అన్వేషించండి

Virat Kohli : ప్రపంచ క్రికెట్‌లో ఒకే ఒక్కడు కోహ్లీ, ధోనీకి కూడా సాధ్యం కాని ఘనత మరి

Virat Kohli Record: 2024 టీ 20 ప్రపంచ కప్‌ను అందుకోవడం ద్వారా కోహ్లీ ఓ అరుదైన రికార్డును ఏర్పాటు చేశాడు. నాలుగు ఐసీసీ టైటిల్స్‌ అందుకున్న రెండో భారత క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు.

Virat Kohli Became The First Player To Clinch Four ICC Titles: విరాట్‌ కోహ్లీ(Virat Kohli)... టీమిండియాలో స్టార్‌ ప్లేయర్‌. క్రికెట్‌లో అతన్ని గ్రేటెస్ట్‌ ఆఫ్‌ ఆల్‌ టైమ్‌ అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పాదాక్రాంతం చేసుకుని కింగ్‌గా... క్రికెట్‌ సామ్రాజ్యాన్ని ఏలుతున్నాడు. టీ 20 ప్రంపచ కప్‌ ఫైనల్లో అద్భుత ఇన్నింగ్స్‌తో టీమిండియాకు మరోసారి పొట్టి ప్రపంచకప్‌ను అందించాడు. సెమీఫైనల్‌ వరకూ వరుసగా విఫలమైన కీలకమైన మ్యాచ్‌లో మాత్రం తనలోని అత్యుత్తమ ఆటగాడిని బయటకు తీసుకొచ్చి మ్యాచ్ విన్నింగ్‌ నాక్‌ ఆడాడు. ఈ క్రమంలోనే విరాట్ కోహ్లీ అరుదైన చరిత్ర సృష్టించాడు. ఈ ఘనత సాధించిన ఒకే ఒక క్రికెటర్‌గా మరో రికార్డును తన పేరుపై లిఖించుకున్నాడు.

 
ఒకే ఒక్కడు
భారత్ T20 ప్రపంచ కప్ 2024 ట్రోఫీని గెలుచుకుంది. టీ20 ప్రపంచకప్ 2024 ఫైనల్లో భారత్ 7 పరుగుల తేడాతో సఫారీలపై విజయం సాధించింది. దీంతో టీ20 ప్రపంచకప్‌ను రెండుసార్లు గెలిచిన జట్టుగా టీమిండియా అవతరించింది. ఈ మ్యాచ్‌లో భారత విజయంలో కీలకపాత్ర పోషించిన విరాట్ కోహ్లీ... చరిత్ర సృష్టించాడు. తన క్రికెట్ కెరీర్‌లో అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) నిర్వహించిన మూడూ పరిమిత ఓవర్ల ట్రోఫీలను గెలుచుకున్న ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఐసీసీ నిర్వహించే వైట్ బాల్ క్రికెట్ ట్రోఫీలను గెలుచుకున్న ప్రపంచంలోని ఏకైక ఆటగాడిగా కోహ్లీ చరిత్ర నెలకొల్పాడు. మొత్తం నాలుగు ఐసీసీ ట్రోఫీలను గెలుచుకున్న తొలి క్రికెటర్‌గా కోహ్లీ నిలిచాడు. నాలుగు ఐసీసీ వైట్ బాల్ ట్రోఫీలను గెలుచుకున్న ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా నిలిచాడు. అండర్-19 ప్రపంచకప్, T20 ప్రపంచకప్, ఛాంపియన్స్ ట్రోఫీ, వన్డే ప్రపంచకప్‌లు గెలుచుకున్న తొలి ఆటగాడికి విరాట్‌ నిలిచాడు. ఎంఎస్ ధోనీ కూడా ఈ ఘనత సాధించలేకపోయాడు. 
 
ఆ ప్రయాణం ఎలా సాగిందంటే
2008లో ఐసీసీ అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌.. దక్షిణాఫ్రికాతో తలపడింది. ఈ టోర్నీలో భారత్‌కు విరాట్‌ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఫైనల్ మ్యాచ్‌లో 34 బంతుల్లో 19 పరుగులు చేశాడు. ఈ టోర్నీని డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిలో భారత్‌ 12 పరుగుల తేడాతో గెలిచింది. 2011 ICC వన్డే ప్రపంచకప్ ఫైనల్ భారత్- శ్రీలంక మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 49 బంతుల్లో 35 పరుగులు చేశాడు. అప్పుడు టీమిండియా కెప్టెన్‌గా ధోనీ ఉన్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ 10 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో విజయం సాధించి వన్డే ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2013 ఫైనల్‌ మ్యాచ్‌ భారత్-ఇంగ్లాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 34 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అప్పుడు కూడా ధోనినే కెప్టెన్‌గా ఉన్నాడు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. ఐసీసీ T20 ప్రపంచ కప్ 2024 పైనల్‌ మ్యాచ్‌ భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరిగింది, ఈ మ్యాచ్‌లో కోహ్లీ 59 బంతుల్లో 76 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఈ మ్యాచ్‌లో భారత్ 7 పరుగుల తేడాతో విజయం సాధించింది.
మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vajedu SI Suicide Case: వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
వాజేడు ఎస్సై హరీష్ ఆత్మహత్యకు కారణమైన మహిళ అరెస్ట్
Gukesh:  సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
సాంబార్ అంటూ వివక్ష - గెలుపును అంగీకరించని చెస్ దగ్గజాలు - గుకేష్‌పై ఇంత వివక్షా ?
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
Next Target Balakrishna : రేవంత్ నెక్ట్స్ టార్గెట్ నందమూరి బాలకృష్ణ - ఇల్లు కూల్చేందుకు మార్కింగ్ !
PV Sindhu Engagement: ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
ఘనంగా పీవీ సింధు ఎంగేజ్‌మెంట్, సోషల్ మీడియాలో ఫొటో ట్రెండింగ్
Kawasaki Offer: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు - ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!
Daaku Maharaaj First Single: దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
దేఖో గుర్రంపై సింహం చేసే సవారీ... బాలయ్య ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చేలా 'డాకు మహారాజ్' ఫస్ట్ సాంగ్
Realme 14x 5G: రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
రియల్‌మీ 14ఎక్స్ 5జీ లాంచ్‌ డేట్ ఫిక్స్ - బడ్జెట్ 5జీ ఫోన్‌తో వస్తున్న బ్రాండ్!
What is KYC Scam: కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
కేవైసీ స్కామ్ అంటే ఏంటి? - రోజూ కోట్లలో నగదు నష్టం - ఏ జాగ్రత్తలు పాటించాలి?
Embed widget