అన్వేషించండి

Virat Kohli: టీమ్‌ఇండియా నంబర్‌ 4.. విరాట్‌ కోహ్లీ!

Virat Kohli: ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంలో ఆడాలని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి సూచిస్తున్నాడు.

Virat Kohli: 

ఐసీసీ వన్డే ప్రపంచకప్‌లో విరాట్‌ కోహ్లీ (Virat Kohli) నాలుగో స్థానంలో ఆడాలని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి సూచిస్తున్నాడు. ఆ స్థానంలో అతడి గణాంకాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పాడు. ఆట ఎదిగే కొద్దీ ఆటగాళ్లూ మారాలని వెల్లడించాడు. 2019 ప్రపంచకప్‌లోనూ తాను ఈ మార్పు గురించి ఆలోచించానని వివరించాడు. స్టార్‌ స్పోర్ట్స్‌కు వచ్చిన ఇంటర్వ్యూలో శాస్త్రి మాట్లాడాడు.

విరాట్‌ కోహ్లీని నాలుగో స్థానంలో ఆడిస్తే హెవీ బ్యాటింగ్‌ టాప్‌ ఆర్డర్‌ను విభజించొచ్చని రవిశాస్త్రి (Ravi Shastri) అంటున్నాడు. దాంతో కుర్రాళ్లు, అనుభవజ్ఞులతో బ్యాటింగ్‌ యూనిట్‌ సమతూకం అవుతుందన్నాడు. 'ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌కు రావాలి. ఒక కెప్టెన్‌గా రోహిత్‌ శర్మకు ఎంతో అనుభవం ఉంది. అతడు మూడో స్థానంలో రావొచ్చు. అవసరాన్ని బట్టి నాలుగో ప్లేస్‌కు రావాలి. ఇక్కడే మనకు ఆటగాళ్ల మానసిక స్థితి అర్థమవుతుంది. టాప్‌ ఆర్డర్లో కాకుండా 3, 4 పొజిషన్లో ఆడాలంటే శుభ్‌మన్‌ గిల్‌ ఎలా ఫీలవుతాడు? ఎవరికీ ఏ స్థానమూ సొంతం కాదు. అవసరమైతే విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంలో రావాలి. జట్టు కోసం తప్పదు' అని శాస్త్రి అన్నాడు.

టీమ్‌ఇండియాకు కోచ్‌గా ఉన్నప్పుడే విరాట్‌ కోహ్లీని నాలుగో స్థానంలో ఆడించడంపై ఆలోచించానని రవిశాస్త్రి తెలిపాడు. 'చివరి రెండు ప్రపంచకప్‌లలో విరాట్‌ను నాలుగో స్థానంలో ఆడించడంపై ఆలోచించాను. టాప్‌ హెవీ బ్యాటింగ్‌ లైనప్‌ను బ్రేక్‌ చేసేందుకు అప్పటి చీఫ్ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌తో మాట్లాడాను. ఎందుకంటే టాప్‌ ఆర్డర్లో 2, 3 వికెట్లు పడ్డాయంటే మన పని అయిపోతోంది. ఇది ఎన్నోసార్లు నిరూపితం అయింది. అందుకే టాప్‌ ఆర్డర్‌ను విభజించడం ముఖ్యం' అని పేర్కొన్నాడు.

'ఒకసారి నంబర్‌ 4లో విరాట్‌ కోహ్లీ గణాంకాలు చూడండి. చాలా బాగుంటాయి' అని శాస్త్రి అన్నాడు. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలో కింగ్‌ కోహ్లీకి తిరుగులేదు. 275 వన్డేల్లో 57.32 సగటుతో 12,898 పరుగులు చేశాడు. స్ట్రైక్‌రేట్‌ 93గా ఉంది. 46 సెంచరీలు, 65 హాఫ్‌ సెంచరీలు కొట్టాడు. కొన్నేళ్లుగా అతడు మూడో స్థానం సొంతం చేసుకున్నాడు. 210 ఇన్నింగ్సుల్లో ఈ స్థానంలో ఆడి 60.20 సగటుతో 10,777 పరుగులు చేశాడు. 39 సెంచరీలు, 55 హాఫ్‌ సెంచరీలు బాదేశాడు. నాలుగో స్థానంలో 39 ఇన్నింగ్సుల్లో 55.21 సగటుతో 1767 పరుగులు చేశాడు. 7 సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలు బాదాడు.

