News
News
వీడియోలు ఆటలు
X

ఆరంభానికి ముందే అపశకునాలు, ఆర్సీబీకి ఉన్న కాస్త ‘జోష్’ కూడా పోతే ఎలా?

IPL 2023: ఐపీఎల్‌లో అదృష్టానికి ఆమడ దూరంలో ఉండే ఆర్సీబీ గాయాలకు మాత్రం చాలా దగ్గరలో ఉంటుంది.

FOLLOW US: 
Share:

Josh Hazlewood: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నెగ్గడానికి అన్ని అర్హతలు ఉన్నా ఇంతవరకు టైటిల్ నెగ్గని టీమ్ ఏదైనా ఉందా..? అంటే అది కచ్చితంగా  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరే. ఒక్కటా..? రెండా..? పదిహేనేండ్లుగా ఒకే కల (ఈసాలా కప్ నమ్దే)ను మళ్లీ మళ్లీ కంటున్న ఆ జట్టు అభిమానులకు ఈ ఏడాది   గుండెకోత తప్పేట్లు లేదు. అసలే కీలక టోర్నీలో అదృష్టం బాగోలేక  తంటాటు పడుతున్న ఆ జట్టుకు  ఈ సీజన్ లో వరుస షాకులు తాకుతున్నాయి.   ఆర్సీబీ కీలక పేసర్  జోష్ హెజిల్వుడ్  ఈ సీజన్ లో సగం మ్యాచ్ లకు అందుబాటులో ఉండటం లేదు. 

చావు కబురు చల్లగా చెప్పినట్టు.. 

ఆర్సీబీకి  ఉన్న ప్రధాన పేసర్ హెజిల్వుడ్. ఈ ప్రపంచ నెంబర్ వన్ బౌలర్.. ఈ ఏడాది  స్వదేశం (ఆస్ట్రేలియా) లో దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో గాయపడ్డాడు. మూడో టెస్టులో ఆడలేదు. గాయం పూర్తిగా కోలుకోకున్నా  బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఆడతానని  టీమ్ తో కలిసి ఎగేసుకుని భారత్ కు వచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చాక  అతడు ఇంకా ఫిట్ గా లేడని, మరికొన్నాళ్లు విశ్రాంతి కావాలని  క్రికెట్ ఆస్ట్రేలియా మళ్లీ అతడిని  ఢిల్లీ టెస్టు ముగిశాక  సిడ్నీ ఫ్లైట్ ఎక్కించింది.  సరే టెస్టు సిరీస్ కు మిస్ అయినా వన్డే సిరీస్ వరకైనా వస్తాడనుకుంటే దానికీ రాలేదు.  వన్డే సిరీస్ పోయినా ఐపీఎల్ వరకైనా కుదురుకుంటాడనుకుంటే ఇప్పుడు  చావు కబురు చల్లగా చెప్పినట్టు  ‘ఫస్టాఫ్ కు మిస్ అవుతున్నా..’అని  సెలవిచ్చాడు. 

ఫస్టాఫ్  బ్రేక్..  సెకండాఫ్‌కే ఆశలు..  

గాయం నుంచి తాను ఇంకా పూర్తిస్థాయిలో కోలుకోలేదని..  ఏప్రిల్ 14 వరకూ  పూర్తి ఫిట్నెస్  సాధిస్తానని  హెజిల్వుడ్ చెప్పుకొచ్చాడు. అప్పటికీ కూడా  అందుబాటులో ఉంటాడా..? అంటే అదీ అనుమానమే.  అవసరమైతే మరో వారం రోజులు  రెస్ట్ తీసుకుని పూర్తి సన్నద్ధత సాధించాక బరిలోకి దిగుతానని  చెప్పాడు. వన్డేలు, టెస్టులతో పోల్చుకుంటే టీ20లలో ఆడేది తక్కువ టైమే అయినా   వేసే 4 ఓవర్లూ పూర్తి పేస్ తో వేయాల్సి  ఉంటుందని.. దానికోసం  చాలా  శారీరకంగా చాలా శ్రమించాల్సి ఉంటుందని  తెలిపాడు. ఈ లెక్కన చూసుకుంటే ఏప్రిల్  నాలుగో వారం దాక జోష్  ఆడేది అనుమానమే.  

