Ballon d'Or: మెస్సీ.. ఏడోసారి గెలుస్తాడా? రొనాల్డోతో పోటీపడుతున్న అర్జెంటీనా దిగ్గజం
లయోనల్ మెస్సీ 'బాలన్ డి ఓర్'ను రికార్డు స్థాయిలో ఏడో సారి గెలిచేందుకు సిద్ధమయ్యాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడైన క్రిస్టియానో రొనాల్డో అతడికి గట్టి పోటీనిస్తున్నాడు.
ఫుట్‌బాల్ దిగ్గజం లయోనల్ మెస్సీ మరో ప్రతిష్ఠాత్మక అవార్డు రేసులో ముందున్నాడు. పురుషుల విభాగంలో 'బాలన్ డి ఓర్'ను రికార్డు స్థాయిలో ఏడో సారి గెలిచేందుకు సిద్ధమయ్యాడు. ప్రపంచంలోనే అత్యుత్తమ ఫుట్‌బాల్ ఆటగాడైన క్రిస్టియానో రొనాల్డో అతడికి గట్టి పోటీనిస్తున్నాడు. 2021 పురస్కారం రేసులో నిర్వాహకులు 30 మందిని నామినేట్ చేశారు.
Also Read: సన్‌రైజర్స్‌పై 42 పరుగులతో ముంబై విజయం.. అయినా లేదు ప్రయోజనం!
మహిళల విభాగంలో అమెరికా అమ్మాయి సామ్ మెవిస్ నామినేట్ అయింది. యూఎస్ నుంచి ఈమె ఒక్కరినే నామినేట్ చేశారు. ఒలింపిక్ స్వర్ణ పతకం సాధించిన కెనడా జట్టు నుంచి జెస్సీ ఫ్లెమింగ్, యాష్లే లారెన్స్, క్రిస్టైన్ సింక్లెయిర్ నామినేట్ అయ్యారు. మొత్తంగా 'బాలన్ డి ఓర్ ఫెమినైన్'కు 20 మందిని షార్ట్‌లిస్ట్ చేశారు.
Also Read: చితక్కొట్టిన శ్రీకర్.. ఆఖరి బంతికి సిక్సర్‌తో దిల్లీకి షాక్
ప్రపంచ ఫుట్‌బాల్ చరిత్రలో లయోనల్ మెస్సీ ఒక్కడే ఆరుసార్లు బాలన్ డిఓర్‌ను గెలుచుకున్నాడు. రొనాల్డో ఐదు అవార్డులతో అతడి తర్వాతి స్థానంలో ఉన్నారు. ఇక మూడు సార్లకు పైగా గెలిచింది వీరిద్దరే. కోపా అమెరికాలో అర్జెంటీనాకు ట్రోఫీ అందించడంతో ఈ ఏడాది మొదట్లోనే మెస్సీకి ఓ అంతర్జాతీయ పురస్కారం అందింది.
Also Read: అంతర్జాతీయ క్రికెట్లో దూకుడు ఐపీఎల్‌లో ఎందుకు కనిపించదో..! రోహిత్ బ్యాటింగ్‌పై గౌతీ ఆశ్చర్యం
క్రిస్టియానో రొనాల్డోను పక్కనపెడితే బేయార్న్ మ్యూనిక్ ఫార్వర్డ్ రాబర్ట్ లెవండోస్కీ.. మెస్సీకి గట్టిపోటీనిస్తున్నాడు. బుందెల్‌స్లిగా 2020-21 సీజన్లో అతడు 41గోల్స్ సాధించి గెర్డ్ ముల్లర్ రికార్డును బద్దలు కొట్టాడు.
బాలన్ డిఓర్ పురస్కారాన్ని ఏటా ఫ్రాన్స్ అందజేస్తుంది. 1956లో ఇంగ్లాండ్ ఆటగాడు స్టాన్లీ మాథ్యూస్‌కు మొదటి అవార్డు అందజేశారు. ఇక 2018 నుంచి బాలన్ డిఓర్ ఫెమినైన్‌ను ఇస్తున్నారు. మొదట అడా హెగెర్‌బెర్గ్‌కు ఇచ్చారు. ఫిఫా అత్యుత్తమ అవార్డులతో సమానంగా బాలన్ డిఓర్‌ను భావిస్తారు.
👏 Leo Messi among the 30 finalists for the #BallondOr.
— FC Barcelona (@FCBarcelona) October 8, 2021
Good luck, Leo! pic.twitter.com/9itM1twOWV
🚨 | OFFICIAL: Full list of nominees for the 2021 Men's #BallondOr pic.twitter.com/NWG514rd17
— Football Daily (@footballdaily) October 8, 2021
Here is the first part of the nominees for the 2021 Yachine Trophy! #tropheeyachine
— France Football #BallondOr (@francefootball) October 8, 2021
🇮🇹 Gianluigi Donnarumma
🇧🇷 Ederson
🇩🇰 Kasper Schmeichel
🇸🇳 Edouard Mendy
🇧🇪 Thibaut Courtois#ballondor pic.twitter.com/uqnWmZPiwr