News
News
వీడియోలు ఆటలు
X

Mohammed Shami: ఐపీఎల్‌లో 100 వికెట్లు పడగొట్టిన షమీ - చెన్నైపై అద్భుత బౌలింగ్

ఐపీఎల్‌లో మహ్మద్ షమీ 100 వికెట్ల మార్కును దాటాడు.

FOLLOW US: 
Share:

Mohammed Shami: ఐపీఎల్ 2023 తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది.

దీంతో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్ 179 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది. అదే సమయంలో గుజరాత్ టైటాన్స్ తరఫున మహమ్మద్ షమీతో పాటు రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ రెండేసి వికెట్లు తీశారు. జాషువా లిటిల్‌కు ఒక వికెట్ దక్కింది.

ఐపీఎల్‌లో మహ్మద్ షమీకి 100వ వికెట్
అయితే మహ్మద్ షమీ చాలా ప్రత్యేకమైన జాబితాలో చేరాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహ్మద్ షమీ తన ఐపీఎల్ కెరీర్‌లో 100వ వికెట్‌ను తీసుకున్నాడు. ఈ విధంగా ఐపీఎల్‌లో 100 వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితాలో మహ్మద్ షమీ చేరాడు. ఈ మ్యాచ్‌లో మహ్మద్ షమీ బౌలింగ్ గురించి చెప్పాలంటే నాలుగు ఓవర్లలో 29 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీ డెవాన్ కాన్వే, శివమ్ దూబేలను తన బాధితులుగా చేశాడు.

చెన్నై తరఫున రుతురాజ్ గైక్వాడ్ మెరుపులు
చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్‌మెన్ గురించి చెప్పాలంటే ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ అత్యధిక పరుగులు చేశాడు. రితురాజ్ గైక్వాడ్ 50 బంతుల్లోనే 92 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, 9 సిక్సర్లు బాదాడు. తను మిగిలిన బ్యాట్స్‌మెన్‌లు ఎటువంటి ప్రత్యేక సహకారం అందించలేకపోయారు. గుజరాత్ టైటాన్స్ తరఫున మహమ్మద్ షమీతో పాటు రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్ రెండేసి వికెట్లు తీశారు. 4 ఓవర్లలో 26 పరుగులు మాత్రమే ఇచ్చి ఇద్దరు ఆటగాళ్లను రషీద్ ఖాన్ అవుట్ చేశాడు. అల్జారీ జోసెఫ్ 4 ఓవర్లలో 33 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. ఇది కాకుండా జాషువా లిటిల్ 4 ఓవర్లలో 41 పరుగులిచ్చి ఒక వికెట్ తీశాడు.

నరేంద్ర మోదీ స్టేడియంలో రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన ఇన్నింగ్స్‌ను ప్రేక్షకులు చూశారు. చెన్నై ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్ అద్భుతంగా బ్యాటింగ్ చేస్తూ కేవలం 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేశాడు. ఈ మ్యాచ్‌లో గైక్వాడ్ బ్యాట్ 50 బంతుల్లోనే 92 పరుగులతో అద్భుతమైన ఇన్నింగ్స్‌ను నమోదు చేసింది.

ఇన్నింగ్స్ ప్రారంభంలో కొంత సమయం తీసుకున్న తర్వాత రుతురాజ్ గైక్వాడ్ అద్భుతమైన సిక్సర్లు కొట్టడం ప్రారంభించాడు. ఇందులో గైక్వాడ్ కేవలం 23 బంతుల్లోనే తన అర్ధ సెంచరీని పూర్తి చేశాడు. రికార్డుల జాబితాలో తన పేరును లిఖించుకున్నాడు. ఇప్పుడు రుతురాజ్ గైక్వాడ్ ఐపీఎల్ మ్యాచ్‌లో ఫాస్ట్ హాఫ్ సెంచరీ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాళ్లలో 11వ స్థానంలో ఉన్నాడు.

2014 ఐపీఎల్ సీజన్‌లో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించిన సురేష్ రైనా చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ఐపీఎల్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రుతురాజ్ గైక్వాడ్ 92 పరుగుల ఇన్నింగ్స్‌లో మొత్తం తొమ్మిది సిక్సర్లు కొట్టాడు.

Published at : 31 Mar 2023 10:43 PM (IST) Tags: Indian Premier League Mohammed Shami IPL 2023

సంబంధిత కథనాలు

ENG Vs IRE: సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్ - ఏ విషయంలో అంటే?

ENG Vs IRE: సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టిన జో రూట్ - ఏ విషయంలో అంటే?

Pat Cummins: 2021 డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలు - అందుకే ఫైనల్స్‌కు రాలేదంటూ!

Pat Cummins: 2021 డబ్ల్యూటీసీ ఫైనల్‌పై ప్యాట్ కమిన్స్ వ్యాఖ్యలు - అందుకే ఫైనల్స్‌కు రాలేదంటూ!

ENG vs IRE: బ్యాటింగ్‌కు రాలె - బౌలింగ్ చేయలె - అయినా మ్యాచ్ గెలిచాడు - బెన్ స్టోక్స్ అరుదైన ఘనత

ENG vs IRE: బ్యాటింగ్‌కు రాలె - బౌలింగ్ చేయలె - అయినా మ్యాచ్ గెలిచాడు - బెన్ స్టోక్స్ అరుదైన ఘనత

Ben Stokes: ఐర్లాండ్ టెస్టులో బెన్ స్టోక్స్ ప్రత్యేక రికార్డు - ఇప్పటి వరకు ఏ కెప్టెన్ చేయనిది?

Ben Stokes: ఐర్లాండ్ టెస్టులో బెన్ స్టోక్స్ ప్రత్యేక రికార్డు - ఇప్పటి వరకు ఏ కెప్టెన్ చేయనిది?

David Warner: అదే నా చివరి టెస్టు - రిటైర్మెంట్‌పై తేల్చేసిన వార్నర్ భాయ్

David Warner: అదే నా చివరి టెస్టు - రిటైర్మెంట్‌పై తేల్చేసిన వార్నర్ భాయ్

టాప్ స్టోరీస్

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

Odisha Train Accident: తొలిసారి భార్య మాట పాటించిన భర్త, రైలు ప్రమాదం నుంచి తప్పించుకున్న కొత్త జంట!

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

PM Modi on Train Accident: నోట మాట రావడం లేదు, ప్రమాదం తీవ్రంగా కలచివేసింది - రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

ChatGPT: షాకిస్తున్న ఛాట్ జీపీటీ - గూగుల్ అసిస్టెంట్, యాపిల్ సిరి తరహాలో!

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?

Chiranjeevi Cancer - Fact Check : చిరంజీవికి క్యాన్సర్ వచ్చిందా? అసలు నిజం ఏమిటి? మెగాస్టార్ చెప్పింది ఏమిటి?