ఈ సీజన్ లో  ఆర్సీబీ తమ తొలి మ్యాచ్ ను ఏప్రిల్  2న  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో   ముంబై ఇండియన్స్ తో  ఆడనుంది.  ఏప్రిల్  20 తర్వాతే   హెజిల్వుడ్ అందుబాటులోకి వస్తే గనక ఆర్సీబీ అప్పటికే   ఆరు మ్యాచ్ లు ఆడుతుంది.  

2021 వరకూ చెన్నైకి ఆడిన హెజిల్వుడ్ ను 2022 వేలంలో ఆర్సీబీ  రూ. 7.75 కోట్లకు  కొనుగోలు చేసింది.  గత సీజన్ లో అతడు.. 12 మ్యాచ్ లలో  20 వికెట్లతో చెలరేగాడు. ఈ సీజన్ లో అతడు లేకపోవడం ఆర్సీబీకి భారీ ఎదురుదెబ్బే.. మరి  హెజిల్వుడ్ లేని  ‘జోష్’ను సిరాజ్  ఎలా   నింపుతాడో తెలియాలంటే  మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 

Published at : 02 Apr 2023 07:17 PM (IST) Tags: RCB Glenn Maxwell IPL 2023 Border Gavaskar Trophy Josh Hazlewood Indian Premier League 2023 Royal Challengers Bangalore

సంబంధిత కథనాలు

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

Viral Video: ఆ ట్రోఫీని వదిలేసి ముందు నన్ను హగ్ చేసుకో - వైరల్ అవుతున్న సాక్షి-ధోని వీడియో

WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! - పోనీ డ్రా అయితే గద ఎవరికి?

WTC 2023 Final: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో వర్షం పడితే! -  పోనీ డ్రా అయితే గద ఎవరికి?

SL vs AFG 1st ODI: జద్రాన్ జోరు - లంకకు షాకిచ్చిన అఫ్గాన్ - తొలి వన్డేలో ఘన విజయం

SL vs AFG 1st ODI: జద్రాన్ జోరు - లంకకు షాకిచ్చిన అఫ్గాన్ - తొలి వన్డేలో ఘన విజయం

WTC Final Commentators: దాదా ఈజ్ బ్యాక్ - డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు కామెంటేటర్‌గా గంగూలీ - పూర్తి జాబితా ఇదే

WTC Final Commentators: దాదా ఈజ్ బ్యాక్ - డబ్ల్యూటీసీ ఫైనల్స్‌కు కామెంటేటర్‌గా గంగూలీ - పూర్తి జాబితా ఇదే

WTC Final 2023: భరత్‌ vs కిషన్‌ - టీమ్‌ఇండియాకు పెద్ద చిక్కే వచ్చిందే!

WTC Final 2023: భరత్‌ vs కిషన్‌ - టీమ్‌ఇండియాకు పెద్ద చిక్కే వచ్చిందే!

టాప్ స్టోరీస్

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

YS Viveka Murder Case: వైఎస్‌ భాస్కర్‌రెడ్డి అభ్యర్థనకు సీబీఐ కోర్టు ఓకే, ప్రత్యేక కేటగిరీ ఖైదీగా ఎంపీ అవినాష్ తండ్రి

Chandrababu : టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Chandrababu :  టీడీపీ ఉండి ఉంటే పోలవరం, అమరావతి పూర్తయ్యేవి - ఏపీ పునర్నిర్మాణం చేయాల్సి ఉందన్న చంద్రబాబు !

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Sharwanand Marriage: శర్వానంద్ పెళ్లి వేడుకలు షురూ - వైరలవుతోన్న వీడియో

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు

Bandi Sanjay: రేవంత్ రెడ్డిలా డబ్బులు పంచడం, పార్టీలు మారడం నాకు చేతకాదు: బండి సంజయ్ సెటైర్లు