'ఎంత పెద్ద ఆటగాడైనా ఆటతో పాటూ తనూ మారాలి. విరాట్‌ కోహ్లీకీ ఇదే వర్తిస్తుంది. ఇందులో సందేహం లేదు. ఒకసారి ప్రపంచ క్రికెట్‌ను చూడండి. జో రూట్‌, స్టీవ్‌ స్మిత్, కేన్‌ విలియమ్సన్‌ ఇలాగే చేస్తున్నారు. ఆటకు తగ్గట్టుగా మారుతున్నారు. క్రికెట్లో సృజన పెరుగుతోంది. క్రికెటర్లు దానిని అందిపుచ్చుకుంటున్నారు' అని రవిశాస్త్రి అన్నాడు.

ఈ ఏడాది విరాట్‌ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నాడు. 10 వన్డేల్లో 53.37 సగటుతో 427 పరుగులు చేశాడు. రెండు సెంచరీలు, ఒక హాఫ్‌ సెంచరీ కొట్టాడు. శ్రీలంకపై 166తో విజృంభించాడు. అన్ని ఫార్మాట్లలో 17 మ్యాచులు ఆడి 54.66 సగటుతో 984 పరుగులు చేశాడు. నాలుగు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Also Read: కమ్‌బ్యాక్‌కి ముందే బుమ్రా రికార్డు! టీమ్‌ఇండియా కెప్టెన్‌గా మొదటి బౌలర్‌ అతడే!

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Hardik IPL Trade Drama: ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
ఆ టీమ్ లోకి హార్దిక్ పాండ్యా రీ-ఎంట్రీ.. అశ్విన్ ఇంట్రెస్టింగ్ ప్రిడిక్షన్, ఐపీఎల్ ట్రేడింగ్ లో మైంబ్ బ్లోయింగ్ ట్విస్ట్!
IND vs BAN Tour: బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
బంగ్లాదేశ్ టూర్ కి గవర్నమెంట్ పర్మిషన్ కోసం బిసిసిఐ వెయిటింగ్.. రెండు బోర్డుల మధ్య కుదిరిన రాజీ, సిరీస్ నిర్వహణపై ట్విస్ట్!
IND vs SL Spin Attack: లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!
లంకతో ఫస్ట్ టెస్ట్ లో ఇండియా స్పిన్ త్రయంతో అటాక్.. గాలే పిచ్ పై మోర్కెల్ న‌యా స్ట్రాటజీ!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Ration Card Security Features: తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
తెలంగాణలో ఆగస్టు 15న ఆవిష్కరించే స్మార్ట్ రేషన్ కార్డు ఫీచర్స్ ఏంటీ?
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
CJI-NALSAR వివాదంలో బీసీఐ వెనక్కి తగ్గడానికి కారణమేంటీ? జెన్‌జీ ఒత్తిడి ఫలితమేనా? 
TDP YSRCP Polavaram Credit War: పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
పోలవరం నిధులపై టీడీపీ-వైఎస్‌ఆర్‌సీపీ క్రెడిట్ వార్! అసలు పోలవరం ఎప్పటికి పూర్తవుతుంది? రైతులకు నీళ్లు ఎప్పుడు అందుతాయి?
iPhone Sypware Alert: ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
ఐఫోన్ వినియోగదారులకు బిగ్ అలర్ట్‌! 110 దేశాల్లో ఆపిల్ స్పైవేర్ హెచ్చరిక! 
Telangana Free Sewing Machine Scheme: తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
తెలంగాణలో ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు పథకం! అర్హతలు, అప్లై చేసే విధానం ఏంటీ?
Revanth Reddy:
"చేతబడి తిరగబడింది, అష్టదిగ్బంధమయ్యారు" బీఆర్‌ఎస్ నేతలపై రేవంత్ సంచలన వ్యాఖ్యలు 
Vadala OTT : ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
ఓటీటీలో జగపతి బాబు సైకలాజికల్ థ్రిల్లర్ సడన్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?
AP Group 1 SIT Report: డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
డీఎస్సీపై ఉద్యమం - గ్రూప్ 1లో భారీ అక్రమాలు వెలుగులోకి - వైఎస్ఆర్సీపీకి కాలం కలసి రావట్లేదా?
Embed widget