By: ABP Desam | Updated at : 08 May 2023 01:49 PM (IST)
జో రూట్ ( Image Source : Twitter )
Joe Root: ఏ ఫార్మాట్‌లో అయినా అరంగేట్ర మ్యాచ్ అంటే ఓ ప్రత్యేకమైన అనుభూతి. ‘ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ బెస్ట్ ఇంప్రెషన్’ అన్నట్టు మొదటి మ్యాచ్‌లో అదరగొడితే ఆ తర్వాత కెరీర్‌ను సాఫీగా సాగించేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయి. కానీ ఈ ఇంగ్లాండ్ మాజీ సారథికి మాత్రం అరంగేట్ర మ్యాచ్‌లు కలిసిరావడం లేదు. అతడెవరో కాదు ఇంగ్లాండ్ మాజీ సారథి జో రూట్. ఆధునిక క్రికెట్‌లో ‘ది బెస్ట్’ అనదగ్గ ప్లేయర్లలో ఒకడైన రూట్.. ఒక్క టెస్టులలో తప్ప మిగిలిన ఫార్మాట్‌లు, లీగ్ లలో ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ కు రాలేదు. ఆ వివరాలు ఇక్కడ చూద్దాం.
జో రూట్ అంతర్జాతీయ అరంగేట్రం అన్నీ భారత్‌లోనే జరిగాయి. 2012-2013లో ఇంగ్లాండ్ జట్టు భారత్ లో పర్యటించింది. ఈ మూడు ఫార్మాట్ల సిరీస్ లో భాగంగా టెస్టులలో భాగంగా భారత్ - ఇంగ్లాండ్ మధ్య నాగ్‌పూర్ లో జరిగిన నాలుగో టెస్టులో ఎంట్రీ ఇచ్చాడు. వాంఖెడే వేదికగా జరిగిన రెండో టీ20లో ఆడాడు. 2013 జనవరిలో రాజ్‌కోట్ వేదికగా జరిగిన ఫస్ట్ వన్డేతో తన కెరీర్‌ను ప్రారంభించాడు. కాగా టెస్టులో తప్ప వన్డేలు, టీ20 అరంగేట్ర మ్యాచ్ లలో రూట్ కు బ్యాటింగ్ చేసే అవకాశమే రాలేదు. నాగ్‌పూర్ టెస్టులో మాత్రం రూట్.. ఫస్ట్ ఇన్నింగ్స్ లో 229 బంతులలో 73, రెండో ఇన్నింగ్స్ లో 56 బంతుల్లో 20 రన్స్ చేశాడు.
Test Debut: Nagpur
ODI Debut: Rajkot
T20I Debut: Mumbai#TATAIPL Debut: Jaipur
Joe Root's practically Indian by this point 😅#RRvSRH #IPLonJioCinema pic.twitter.com/jcCnBjNFvk— JioCinema (@JioCinema) May 7, 2023
ఆ రెండే కాదు..
వన్డేలు, టీ20లలోనే కాదు.. ఇంగ్లాండ్ లో జరిగే ‘ది హండ్రెడ్ లీగ్’లో కూడా ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ కు దిగలేదు. తాజాగా ఐపీఎల్ -16లో సన్ రైజర్స్ హైదరాబాద్ తో రాజస్తాన్ రాయల్స్ ఆడిన మ్యాచ్ లో రాజస్తాన్ తరఫున ఎంట్రీ ఇచ్చిన రూట్‌కు బట్లర్, శాంసన్ ల బాదుడుతో బ్యాటింగ్ కు దిగే అవకాశమే రాలేదు. రెండు క్రికెట్ లీగ్ లు, రెండు ఫార్మాట్లలో అరంగేట్ర మ్యాచ్ లో బ్యాటింగ్ కు రాని ఓ విచిత్రమైన ఘనతను రూట్ సొంతం చేసుకున్నాడు.
Joe Root didn't bat on four different debuts!
— CricTracker (@Cricketracker) May 7, 2023
(via @kaustats) pic.twitter.com/E5k1s8CImW
కాగా రూట్ ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చినా అతడికి బ్యాటింగ్ చేసే అవకాశం రాకపోవడంతో ట్విటర్ లో అతడిపై ట్రోల్స్ వెల్లువెత్తుతున్నాయి. రూట్ 15 బంతుల్లో హాఫ్ సెంచరీని చూసేందుకు అంతర్జాతీయ క్రికెట్ సిద్ధంగా లేదని ట్రోల్స్ వచ్చాయి. అదేవిధంగా బట్లర్, శాంసన్ బ్యాటింగ్ చేస్తుండగా ఇక నాకు బ్యాటింగ్ కు రాదేమో అన్నట్టుగా రూట్ ఫేస్ పెట్టిన ఫోటో ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది.
World in't ready For Joe Root 15 ball 50 masterclass pic.twitter.com/KJvRXu22Ll
— CIDO (@saymyname_45) May 7, 2023
Mahendra Singh Dhoni Retirement: రిటైర్మెంట్ ప్రకటించడానికి బెస్ట్ టైం ఇదే... కానీ - మహేంద్ర సింగ్ ధోని ఏమన్నాడంటే?
CSK Vs GT: ధోనికి కప్పు గిఫ్టిచ్చిన జడేజా - లాస్ట్ బాల్ థ్రిల్లర్‌లో జీటీపై చెన్నై విక్టరీ!
CSK Vs GT: చితక్కొట్టిన సాహా, సాయి సుదర్శన్ - చెన్నై ముందు భారీ టార్గెట్!
IPL Final 2023: రికార్డు సృష్టించిన గుజరాత్ టైటాన్స్ - ఐపీఎల్ చరిత్రలోనే!
Tushar Deshpande: తుషార్ దేశ్‌పాండే చెత్త రికార్డు - ఒక ఐపీఎల్ సీజన్లో అంత దారుణంగా!
Telangana CM KCR: తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలపై అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు
'యూత్ ను ఎంకరేజ్ చేయాలే, ధమ్ ధమ్ చేయొద్దు' - జక్కన్న ట్వీట్ వైరల్!
Bonda Uma: టీడీపీ సంక్షేమ మేనిఫెస్టోతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి- బొండా ఉమా
లవ్ బూత్‌లో మెహ్రీన్ - హలో హనీ హార్ట్ మిస్సాయే అంటున్న ఫ్యాన్స్!