అన్వేషించండి

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ నుంచి నిష్క్రమణ... స్వదేశానికి చేరిన టీమిండియా

T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ లో ఇంగ్లండ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన భారత జట్టు స్వదేశానికి చేరుకుంది. కోచ్ ద్రవిడ్, షమీ, దినేశ్ కార్తీక్ తదితరులు భారత్ కు వచ్చారు.

T20 World Cup 2022:   టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్ లో ఇంగ్లండ్ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించిన భారత జట్టు స్వదేశానికి చేరుకుంది. కోచ్ ద్రవిడ్, షమీ, దినేశ్ కార్తీక్, ఇంకా జట్టు సహాయ సిబ్బంది తదితరులు భారత్ కు వచ్చారు. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు వేరే విమానంలో స్వదేశానికి చేరుకున్నారు. ఈనెల 18 న ప్రారంభమయ్యే న్యూజిలాండ్ సిరీస్ కు ఎంపికైన వారు మెల్ బోర్న్ నుంచి సరాసరి ఆక్లాండ్ కు బయలుదేరారు. ముంబయి విమానాశ్రయంలో అభిమానులు కోహ్లీతో ఫొటోలు దిగారు. 

కోచ్ ద్రవిడ్ కు విరామం

టీమ్‌ఇండియా కోచింగ్ బాధ్యతలకు రాహుల్‌ ద్రవిడ్‌ కొన్నాళ్లు విరామం ఇవ్వనున్నాడు. న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లడం లేదని తెలిసింది. కొన్ని రోజులు కుటుంబంతో గడిపి విశ్రాంతి తీసుకోవాలని భావిస్తున్నాడు. దాంతో న్యూజిలాండ్ పర్యటనలో భారత్‌కు ఎన్‌సీఏ చీఫ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్ కోచ్‌గా ఉంటాడు. నవంబర్‌ 18 నుంచి 30 వరకు కివీస్ తో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనుంది. ఈ సిరీసుల్లో సీనియర్‌ ఆటగాళ్లకు విశ్రాంతి ఇస్తున్నారు. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌ కు విశ్రాంతి ఇచ్చారు. 

తాత్కాలిక కోచ్ గా లక్ష్మణ్

'వీవీఎస్‌ లక్ష్మణ్ నేతృత్వంలోనే సహాయ బృందం న్యూజిలాండ్‌ బయల్దేరనుంది. హృషికేశ్ కనిత్కర్‌ (బ్యాటింగ్‌), సాయిరాజ్‌ బహుతులే (బౌలింగ్‌) వీవీఎస్‌కు తోడుగా ఉంటారు' అని బీసీసీఐ వర్గాలు పీటీఐకి తెలిపాయి. టీమ్‌ఇండియాకు వీవీఎస్‌ కోచింగ్‌ ఇవ్వడం ఇదే తొలిసారి కాదు. గతంలో శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్‌ సిరీసుల్లో ఈ బాధ్యతలు నిర్వహించాడు. ద్రవిడ్‌ విశ్రాంతి తీసుకొనేందుకు సహకరించాడు.

టీ20లకు హార్దిక్.. వన్డేలకు ధావన్

న్యూజిలాండ్ తో టీ20 సిరీసుక్ కు హార్దిక్‌ పాండ్య సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. నవంబర్‌ 18న వెల్లింగ్టన్‌, 20న మౌంట్‌ మాంగనూయ్‌, 20న నేపియర్‌లో పొట్టి క్రికెట్‌ పోటీలు ఉంటాయి. వన్డే సిరీసుకు శిఖర్‌ ధావన్‌ కెప్టెన్సీ చేస్తాడు. నవంబర్‌ 25న ఆక్లాండ్‌, 27న హ్యామిల్టన్‌, 30న క్రైస్ట్‌ చర్చ్‌లో వన్డేలు జరుగుతాయి. డిసెంబర్‌ 4 నుంచి బంగ్లాదేశ్‌లో భారత్‌ పర్యటిస్తుంది. ఇందులో రోహిత్ శర్మ, విరాట్‌ కోహ్లీ, రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆడనున్నారు. 

టీమిండియాకు సచిన్ టెండుల్కర్ బాసటగా నిలిచారు. ఇప్పటికీ మన జట్టు టీ 20 క్రికెట్‌లో నెంబర్‌ వన్‌ అంటూ ప్రశంసించారు.

 

టాప్ హెడ్ లైన్స్

Hardik - Arshdeep Swap: PBKSకు హార్దిక్..! MIకు అర్ష్‌దీప్ .. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ట్రేడింగ్
PBKSకు హార్దిక్..! MIకు అర్ష్‌దీప్ .. ఐపీఎల్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని మెగా ట్రేడింగ్
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
Shami Top Spells: విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
విదేశీ పిచ్‌లపై నిప్పులు చెరిగిన  షమీ.. కెరీర్‌ను మలుపు తిప్పిన టాప్ 5 టెస్ట్ స్పెల్స్
Kohli Breaks Ponting Record: పాంటింగ్ రికార్డుకి చెక్ పెట్టిన కోహ్లీ, కివీస్‌పై ఆ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు
పాంటింగ్ రికార్డుకి చెక్ పెట్టిన కోహ్లీ, కివీస్‌పై ఆ ఘ‌న‌త సాధించిన ప్లేయ‌ర్ గా రికార్డు

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Fake Death Certificate: ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
ఫేక్ డెత్ సర్టిఫికెట్‌తో కారుణ్య నియామకం.. నల్గొండలో 14 మంది అరెస్ట్
AP Election Code: ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
ఏపీలో పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత.. ఎస్ఈసీ ఉత్తర్వులు జారీ
Arjun Rajput Century: అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
అర్జున్ రాజ్‌పుత్ సెంచరీ వృథా.. సెహ్వాగ్, ద్రవిడ్ వారసుల ఘోర వైఫల్యం.. పాకిస్తాన్ సంచలన విజయం
PM Modi Diwali Celebrations: దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: జవాన్లతో ప్రధాని మోదీ దీపావళి వేడుకలు
దేశం మీకు రుణపడి ఉంది, 47 ఏళ్లలో ఇదే తొలిసారి: బస్తర్‌లో జవాన్లతో PM Modi దీపావళి వేడుకలు
Governor Quota MLC: డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
డాక్టర్ పిడమర్తి రవికి ఎమ్మెల్సీ ఇవ్వాలని సీఎం రేవంత్‌కి మాదిగ జేఏసీ విజ్ఞప్తి
Mahasakthi Movie OTT : ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీల్లో దీపావళి కొత్త మూవీస్ - నయనతార 'మహాశక్తి', జయసుధ 'సమ్మర్ హాలిడేస్' ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Hyderabad Crime News: హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
హైదరాబాద్‌లో వైన్స్ షాప్ వద్ద ‘చిల్లర’ వివాదం.. సిబ్బంది దాడిలో ఒకరి మృతి
Israel Politics: ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
ఇజ్రాయెల్‌లో నెతన్యాహూకు షాక్.. ప్రభుత్వం ఏర్పాటు చేయాలని గాడీ ఐసెన్‌కోట్‌కు ఆహ్వానం
Embed widget