Mohammed Shami: రోడ్డు ప్రమాద బాధితుడిని కాపాడి.. మంచి మనసు చాటుకున్న ముహమ్మద్ షమీ
రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని భారత క్రికెటర్ ముహమ్మద్ షమీ రక్షించాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను అతడే స్వయంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా నెట్టింట చక్కర్లు కొడుతోంది.
వన్డే ప్రపంచకప్ 2023లో ( ODI World Cup 2023) తన సంచలన ప్రదర్శనతో అందర్నిఆకట్టుకున్న టీమిండియా (Team India) స్టార్ పేసర్ మహమ్మద్ షమీ(Mohammed Shami) తన గొప్ప మనసును చాటుకున్నాడు. ఆపదలో ఉన్న ఓ వ్యక్తిని ఆదుకొని ప్రజల మనసులను గెలుచుకున్నాడు. రోడ్డు ప్రమాదానికి గురైన ఓ వ్యక్తిని మహమ్మద్ షమీ కాపాడాడు. ఆ ఘటనకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా అతనే స్వయంగా పంచుకున్నాడు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే ..
నైనిటాల్ రోడ్డు మార్గంలో ఓ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న పొదల్లోకి దూసుకుపోయింది. ఆ వెనుక కారులోనే మహమ్మద్ షమీ ఉన్నాడు. ప్రమాదాన్ని గమనించిన షమీ వెంటనే స్పందించాడు. ఇతర వాహనదారులతో కలిసి ఆ బాధితుడిని రక్షించి ఆసుపత్రికి తరలించడంలో సహాయ పడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియోను షమీ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. ఒకరిని రక్షించినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నానని రాశాడు. శనివారం రాత్రి ఉత్తరాఖండ్‌లోని నైనిటాల్ రోడ్డు మార్గంలో ఈ ఘటన జరిగింది.
భారత్ వేదికగా జరిగిన ప్రపంచకప్‌లో భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ(Mohammed Shami).. ప్రదర్శన క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తుండిపోతుంది. బంతితో నిప్పులు చెరిగాడు. షమీ బాల్ అందుకుంటే వికెట్ పక్కా అనేంతలా అద్భుత ప్రదర్శన చేశాడు. బంతితో నిప్పులు చెరుగుతున్నాడు. బాల్ అందుకుంటే వికెట్ పక్కా అనేంతలా అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. భార్య పెట్టిన గృహ హింస కేసు, వ్యక్తిగత జీవితంలో ఆటుపోట్లు.. కోర్టు సమన్లు... ఆత్మహత్య చేసుకొందామన్న ఆలోచనలు.. రోడ్డు ప్రమాదం.. ఇలా ఒకటా రెండా షమీని సమస్యలు చుట్టుముట్టాయి. అయినా షమీ వెనక్కి తగ్గాడా.... లేదు.. ఇంకా దృఢంగా తయారయ్యాడు. జట్టులో చోటు దొరకకపోయినా కుంగిపోయాడా.. లేదు.. తానేంటో నిరూపించుకోవాలన్న కసితో తీవ్రంగా సాధన చేశాడు. ప్రపంచ కప్ సందర్భంగా దానికి తగ్గ ఫలాలను అందించాడు.
హార్దిక్ గాయం కారణంగా జట్టులోకి వచ్చిన షమీ తొలి మ్యాచ్‌లోనే పటిష్ఠమైన న్యూజిలాండ్ (New Zealand) బ్యాటర్లను బెంబేలెత్తించాడు. ఐదు వికెట్ల ప్రదర్శన చేసి తానేంటో నిరూపించుకున్నాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్‌పై 4, శ్రీలంకపై 5, దక్షిణాఫ్రికాపై 2 వికెట్లు తీశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్‌లో షమీ’ విధ్వంసమే సృష్టించాడు. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా ఏడు వికెట్లు పడగొట్టి కివీస్ పతనాన్ని శాసించాడు. ఏడు వికెట్లతో కివీస్ పతనాన్ని శాసించడంతో.. అతనికే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ ఇచ్చారు. భారత బౌలింగ్ దళం రారాజుగా నిలిచి తనలో ఎంత కసి ఉందో చాటి చెప్పాడు. ఈ ప్రపంచకప్‌లో మొత్తం 23 వికెట్లతో ఈసారి టోర్నీలో.. టాప్ బౌలర్ స్థానానికి దూసుకొచ్చాడు.
అయితే వ్యక్తిగత జీవితంలో మహ్మద్ షమీ చాలా ప్రతికూలతలు ఎదుర్కొన్నారు. షమీ గురించి తరచుగా స్పందిచే మాజీ భార్య జహాన్, తాజాగా తీవ్ర విమర్శలు చేశారు. మహమ్మద్ షమీ మంచి వ్యక్తే అయితే.. తాము మంచి జీవితాన్ని గడిపేవాళ్లమని ఆమె అన్నారు. అతను మంచి వ్యక్తి అయితే తన కూతురు, తన భర్త, తాను సంతోషకరమైన జీవితాన్ని గడిపేవాళ్లమని పేర్కొన్నారు. షమీ మంచి ఆటగాడు మాత్రమే కాకుండా మంచి భర్త, మంచి తండ్రిగా కూడా ఉంటే అది మరింత గౌరవంగా ఉండేదని హసిన్ జహాన్ తెలిపారు. షమీ చేసిన తప్పులు, దురాశ, వ్యక్తిత్వం కారణంగా తాము ముగ్గురం పరిణామాలను ఎదుర్కోవలసి వచ్చిందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా.. షమీ దగ్గర చాలా డబ్బు ఉందని, దాని ద్వారా తన ప్రతికూల అంశాలను బయటకు రాకుండా దాచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడని వ్యాఖ్యలు చేశారు.