By: ABP Desam | Updated at : 10 Oct 2021 12:24 PM (IST)
Edited By: Eleti Saketh Reddy
ఐపీఎల్‌లో క్వాలిఫయర్ 1 మ్యాచ్‌లో ఢిల్లీ, చెన్నై తలపడనున్నాయి.(ఫైల్ ఫొటో)
ఈ సంవత్సరం ఐపీఎల్ సీజన్ ముగింపుకు వచ్చేసింది. విజేత ఎవరో తెలుసుకోవడానికి కేవలం నాలుగు మ్యాచ్‌ల దూరం మాత్రమే ఉంది. నేడు మొదటి క్వాలిఫయర్ మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. లీగ్ లీడర్‌గా నిలిచిన ఢిల్లీ, పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న చెన్నైతో తలపడనుంది. ఈ మ్యాచ్ దుబాయ్ స్టేడియంలో జరగనుంది.
ఐపీఎల్ రెండో దశ ప్రారంభం అయిన దగ్గరనుంచి ఢిల్లీ క్యాపిటల్స్ ఆరు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు సాధించింది. వారి బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ టాప్ నాచ్‌లో ఉన్నాయి. అయితే ఆర్సీబీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో మాత్రం ఆఖరి బంతికి ఓటమి పాలైంది.
యూఏఈలో ఐపీఎల్ ప్రారంభం అయ్యాక చెన్నై తన మొదటి నాలుగు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. అయితే తర్వాత మూడు మ్యాచ్‌ల్లో మాత్రం పరాజయాలు పలకరించాయి. ఈ మూడు మ్యాచ్‌ల్లోనూ చెన్నై మొదట బ్యాటింగ్ చేసి లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. ఈ మ్యాచ్‌లో బలంగా ఉన్న ఢిల్లీ మీద విజయం సాధించాలంటే.. చెన్నై సర్వశక్తులూ ఒడ్డాల్సిందే..
ఈ రెండు జట్ల మధ్య ఇప్పటివరకు 25 మ్యాచ్‌లు జరగ్గా.. చెన్నై 15 సార్లు, ఢిల్లీ 10 సార్లు విజయం సాధించాయి. అయితే గత నాలుగు మ్యాచ్‌ల్లో మాత్రం ఢిల్లీనే విజయం సాధించడం విశేషం. మరి ఐదోసారి విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకుంటుందా.. ఒత్తిడికి చిత్తయి క్వాలిఫయర్ 2 ఆడాల్సిన పరిస్థితి తెచ్చుకుంటుందా అని తెలియాలంటే సాయంత్రం వరకు ఆగాల్సిందే..
Also Read: మెస్సీ.. ఏడోసారి గెలుస్తాడా? రొనాల్డోతో పోటీపడుతున్న అర్జెంటీనా దిగ్గజం
చెన్నై సూపర్ కింగ్స్ తుదిజట్టు(అంచనా)
ఫాఫ్ డుఫ్లెసిస్, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, అంబటి రాయుడు, సురేష్ రైనా/రాబిన్ ఉతప్ప, ఎంఎస్ ధోని(కెప్టెన్, వికెట్‌కీపర్), రవీంద్ర జడేజా, డ్వేన్ బ్రేవో, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, జోష్ హజిల్‌వుడ్
ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్టు(అంచనా)
పృథ్వీ షా, శిఖర్ ధావన్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్(కెప్టెన్, వికెట్ కీపర్), రిపల్ పటేల్, షిమ్రన్ హెట్‌మేయర్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కగిసో రబడ, అవేష్ ఖాన్, ఆన్రిచ్ నోర్జే
Also Read: డేవిడ్ వార్నర్ అంశంలో గుసగుసలెందుకు? ఏదో జరుగుతోందని సంజయ్ మంజ్రేకర్ అనుమానం!
Also Read: ఆఖరి బంతికి సిక్స్..! ఆ కిక్కులో ఆర్‌సీబీ చేసుకున్న సంబరాలు చూడండి
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
RR Vs CSK: మెరుపు ఆరంభం లభించినా తడబడ్డ చెన్నై - రాజస్తాన్ లక్ష్యం ఎంతంటే?
RR Vs CSK Toss: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చెన్నై - ఈ మ్యాచ్ రాజస్తాన్‌కే కీలకం
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
MS Dhoni IPL 2023: ఎంఎస్ ధోనీ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్, విజిల్ వేస్తున్న సీఎస్కే అభిమానులు
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం
Poorna Photos: కుందనపు బొమ్మా నిను చూస్తే మనసుకి వెలుగమ్మా
Congress Rachabanda : రైతు డిక్లరేషన్‌పై రచ్చబండల్లో చర్చ - ఇక ప్రజల్లోకి తెలంగాణ కాంగ్రెస్