News
News
X

ఇలా జరగడం ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి.. ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారో?

ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లు జరిగితే ఒకటి మధ్యాహ్నం, ఒకటి సాయంత్రం జరుగుతాయి. కానీ రేపు ఐపీఎల్‌లో రెండు మ్యాచ్‌లూ సాయంత్రమే జరగనున్నాయి.

FOLLOW US: 
 
ఐపీఎల్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు సాయంత్రం 7:30కు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో ఒక మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడుతూ ఉండగా, మరో మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ పోటీ పడనున్నాయి. ఈ రెండు మ్యాచ్‌లతో లీగ్ స్టేజ్ అయిపోతుంది. అక్టోబర్ 10వ తేదీ నుంచి ప్లేఆఫ్స్ ప్రారంభం అవుతాయి. ఒకేసారి రెండు మ్యాచ్‌లు జరుగుతుండటంతో ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు, వ్యూయర్ షిప్ దెబ్బ తింటుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

ముంబై ఇండియన్స్, సన్‌రైజర్స్ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌తో ముంబై ఇండియన్స్ భవితవ్యం తేలనుంది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌పై భారీ తేడాతో గెలిస్తేనే.. ముంబై ఇండియన్స్‌కు ప్లేఆఫ్స్‌కు చేరే అవకాశం ఉంటుంది. అయితే సన్‌రైజర్స్ తన గత మూడు మ్యాచ్‌ల్లో రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించింది. రాజస్తాన్‌ను ఓడించి వారి ప్లేఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది. రాయల్ చాలెంజర్స్‌ను చిత్తు చేసి వారిని రెండో స్థానానికి చేరకుండా ఆపింది. కాబట్టి ముంబై ప్లే ఆఫ్స్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో తిరుగులేని విజయం సాధించాల్సిందే.

గత మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్‌పై ముంబై తన బెస్ట్ ఇచ్చింది. క్వింటన్ డికాక్ స్థానంలో ఇషాన్ కిషన్‌ను, కృనాల్ పాండ్యా స్థానంలో జిమ్మీ నీషంను జట్టులోకి తీసుకోగా.. ఈ రెండు మార్పులూ ఫలితాన్నిచ్చాయి. వాబట్టి అదే ఊపును ముంబై కొనసాగిస్తే చాలు.

ఇక సన్‌రైజర్స్ విషయానికి వస్తే.. గత మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ విఫలమైనా బౌలర్లు అద్భుతంగా రాణించి 141 పరుగులను కాపాడుకున్నారు. కానీ ముంబై లాంటి జట్టు మీద గెలవాలంటే.. బ్యాట్స్‌మెన్ కూడా ఒక చేయి వేయాల్సిందే..

News Reels

రెండో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ రెండు జట్లూ ఇప్పటికే ప్లేఆఫ్స్‌కు చేరిపోయాయి కాబట్టి.. ఈ మ్యాచ్ ప్రభావం ప్లేఆఫ్స్ రేసు మీద ఉండదు. క్వాలిఫయర్-1 మ్యాచ్ మీద మాత్రం దీని ప్రభావం ఉండే అవకాశం ఉంది.

గత ఐదు మ్యాచ్‌ల్లో నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ఢిల్లీ అద్భుత ఫాంలో ఉంది. బ్యాట్స్‌మెన్, బౌలర్లు అందరూ తమ బాధ్యతను అద్భుతంగా నెరవేరుస్తున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిస్తే ప్లేఆఫ్స్‌కు మరింత ఉత్సాహంగా ఢిల్లీ వెళ్తుంది. మరోవైపు బెంగళూరు గత మ్యాచ్‌లో ఓడిపోయింది. ఈ మ్యాచ్ కూడా ఓడిపోతే.. ప్లేఆఫ్స్‌కు ముందు మానసికంగా బలహీనంగా అయ్యే అవకాశం ఉంది.

Published at : 08 Oct 2021 03:50 PM (IST) Tags: IPL IPL 2021 First Time in IPL IPL Evening Matches MI Vs SRH DC Vs RCB

సంబంధిత కథనాలు

Warner On Captaincy Ban: 'నా కుటుంబమే నాకు ముఖ్యం- ఆ చెత్తను క్లీన్ చేసే వాషింగ్ మెషీన్ ను కాదు'

Warner On Captaincy Ban: 'నా కుటుంబమే నాకు ముఖ్యం- ఆ చెత్తను క్లీన్ చేసే వాషింగ్ మెషీన్ ను కాదు'

Rohit Sharma: రోహిత్ ఖాతాలో అదిరిపోయే రికార్డు - క్రిస్ గేల్ తర్వాతి స్థానంలో!

Rohit Sharma: రోహిత్ ఖాతాలో అదిరిపోయే రికార్డు - క్రిస్ గేల్ తర్వాతి స్థానంలో!

ROHIT SHARMA: రోహిత్‌కు తీవ్ర గాయం - భారత్‌కు తిరిగిరానున్న కెప్టెన్!

ROHIT SHARMA: రోహిత్‌కు తీవ్ర గాయం - భారత్‌కు తిరిగిరానున్న కెప్టెన్!

FIFA WC 2022: ఫిఫా వరల్డ్ కప్‌ క్వార్టర్స్‌లో ఎవరితో ఎవరు పోటీ - ఫేవరెట్స్ ఎవరు?

FIFA WC 2022: ఫిఫా వరల్డ్ కప్‌ క్వార్టర్స్‌లో ఎవరితో ఎవరు పోటీ - ఫేవరెట్స్ ఎవరు?

Rohit Sharma Innings: 'రోహిత్' ది వారియర్- భారత్ మ్యాచ్ ఓడినా అతను మనసులు గెలిచాడు

Rohit Sharma Innings: 'రోహిత్' ది వారియర్- భారత్ మ్యాచ్ ఓడినా అతను మనసులు గెలిచాడు

టాప్ స్టోరీస్

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

Hyderabad Real Estate: సర్‌ప్రైజ్‌! హైదరాబాద్‌తో పోలిస్తే సంగారెడ్డిలో 47% పెరిగిన ఇళ్ల ధరలు - ఏంటీ రీజన్‌!

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

ఈ ‘వారాహి’ వెనుకున్నది ఎవరు ?

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

Gujarat Election Results 2022: ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్న బీజేపీ, మోడీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!

TRS MLAs Poaching Case: రామచంద్ర భారతి, నంద కుమార్‌ ను విడుదల చేసినట్లే చేసి మళ్లీ అరెస్ట్ చేసిన పోలీసులు!