అన్వేషించండి
Rohit Sharma: క్రికెట్ చరిత్రలో రోహిత్ ఒక్కడే, ఇంతవరకూ ఎవరి తరం కాలేదు మరి
Rohit Sharma: రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్‌లో సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. రోహిత్ తన కెరీర్‌లో చేసిన 12 టెస్ట్ సెంచరీలు చేయగా ఆ మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించింది.

క్రికెట్ చరిత్రలో రోహిత్ ఒకే ఒక్కడు ( Image Source : Twitter )
Nobody can beat Rohit Sharma: ఇంగ్లాండ్(England) తో జరిగిన చివరి టెస్ట్‌లో రోహిత్ శర్మ (Rohit Sharma)చేసిన శతకం పన్నెండోది. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 48వ సెంచరీ. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి ఎగబాకాడు. డబ్ల్యూటీసీ ప్రవేశపెట్టిన తర్వాత తాజా శతకంతో కలిపి హిట్‌మ్యాన్ ఖాతాలో మొత్తం 9 సెంచరీలు ఉన్నాయి. రూట్ 13 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా... మార్నస్ లబుషేన్ 11, కేన్ విలియమ్సన్ 10 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రోహిత్ శర్మ తొమ్మిది శతకాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్ తర్వాత పాక్ స్టార్ బాబర్ ఆజం ఎనిమిది సెంచరీలతో అయిదో స్థానంలో ఉన్నాడు. రోహిత్‌శర్మ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ శతకాలు బాదిన వారి జాబితాలో 43 సెంచరీలతో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. ఓపెనర్లుగా వార్నర్(49), సచిన్(45) తర్వాత స్థానంలో రోహిత్ నిలిచాడు. ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌లో ఏ ఆటగాడికి సాధ్యంకాని రికార్డును రోహిత్ తన పేరిట లిఖించుకున్నాడు.
రోహిత్ మార్గం అనితర సాధ్యం
రోహిత్ శర్మ తన టెస్ట్ కెరీర్‌లో సెంచరీ చేసిన ప్రతి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. రోహిత్ తన కెరీర్‌లో చేసిన 12 టెస్ట్ సెంచరీలు చేయగా.. అన్ని మ్యాచుల్లోనూ టీమిండియా విజయం సాధించింది. ఇలా ఓ ఆటగాడు చేసిన తన తొలి 12 టెస్ట్ సెంచరీలు జట్టు విజయానికి దోహదపడటం క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ఇన్నేళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో రోహిత్ తప్ప ఈ ఘనతను ఎవరూ సాధించలేకపోయారు. ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో రోహిత్ 9 ఇన్నింగ్స్‌ల్లో రెండు సెంచరీలు, అర్దసెంచరీ సాయంతో 44.44 సగటున 400 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో హిట్‌మ్యాన్ నాలుగో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.
ఇంగ్లాండ్ వేదికగా జరిగిన చివరి టెస్ట్‌లో రోహిత్ శర్మ చేసిన శతకం పన్నెండోది. ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఇది 48వ సెంచరీ. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్ శర్మ నాలుగో స్థానానికి ఎగబాకాడు. డబ్ల్యూటీసీ ప్రవేశపెట్టిన తర్వాత తాజా శతకంతో కలిపి హిట్‌మ్యాన్ ఖాతాలో మొత్తం 9 సెంచరీలు ఉన్నాయి. రూట్ 13 శతకాలతో అగ్రస్థానంలో ఉండగా... మార్నస్ లబుషేన్ 11, కేన్ విలియమ్సన్ 10 తర్వాతి స్థానాల్లో ఉన్నారు. రోహిత్ శర్మ తొమ్మిది శతకాలతో నాలుగో స్థానంలో ఉన్నాడు. రోహిత్ తర్వాత పాక్ స్టార్ బాబర్ ఆజం ఎనిమిది సెంచరీలతో అయిదో స్థానంలో ఉన్నాడు. రోహిత్‌శర్మ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ శతకాలు బాదిన వారి జాబితాలో 43 సెంచరీలతో రోహిత్ మూడో స్థానంలో నిలిచాడు. ఓపెనర్లుగా వార్నర్(49), సచిన్(45) తర్వాత స్థానంలో రోహిత్ నిలిచాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
నిజామాబాద్
ఆంధ్రప్రదేశ్
క్రైమ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion