అన్వేషించండి
Advertisement
India vs England 3rd Test: క్యాప్ నేలకేసి కొట్టి, కోపంతో ఊగిపోయిన రోహిత్ శర్మ
India vs England: ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు. కోపాన్ని ఆపుకోలేక తలపై ఉన్న క్యాప్‌ను తీసి నేలకేసి కొట్టాడు.
Rohit Furious After Sarfaraz Khans Runout At Rajkot Test: ఇంగ్లండ్‌తో మొదలైన మూడో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆటలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) తీవ్ర అసహనానికి గురయ్యాడు. డగౌట్‌లో తీవ్ర కోపంతో ఊగిపోయాడు. కోపాన్ని ఆపుకోలేక తలపై ఉన్న క్యాప్‌ను తీసి నేలకేసి కొట్టాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. మెరుపు షాట్లతో అరంగేట్ర మ్యాచ్‌లోనే అర్ధ శతకం చేసిన సర్ఫరాజ్( Sarfaraz Khan) రనౌట్ కావడంతో రోహిత్ తీవ్ర అసహనానికి గురయ్యాడు. సర్ఫరాజ్ దూకుడు చూస్తే సునాయసంగా సెంచరీ చేసేలా కనిపించాడు. తొలి ఇన్నింగ్‌లో టీమిండియాకు భారీ స్కోర్ ఖాయమనిపించింది. కానీ జడేజా లేని పరుగు కోసం పిలుపునివ్వడంతో స్పందించిన సర్ఫరాజ్ రనౌట్ అయ్యాడు. దూకుడుగా ఆడుతున్న సర్ఫరాజ్ రనౌట్ అయిన వెంటనే డ్రెస్సింగ్ రూమ్‌లో సారథి రోహిత్ శర్మ.. ఆగ్రహంతో ఊగిపోయాడు. జడేజా చేసిన పనితో తల మీద ఉన్న క్యాప్‌ను కోపంతో నేలకేసి కొట్టాడు. జడేజా వల్లే సర్ఫరాజ్ ఖాన్ రనౌట్ అవడంతో సామాజిక మాధ్యమం ఎక్స్‌లో #Selfish హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. జడేజా సెంచరీ కోసం ఆలోచించే సర్ఫరాజ్‌ను బలిచేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తొలి మ్యాచ్‌లోనే అద్భుతంగా ఆడిన సర్ఫరాజ్ ఇలా ఔట్ కాకపోయి ఉండుంటే అతడు కూడా సెంచరీ చేసుకునేవాడని పోస్టులు చేస్తున్నారు.
క్షమించు సర్ఫరాజ్ భాయ్
రాజ్‌కోట్ టెస్ట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే మెరుపు వేగంతో అర్దసెంచరీ పూర్తి చేసుకున్న సర్ఫరాజ్ ఖాన్.. జడేజా చేసిన పొరపాటు కారణంగా రనౌటయ్యాడు. దీనిపై రవీంద్ర జడేజా స్పందించాడు. తన కారణంగా రనౌటైన అరంగ్రేటం ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్‌కు టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా క్షమాపణలు చెప్పాడు. అలాగే తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టినందుకు సర్ఫరాజ్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు. మ్యాచ్ అనంతరం జడ్డూ తన ఇన్‌స్టా స్టోరీలో క్షమాపణ, అభినందన సందేశాలను కలిపి ఒక పోస్ట్ చేశాడు. సర్ఫరాజ్ ఖాన్ విషయంలో చాలా బాధగా ఉందన్న రవీంద్ర జడేజా.. తప్పు తనదేనని అంగీకరించాడు. లేని పరుగు కోసం పిలుపునిచ్చానని అన్నాడు. బాగా ఆడావు సర్ఫరాజ్ అంటూ జడ్డూ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.
సర్ఫరాజ్ ఏమన్నాడంటే..
క్రికెట్‌లో ఇలాంటివన్నీ సహజమేనని సర్ఫరాజ్ అన్నాడు. రవీంద్ర జడేజా-తనకు మధ్య ఆ సమయంలో అవగాహన లోపించిందని అన్నాడు. ఎవరో ఒకరు రనౌట్ అవుతామని... దాని గురించి ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదని సర్ఫరాజ్ ఆ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నాడు. రవీంద్ర జడేజా తాను బ్యాటింగ్ చేసేటప్పుడు మద్దతుగా నిలిచాడని సర్ఫరాజ్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో క్రీజులో నిలబడేందుకు కాస్త సమయం తీసుకోవాలని రవీంద్ర జడేజా సూచించాడని ఆ సూచనలను అమలు చేసేందుకు ప్రయత్నించానని వెల్లడించాడు.
సాధికార బ్యాటింగ్
క్రీజులోకి వచ్చినప్పటి నుంచి సర్ఫరాజ్ ఖాన్ సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. కేవలం 48 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్సుతో సర్ఫరాజ్ అర్ధ శతకం సాధించాడు. ఈ క్రమంలో అరంగేట్రం చేసిన టెస్టులో వేగంగా అర్ధ శతకం సాధించిన మూడో బ్యాటర్‌గా సర్ఫరాజ్ రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత కూడా సర్ఫరాజ్ ధాటిగానే ఆడుతున్నాడు. 66 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సుతో 62 పరుగులు చేసి అవుటయ్యాడు. కచ్చితంగా సెంచరీ చేస్తాడని అనుకుంటున్న తరుణంలో సర్ఫరాజ్ సింగిల్ కోసం యత్నించి రనౌట్ అయి నిరాశగా వెనుదిరిగాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఛాట్‌జీపీటీ
ఆంధ్రప్రదేశ్
ఇండియా
ఎడ్యుకేషన్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion