By: ABP Desam | Updated at : 08 Oct 2021 06:46 PM (IST)
Edited By: Ramakrishna Paladi
రోహిత్ శర్మ
అంతర్జాతీయ మ్యాచుల్లో పరుగుల వరద పారించే రోహిత్‌శర్మ ఐపీఎల్‌లో మాత్రం అలా ఆడకపోవడం తనను విస్మయపరుస్తోందని గౌతమ్ గంభీర్ అన్నాడు. ముంబయి ఇండియన్స్‌కు ఉన్న బ్యాటింగ్ డెప్త్‌కు అతడు మరింత దూకుడుగా ఆడాల్సిందని సూచించాడు. ఐపీఎల్‌లో అతడు ఒక్కసారీ 600+ పరుగులు చేయలేదని వెల్లడించాడు. 2017 నుంచి 400 మించి పరుగులు చేయలేదని పేర్కొన్నాడు.
Also Read: కోల్‌కతాకు దాదాపు ప్లేఆఫ్ బెర్తు.. ముంబై ఆశలు గల్లంతు..... రాజస్తాన్‌పై రైడర్స్ భారీ విజయం!
'ఐపీఎల్‌లో రోహిత్‌శర్మ పరుగుల సునామీని ఎందుకు సృష్టించడం లేదో నాకైతే అర్థంకావడం లేదు. ఈ విషయంలో అతడికి అండగా ఉండలేను. నిజానికి హిట్‌మ్యాన్ ప్రపంచస్థాయి ఆటగాడు. అతడు తొలిసారి అంతర్జాతీయ మ్యాచులో విజృంభించినప్పుడు స్ఫూర్తి పొందాను. భారత క్రికెట్లో అతడో గొప్ప ప్రతిభావంతుడని నేనిప్పటికీ చెప్పగలను' గౌతీ అన్నాడు.
Also Read: ఇసుక కాదు..! చెన్నైకి కేఎల్ తుపాను సెగ! 13 ఓవర్లకే లక్ష్యం ఛేదించేసిన కేఎల్ రాహుల్
'రోహిత్ అంతర్జాతీయ వేదికలపై నిరూపించుకున్నాడు. ముంబయి జెర్సీలో మాత్రం స్థాయికి తగ్గట్టు ఆడకపోవడం ఆశ్చర్యపరుస్తుంది. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లా అతడు 600+ పరుగులు చేయడం చూడలేదు. ప్రతిభావంతుడైన హిట్‌మ్యాన్ తన స్థాయి ప్రభావం ఐపీఎల్‌లో చూపించలేదు' అని గంభీర్ పేర్కొన్నాడు.
Also Read: సన్‌రైజర్స్ నవ్వింది! థ్రిల్లర్ మ్యాచులో కోహ్లీసేనను ఓడించింది
'రోహిత్ ఆడుతున్న విధానం కాస్త భిన్నంగా అనిపిస్తోంది. ప్రత్యేకించి ఐపీఎల్‌లో. అంతర్జాతీయ క్రికెట్లో విరుచుకుపడే రోహిత్ ఐపీఎల్‌లో మాత్రం నత్తనడకన ఎందుకు బ్యాటింగ్ చేస్తున్నాడో తెలియదు. ముంబయికి ఉన్న బ్యాటింగ్ డెప్తుకు అతడు మరింత దూకుడుగా ఆడాలి' అని గౌతీ వెల్లడించాడు.
Also Read: ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో?
ఇండియన్ ప్రీమియర్ లీగులో ఇప్పటి వరకు 212 మ్యాచులాడిన రోహిత్ 31.24 సగటుతో 5593 పరుగులు చేశాడు. 2013లో 538 చేయడమే ఒక సీజన్లో టాప్. ఈ సీజన్లో 12 మ్యాచులాడిన హిట్‌మ్యాన్ 30 సగటుతో 363 పరుగులు సాధించాడు.
Also Read: బాలీవుడ్‌లో అడుగుపెడతారా? ధోనీ ఏం చెప్పాడంటే..!
Match day! 💙
— Mumbai Indians (@mipaltan) October 8, 2021
We are off to play against the Sunrisers at the Sheikh Zayed Stadium📍🏟️#OneFamily #MumbaiIndians #IPL2021 #SRHvMI #KhelTakaTak @MarriottBonvoy @MXTakaTak MI TV pic.twitter.com/zPKcHiEGgT
🟧 ⚔️ 🟦
— Mumbai Indians (@mipaltan) October 8, 2021
The Men in Blue and Gold get ready for the SRH challenge💪🔥#OneFamily #MumbaiIndians #IPL2021 #SRHvMI #KhelTakaTak @MXTakaTak MI TV pic.twitter.com/vAp9Eu0hKQ
WTC Final: ఓవల్ సీక్రెట్ ప్యాటర్న్ అదే - రన్స్ కొట్టే టెక్నిక్ చెప్పిన హిట్‌మ్యాన్!
Amit Shah meets wrestlers: కేంద్ర హోంమంత్రితో రెజ్లర్ల భేటీ, చట్టం పని చట్టాన్ని చేసుకోనివ్వండన్న అమిత్‌షా
Kick Boxer Gayatri: ఇసుక తెన్నెల్లో మెరిసిన మాణిక్యం- జాతీయ స్థాయిలో 3 బంగారు పతకాలు సాధించిన గాయత్రి
WTC Final 2023: ఓవల్‌లో మనోళ్ల ఆట ఎలా ఉంది ? - టాప్ స్కోర్లు చేసింది వీరే
Josh Hazelwood Ruled Out: డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ముందు ఆసీస్‌కు భారీ షాక్ - ‘జోష్’ లేకుండానే బరిలోకి దిగనున్న కంగారూలు
KTR Mulugu Tour: ఈ 7న ములుగు జిల్లాలో కేటీఆర్ పర్యటన, కలెక్టరేట్ సహా పలు పనులకు శంకుస్థాపన
Adipurush: థియేటర్లో హనుమంతుడి కోసం ప్రత్యేకంగా ఒక సీటు - 'ఆదిపురుష్' టీమ్ అరుదైన నిర్ణయం
Varahi Yatra Poster: పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర పోస్టర్ ఆవిష్కరించిన జనసేన
Odisha Train Accident: రైలు ప్రమాదం మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం- మమతా బెనర్జీ