News
News
X

Cricketer Sneha Deepthi: మహిళా క్రికెటర్లకు ఆదర్శం ఈ అమ్మ - స్నేహ దీప్తి స్పెషల్ స్టోరీ

Cricketer Sneha Deepthi: ఆమె ఓ అమ్మ. అంతకు మించి మంచి క్రికెటర్ కూడా. యంగెస్ట్ క్రికెట్ ప్లేయర్ గా డెబ్యూ చేసిన ఆమె.. పదేళ్ల తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ ఆమెను రూ.30 లక్షలకు సొంతం చేసుకుంది.

FOLLOW US: 
Share:

Cricketer Sneha Deepthi: ఓ అమ్మగా.. అంతకు మించి మంచి క్రికెటర్ గా పేరు తెచ్చుకున్న తెలుగు తేజం స్నేహా దీప్తి గురించి తెలిసిందే. అయితే తాజాగా జరిగిన డబ్ల్యూపీఎల్ వేలంలో 26 ఏళ్ల స్నేహా దీప్తిని దిల్లీ క్యాపిటల్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలోనే రెండేళ్ల కూతురును విడిచి ఇండియా తరఫున ఆడేందుకు స్నేహా దీప్తి సమాయత్తం అవుతోంది. ఈ క్రమంలోనే ఏబీపీ దేశం స్నేహా దీప్తిని వీడియో కాల్ ద్వారా ఇంటర్వ్యూ చేయగా పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది. 

రిపోర్టర్: ఢిల్లీ క్యాపిటల్స్ క్యాంప్ అంతా బాగా సెట్ అయిందా. ఎలా ఉంది. డబ్ల్యూపీఎల్.. ఫస్ట్ టైమ్ ఇలాంటి లీగ్ జరుగుతోంది కదా..

స్నేహా దీప్తి: యాక్చువల్లీ చాలా బాగుంది. అండ్ బీసీసీఐకి ఫస్ట్ థాంక్స్ చెప్పాలి. బికాస్ మెన్ ని ఎలా అయితే ఎంకరేజ్ చేస్తున్నారో ఉమెన్ ని కూడా ఎంకరేజ్ చేయడం స్టార్ట్ చేశారు. సో డెఫినెట్ గా ఎలైట్ ప్లస్ లో ఆడితే మన డొమెస్టిక్ ప్లేయర్స్ కానీ, ఇండియా ప్లేయర్స్ కానీ చాలా ఛాన్సెస్ ఉంటాయి. చాలా హ్యాపీగా ఉంది. 

రిపోర్టర్: మీదొక ఇన్సిపిరేషనల్ స్టోరీ అని వ్యూయర్స్ అందరికీ చెప్పాను. ఆ ఇన్సిపిరేషన్ స్టోరీ మాకు తెలుసు. మీరు అది గర్వంగా చెప్పుకోగలుగుతారు. మీ నుంచి మా వ్యూయర్స్ వినాలనుకుంటున్నారు. యూ షుడ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్ కదా. ఎలాంటి సిట్యుయేషన్ నుంచి వచ్చారు. 

స్నేహా దీప్తి:  ప్రతీ ఒక్కరి లైఫ్ లో టఫ్ సిట్యుయేషన్స్ ఉంటాయి. దాన్ని మనం ఎలా ఓవర్ కమ్ చేస్తామన్నది ఇంపార్టెంట్. నాకు తెలిసి నా స్టోరీ ఏం అంత ఇంపార్టెంట్ కాదు. ఎవ్రీ ఉమెన్ లైఫ్ లో ఉండే స్టోరీ ఇదే. ఇంటి నుంచి కనీసం స్కూల్ కు వెళ్లాలన్నా, కాకపోతే ఏదైనా లక్ష్యాన్ని సాధించాలంటే చాలా గట్స్ ఉండాలి. ఇది వెరీ బిగ్ ఛాలెంజ్. 

రిపోర్టర్: అయితే మీరెందుకో కాస్త మాడెస్ట్ గా, హంబుల్ గా ఉన్నారు. మా వ్యూయర్స్ కి ఏమైనా చెప్తారా. సో ఇందాక చెప్పుకున్నాం కదా యంగెస్ట్ ఉమెన్ క్రికెటర్ ఇండియా తరఫున డెబ్యూ చేయడానికి, ఆ తర్వాత కూడా కన్సిస్టెంట్ గా డొమెస్టిక్ ప్లేయర్ గా పెర్ఫార్మెన్స్ ఇస్తూ వచ్చారు. కానీ 2019లో ప్రొఫెషనల్ కెరియర్ లో పర్సనల్ గా తన గ్రోత్ కూడా ఎంత ముఖ్యమో ఆమె అర్థం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నారు. ఆపై అమ్మ అయ్యారు. మీ టఫ్ జర్నీ గురించి మీరు చెబితే వినాలనుకుంటున్నాం.

స్నేహా దీప్తి: మా ఫాదర్ గురించి ఆలోచించి 2019లో పెళ్లి చేసుకున్నాను. వారికి టెన్షన్ తీసుకురావొద్దన్న ఉద్దేశంతో పెళ్లికి ఓకే చెప్పాను. 

రిపోర్టర్: తల్లి అయిన తర్వాత మీ కెరీర్ ఎలా ఉంటుంది, మళ్లీ క్రికెట్ ఆడగలనా అని ఆలోచించారా?

