Venkatesh Prasad on KL Rahul: కేఎల్ రాహుల్ పేరు వినిపిస్తే వెంకటేశ్ ప్రసాద్ 'ఫైర్' ! రీసెంట్‌గా అన్ని ట్వీట్లూ తిట్టేందుకే!
Venkatesh Prasad on KL Rahul: కేఎల్ రాహుల్ (Kl Rahul) పేరొస్తే చాలు! టీమ్‌ఇండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad) అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. అతడిని కఠినంగా విమర్శిస్తున్నాడు.
Venkatesh Prasad on KL Rahul:
కేఎల్ రాహుల్ (Kl Rahul) పేరొస్తే చాలు! టీమ్‌ఇండియా మాజీ పేసర్ వెంకటేశ్ ప్రసాద్ (Venkatesh Prasad) అగ్గిమీద గుగ్గిలం అవుతున్నాడు. అతడిని కఠినంగా విమర్శిస్తున్నాడు. వరుసగా విఫలమవుతున్నా అతడిని ఎందుకు ఎంపిక చేస్తున్నారని ప్రశ్నిస్తున్నాడు. విదేశాల్లో గణాంకాలు చూసుకున్నా అంత మెరుగ్గా ఏమీ లేవంటున్నాడు. అతడితో పోలిస్తే శిఖర్ ధావన్, అజింక్య రహానె, శుభ్‌మన్ గిల్, మయాంక్ అగర్వాల్ గణాంకాలు మరింత బాగున్నాయని పేర్కొన్నాడు.
There is a view that KL Rahul has an outstanding overseas Test record. But stats speak otherwise. He has a test avg of 30 overseas in 56 innings. He has scored 6 overseas centuries but followed it up with a string of low scores that’s why averaging 30. Let’s look at a few others pic.twitter.com/MAvHM01TcY
— Venkatesh Prasad (@venkateshprasad) February 20, 2023
కొన్ని రోజులుగా కేఎల్ రాహుల్ పేలవ ఫామ్‌లో ఉన్నాడు. ఆశించిన స్థాయిలో పరుగులేమీ చేయడం లేదు. ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల్లోనూ విఫలమయ్యాడు. అయినా టీమ్‌ఇండియా యాజమాన్యం అతడికి చోటిస్తోంది. అండగా నిలుస్తోంది. కానీ కొందరు రాహుల్‌ను అదే పనిగా విమర్శిస్తున్నారు. ఆడకపోయినప్పటికీ ఎందుకు అవకాశాలు ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అతడిని జట్టులోంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా వెంకటేశ్ ప్రసాద్ అతడిని తీవ్రంగా విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు.
కేఎల్ రాహుల్‌కు విదేశాల్లో అత్యుత్తమ రికార్డు ఉందన్న దృక్పథాన్ని వెంకటేశ్ ప్రసాద్ తిప్పికొట్టాడు. గణాంకాలను విశ్లేషించాడు. 'కేఎల్ రాహుల్‌కు విదేశీ గడ్డపై అత్యుత్తమ టెస్టు రికార్డు ఉందని చాలామంది భావన. కానీ గణాంకాలు వేరే విషయం చెబుతున్నాయి. అతడు విదేశాల్లో 56 ఇన్నింగ్సులు ఆడాడు. సగటు 30. మొత్తం 6 సెంచరీలు కొట్టాడు. ఆపై మిగిలినవన్నీ తక్కువ స్కోర్లే. అందుకే తక్కువ సగటు నమోదైంది. మిగతా వాళ్లవీ గమనించండి' అని వెంకీ ట్వీట్ చేశాడు.
Shikhar Dhawan has the best overseas average amongst recent openers. Avg of nearly 40 with 5 100’s. Though he too hasn’t been consistent in Test but had Outstanding centuries in SL and NZ, plus a much better home record. pic.twitter.com/rH94R0a3A0
— Venkatesh Prasad (@venkateshprasad) February 20, 2023
'ఈ మధ్య కాలంలోని ఓపెనర్లలో శిఖర్ ధావన్ (Shikhar Dhawan) కు విదేశాల్లో మెరుగైన సగటు ఉంది. అతడు 40 సగటుతో 5 సెంచరీలు కొట్టాడు. విదేశాల్లో నిలకడగా ఆడకపోయినప్పటికీ శ్రీలంక, న్యూజిలాండ్‌పై చక్కని సెంచరీలు బాదేశాడు. పైగా స్వదేశంలో మంచి రికార్డుంది. ఆస్ట్రేలియాపై అద్భుతంగా ఆడినప్పటికీ మిగతా దేశాల్లో మయాంక్ ఇబ్బంది పడ్డాడు. అయితే సొంతగడ్డపై అతడికి తిరుగులేదు. 13 ఇన్నింగ్సుల్లో 70 సగటుతో 2 డబుల్ సెంచరీలు, ఒక 150 స్కోరు చేశాడు. అందరూ తడబడ్డ వాంఖడేపై అతడు రాణించాడు. స్పిన్ బౌలర్లపై దాడి చేయగలడు. దేశవాళీ క్రికెట్లో మంచి అనుభవం ఉంది' అని వెంకటేశ్ ప్రసాద్ అన్నాడు.
Mayank Agarwal after the brilliant start in Aust did struggle in away test matches.But he has by far the best home record. Avg of nearly 70 in 13 innings,2 double 100’s & a 150 on a Wankhede pitch where everyone else struggled. Great against spin & had a prolific domestic season pic.twitter.com/EJOsZEbOCP
— Venkatesh Prasad (@venkateshprasad) February 20, 2023
'శుభ్‌మన్ గిల్ ఆడింది తక్కువే. విదేశాల్లో 14 ఇన్నింగ్సుల్లో 37 సగటు నమోదు చేశాడు. గబ్బాలో నాలుగో ఇన్నింగ్సులో అతడు చేసిన 91 స్కోరు అత్యుత్తమం. ఒకవేళ మీరు విదేశీ ప్రదర్శననే పరిగణనలోకి తీసుకుంటే ఫామ్‌లో లేనప్పటికీ రహానె బెస్ట్. అతడు 50 టెస్టుల్లో 40 సగటుతో రాణించాడు. ఫామ్ లేకపోవడంతో జట్టులో చోటు దొరకడం లేదు' అని వెంకటేశ్ ప్రసాద్ వరుస ట్వీట్లు చేశాడు.