By: ABP Desam | Updated at : 16 Feb 2023 07:23 PM (IST)
హ్యారీ బ్రూక్ (ఫైల్ ఫొటో)
Harry Brook Test Stats ENG vs NZ: ఇంగ్లాండ్‌కు చెందిన హ్యారీ బ్రూక్ వయస్సు కేవలం 23 సంవత్సరాలు మాత్రమే. గతేడాది అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. అతను జనవరి 2022లో తన టీ20 కెరీర్‌లో అరంగేట్రం చేశాడు. ఏడు నెలల్లోనే అతను క్రికెట్‌లోని ఇతర రెండు ఫార్మాట్‌లలో కూడా అరంగేట్రం చేసే అవకాశాన్ని పొందాడు. ఈ ఆటగాడు టీ20, వన్డేల్లో యావరేజ్ ప్రదర్శన ఇస్తున్నాడు కానీ టెస్ట్‌లో ఈ బ్యాట్స్‌మన్ గణాంకాలు షాకింగ్‌గా ఉన్నాయి.
హ్యారీ బ్రూక్ ప్రస్తుతం తన ఐదో టెస్టు మ్యాచ్‌ను ఆడుతున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మౌంట్ మౌంగనుయ్ టెస్టు తొలి రోజున అతను 81 బంతుల్లో 89 పరుగులు చేశాడు. అతను తన గత నాలుగు టెస్టుల్లోనూ అదే రీతిలో పరుగులు చేస్తున్నాడు.
విశేషం ఏమిటంటే ఐదు టెస్ట్ మ్యాచ్‌లలో ఏడు ఇన్నింగ్స్‌లలో అతని బ్యాటింగ్ సగటు ఏకంగా 81.28గా ఉంది. అతని స్ట్రైక్ రేట్ కూడా 94.51గా ఉండటం విశేషం. ఈ 7 ఇన్నింగ్స్‌ల్లో అతను మూడు సెంచరీలు, రెండు అర్ధ సెంచరీలు సాధించాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టు టెస్ట్ క్రికెట్ ఆడుతున్న విధానానికి హ్యారీ బ్రూక్ ఖచ్చితంగా పర్ఫెక్ట్ అని నిరూపించుకున్నాడు.
వన్డేలు, టీ20ల్లో ఇదే ప్రదర్శన
హ్యారీ బ్రూక్ ఇప్పటి వరకు కేవలం మూడు వన్డేలు మాత్రమే ఆడాడు. ఇక్కడ అతను ఇక్కడ ఎటువంటి ప్రత్యేకతను చూపించలేకపోయాడు. హ్యరీ బ్రూక్ మూడు వన్డేల్లో 28.66 సగటుతో 86 పరుగులు మాత్రమే చేశాడు. టీ20లో అతని రికార్డు మెరుగ్గా ఉన్నప్పటికీ హ్యారీ బ్రూక్ ఇప్పటివరకు 20 టీ20 మ్యాచ్‌లలో 17 ఇన్నింగ్స్‌లలో 26.57 బ్యాటింగ్ సగటుతో, 137.77 అద్భుతమైన స్ట్రైక్ రేట్‌తో 372 పరుగులు చేశాడు.
పండగ చేసుకుంటున్న సన్‌రైజర్స్
ఐపీఎల్ 2023 కోసం గత డిసెంబర్‌లో జరిగిన వేలంలో, హ్యారీ బ్రూక్ కోసం ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడ్డాయి. చాలా మంది ఫ్రాంఛైజీలు అతడిని తమ జట్టులో చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ డాషింగ్ బ్యాట్స్‌మన్‌ను అత్యధిక ధర చెల్లించి తమ జట్టులో భాగం చేసింది. రూ.13.25 కోట్లకు హ్యారీ బ్రూక్‌ను సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది.
హామిల్టన్‌లోని సెడాన్ పార్క్‌లో న్యూజిలాండ్ XIతో జరిగిన రెండు రోజుల వార్మప్ మ్యాచ్‌లో హ్యారీ బ్రూక్ ఐదు బంతుల్లో ఐదు సిక్సర్లు కొట్టాడు. బ్రూక్ భారత సంతతికి చెందిన ఆఫ్ స్పిన్నర్ ఆదిత్య అశోక్‌ను లక్ష్యంగా చేసుకుని ఒకదాని తర్వాత ఒకటిగా ఐదు సిక్సర్లు బాదాడు. బ్రూక్ కొట్టిన ఈ సిక్స్‌ల వీడియో సోషల్ మీడియాలో ఎక్కువగా వైరల్ అవుతోంది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో, బ్రూక్ తన మొదటి సిక్స్‌ను ఆన్ సైడ్ వైపు కొట్టడాన్ని మీరు చూడవచ్చు. దీని తర్వాత, అతను బ్యాక్‌ఫుట్‌పై వెళ్లి లెగ్ సైడ్ వైపు రెండవ సిక్స్ కొట్టాడు. అనంతరం మరోసారి జోరుగా బ్యాట్ ఝుళిపించి మూడో సిక్స్ బాదాడు. దీని తర్వాత మరోసారి బ్యాక్‌ఫుట్‌పై వెళ్లి నాలుగో సిక్స్ కొట్టాడు. అదే సమయంలో అతను చివరి సిక్స్ కోసం క్రీజు నుంచి బయటకు వచ్చాడు.
Saweety Boora: గోల్డ్ తెచ్చిన సవీటీ బూరా - మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండో స్వర్ణం!
Chris Gayle: క్రిస్ గేల్‌కు ఆర్సీబీ అరుదైన గౌరవం - విరాట్ కోహ్లీ ఏమన్నాడు?
శాంతిభద్రతల్లోనే కాదు ఆటల్లోనూ తగ్గేదేలే
MI vs DC Playing XI: మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో తుదిజట్లు ఎలా ఉండనున్నాయి?
DCW Vs MIW WPL 2023: ఫైనల్స్‌లో ప్లేస్ కోసం ముంబై, యూపీల మధ్య పోటీ - లైవ్ ఎక్కడ చూడచ్చంటే?
Breaking News Live Telugu Updates: ఆకాశంలోకి LVM3 -M3 రాకెట్, ఏకంగా 36 ఉపగ్రహాలు మోసుకెళ్లిన వాహకనౌక
BRS PLan : మహారాష్ట్రలో రెండో సభ - ఇతర రాష్ట్రాలను బీఆర్ఎస్ చీఫ్ లైట్ తీసుకుంటున్నారా ?
BRS Leaders Fight : ఎల్బీనగర్ బీఆర్ఎస్ నేతల మధ్య వర్గపోరు, మంత్రి కేటీఆర్ సమక్షంలోనే ఘర్షణ
Nara Rohit : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ ? ఎంట్రీ ఎప్పుడో చెప్పిన నారా రోహిత్
TTD News: ఏడుకొండల్లో పెరిగిన రద్దీ, వీకెండ్ వల్ల 26 కంపార్ట్మెంట్లల్లో భక్తులు - దర్శన సమయం ఎంతంటే