స్నేహా దీప్తి: పెళ్లయిన తర్వాత రెండేళ్ల వరకు నేను క్రికెట్ ఆడాలనుకుంటున్నానని మా వారితో చెప్పేశాను. ఆ తర్వాత కరోనా వచ్చేసింది. అప్పుడే గర్భం వచ్చింది. ఆ సమయంలో నువ్వు మళ్లీ క్రికెట్ ఆడాలని మా వారే నాకు చెప్పారు. ప్రెగ్నెన్సీ తర్వాత చాలా బరువు పెరిగాను. అప్పుడు నాకు నేనే నచ్చలేదు. ఆ సమయంలో మానసికంగా ఒత్తిడి అనుభవించాను.
అందరిపై కోపాన్ని చూపించేదాన్ని. ఆ సమయంలోనే గతంలో నేనేలా ఉండేదాన్ని అనుకుని మళ్లీ క్రికెట్ ఆడాలని నిర్ణయించుకున్నాను. ఆ తర్వతా ట్రైనింగ్ మొదలు పెట్టాను. మళ్లీ మంగళగిరి వెళ్లిపోయి అక్కటే ట్రైనింగ్ తీసుకున్నాను. పాపను హైదరాబాద్ లోనే మా అత్తగారు చూసుకున్నారు. వారాంతాల్లో హైదరాబాద్ కు వచ్చి పాపతో గడిపేదాన్ని. అలా 3, 4 నెలలు అలా ట్రైనింగ్ తీసుకున్నాను. మా అసోసియేషన్ వాళ్లు నన్ను మ్యాచులు ఆడమని చెప్పారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సపోర్టుతో మళ్లీ క్రికెట్ ఆడగలిగాను. 

రిపోర్టర్: దిల్లీ క్యాపిటల్స్ క్యాంప్ ఎలా ఉంది? అంతర్జాతీయ క్రీడాకారుల నుంచి ఎలాంటి విషయాలు నేర్చుకుంటున్నారు?

స్నేహా దీప్తి: వాళ్లు చాలా పెద్ద స్టార్స్. కానీ వారిలో ఆ ఫీలింగ్స్ ఏమీ ఉండవు. చాలా కలుపుగోలుగా ఉంటున్నారు. చాలా త్వరగా కలిసిపోతున్నారు. నేను వారికి చాలా దగ్గరుండి వారి డైలీ రొటీన్ తెలుసుకుంటున్నాను. వారు కూడా చాలా చెబుతున్నారు. మా పాప గురించి అడుగుతారు. తనను ఎందుకు తీసుకురావట్లేదని అంటుంటారు.

రిపోర్టర్: మీరు మరింత ఎత్తుకు ఎదగాలని, డబ్ల్యూపీఎల్ లో చక్కని ప్రదర్శన చేసి దేశానికి ఆడాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. డబ్ల్యూపీఎల్ లో చక్కగా ఆడాలని ఏబీపీ దేశం తరఫున కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.

స్నేహా దీప్తి పూర్తి ఇంటర్వూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Published at : 08 Mar 2023 05:33 PM (IST) Tags: Sneha Sneha Deepthi woman cricketer cricketer sneha deepthi

సంబంధిత కథనాలు

IPL 2023 Slogans: ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ స్లోగన్, దాని అర్థం మీకు తెలుసా?

IPL 2023 Slogans: ఐపీఎల్‌లో మీ ఫేవరెట్ టీమ్ స్లోగన్, దాని అర్థం మీకు తెలుసా?

Sanju Samson: సంజు శామ్సన్ ఎదురు చూపులకు సరైన ఫలితం - ఏకంగా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో!

Sanju Samson: సంజు శామ్సన్ ఎదురు చూపులకు సరైన ఫలితం - ఏకంగా సూర్యకుమార్ యాదవ్ స్థానంలో!

KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్‌ తర్వాత మూడో కెప్టెన్‌!

KKR New Captain: కేకేఆర్‌కు కెప్టెన్సీ కష్టాలు! గంభీర్‌ తర్వాత మూడో కెప్టెన్‌!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!

Nitish Rana: కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన కోల్‌కతా - అస్సలు అనుభవం లేని ప్లేయర్‌కి!

Indore Stadium Pitch Rating: బీసీసీఐ అప్పీల్‌ - ఇండోర్‌ పిచ్‌ రేటింగ్‌ను మార్చిన ఐసీసీ!

Indore Stadium Pitch Rating: బీసీసీఐ అప్పీల్‌ - ఇండోర్‌ పిచ్‌ రేటింగ్‌ను మార్చిన ఐసీసీ!

టాప్ స్టోరీస్

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Polavaram Project: పోలవరం ప్రాజెక్టు ఎత్తు, సామర్థ్యంపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Nellore YSRCP: నెల్లూరు వైసీపీలో నాలుగో వికెట్ ? ప్రచారం మూమూలుగా లేదుగా !!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

Vishwak Sen: ‘దాస్ కా ధమ్కీ’ కలెక్షన్స్ - విశ్వక్ సేన్ కెరీర్‌లో సరికొత్త రికార్డ్!

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత

KTR Convoy: సిరిసిల్లలో మంత్రి కేటీఆర్ కు నిరసన సెగ - కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు, ఉద్రిక్తత