్లోబల్ బ్రాండ్ డెవలప్‌మెంట్ లో డోషేట్ రోల్ చాలా క్రూషియల్ గా మారనుందని తెలుస్తోంది.
Before You Go
India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
ట్రెండింగ్ వార్తలు



















