అన్వేషించండి

IND vs AFG 3rd ODI Records: రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ కాంబో హ్యాట్రిక్ వికెట్లు, అఫ్గాన్‌తో 3వ వన్డేలో అరుదైన రికార్డ్

Prasidh Krishna and Rohit Sharma: అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న మూడో వన్డేలో రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ జోడి అరుదైన ఘనత సాధించింది. హ్యాట్రిక్ వికెట్ల భాగస్వామ్యంతో రికార్డు నెలకొల్పింది.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • భారత్-అఫ్గాన్ వన్డేలో ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అరుదైన రికార్డు.
  • రోహిత్ శర్మ క్యాచ్‌లతో ముగ్గురు అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ వెనుదిరిగారు.
  • ఒకే బౌలర్, ఫీల్డర్ కాంబోలో మూడు ఔట్‌లు నమోదు.
  • ఈ ఘనత సాధించిన మూడో భారత ఫీల్డర్‌గా రోహిత్ నిలిచాడు.

Hat-trick of c Rohit b Prasidh | చెన్నై: భారత్, అఫ్గానిస్తాన్ మధ్య జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ చెన్నైలో అరుదైన ఘటన జరిగింది. చేపాక్ స్టేడియంలో అఫ్గాన్ జట్టు టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకుంది. అసలే విపరీతమైన ఎండ, మరోవైపు భారత పేసర్ నిప్పులు చెరగడంతో అఫ్గానిస్తాన్ టాపార్డర్ బ్యాటర్లు క్రీజులో కుదురుకోలేకపోయారు. వచ్చిన వాళ్లు వచ్చినట్లుగా తమ వికెట్లను కోల్పోయారు. ఈ క్రమంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ,  ప్రసిద్ధ్ కృష్ణల మధ్య సమన్వయంతో అరుదైన రికార్డ్ నమోదైంది. 

 హ్యాట్రిక్ సాధించిన రోహిత్, ప్రసిద్ధ్
వాస్తవానికి అఫ్గానిస్తాన్ జట్టు టాప్ ఆర్డర్ ముగ్గురు బ్యాటర్ల వికెట్లను భారత పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ పడగొట్టాడు. ఇందులో విశేషం ఏంటంటే.. ఈ ముగ్గురు బ్యాటర్ల క్యాచ్‌లు రోహిత్ శర్మ పట్టాడు.  క్రికెట్‌లో ఇలాంటి అద్భుతాలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఒకే బౌలర్ బౌలింగ్‌లో (వికెట్ కీపర్ కాకుండా) ఒకే ఫీల్డర్ వరుసగా 3 క్యాచ్‌లు అందుకోవడం విశేషం. అది కూడా భారత్ తరఫున వన్డేలు ఆడుతున్న అతిపెద్ద వయస్కుడిగా ఉన్న రోహిత్ శర్మ ఏమాత్రం తప్పిదం చేయకుండా ఫీల్డింగ్‌లో చురుకుగా వ్యవహరించి ఆ క్యాచ్‌లు అందుకోవడం విశేషం.

ఇన్నింగ్స్ రెండో ఓవర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ చేశాడు. మొదటి బంతికే ఓపెనర్ రహమానుల్లా గుర్బాజ్‌ను 5 పరుగుల స్కోరు వద్ద రోహిత్ శర్మ చేతికి స్లిప్‌లో క్యాచ్ ఇచ్చేలా చేశాడు. ఆ తర్వాత 6వ ఓవర్ చివరి బంతికి ప్రసిద్ధ్ బౌలింగ్ లో రహ్మత్ షా ఔటయ్యాడు. ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ శర్మ వేగంగా స్పందించి క్యాచ్ అందుకోవడంతో రహ్మత్ షా నిరాశగా వెనుదిరిగాడు. 

ఇన్నింగ్స్ 8వ ఓవర్లో ప్రసిద్ధ్ కృష్ణ, రోహిత్ శర్మ కాంబో మరోసారి మ్యాజిక్ చేసింది. ఈసారి కూడా బౌలర్ ప్రసిద్ధ్, కానీ బ్యాటర్ మారాడు. 11 పరుగులు చేసిన ఇబ్రహీం జద్రాన్‌ ఆడిన బంతిని ఫస్ట్ స్లిప్‌లో ఉన్న రోహిత్ క్యాచ్ పట్టడంతో టీమిండియా ఆనందానికి అవదులు లేకుండా పోయాయి. ఈ క్రమంలో ప్రసిద్ద్ కృష్ణ, రోహిత్ శర్మ అరుదైన రికార్డు నమోదు చేశారు.

Read Also: Yuvraj Singh Coaching: ఐపీఎల్ 2027 లో బిగ్గెస్ట్ ట్విస్ట్: ఢిల్లీ క్యాపిటల్స్ డగౌట్ లోకి సిక్సర్ల కింగ్.. దాదా స్పెషల్ ప్లాన్ తో యువరాజ్ ఎంట్రీ

చారిత్రాత్మక రికార్డు

ఈ 3 వికెట్లతో రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ రికార్డు పుస్తకాల్లో తమ పేరును లిఖించుకున్నారు. ప్రత్యర్థి జట్టులోని మొదటి ముగ్గురు బ్యాటర్ల ఔట్‌లలో భాగస్వామ్యం పంచుకున్న నాల్గవ భారత ఆటగాడిగా (రోహిత్) నిలిచాడు. అంతకుముందు టీమిండియా నుంచి సౌరవ్ గంగూలీ (2002), మనోజ్ తివారీ (2011), సురేష్ రైనా (2013) ఈ ఘనత సాధించారు.

అయితే వన్డే క్రికెట్ చరిత్రలో ఒకే బౌలర్ బౌలింగ్‌లో 3 క్యాచ్‌లు పట్టిన మూడో భారత ఫీల్డర్‌గా రోహిత్ నిలిచాడు. అంతకుముందు 2004లో ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో వివిఎస్ లక్ష్మణ్ ఇదే తరహాలో 3 క్యాచ్‌లు అందుకున్నాడు. ఆ తరువాత 2018లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో శిఖర్ ధావన్ ఇదే తీరుగా మూడు క్యాచ్‌లు పట్టి అరుదైన జాబితాలో చేరాడు. 

Frequently Asked Questions

భారత్, అఫ్గానిస్తాన్ మూడో వన్డేలో రోహిత్ శర్మ, ప్రసిద్ధ్ కృష్ణ ఏ అరుదైన రికార్డును సాధించారు?

ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో అఫ్గానిస్తాన్ టాప్ ఆర్డర్‌లోని ముగ్గురు బ్యాట్స్‌మెన్ వికెట్లను తీయగా, ఆ మూడు క్యాచ్‌లను రోహిత్ శర్మ అందుకున్నాడు. ఒకే బౌలర్ బౌలింగ్‌లో ఒకే ఫీల్డర్ (వికెట్ కీపర్ కాకుండా) వరుసగా 3 క్యాచ్‌లను అందుకోవడం అరుదైన రికార్డు.

ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టి ఔట్ చేసిన అఫ్గాన్ బ్యాట్స్‌మెన్ ఎవరు?

రహమానుల్లా గుర్బాజ్, రహ్మత్ షా, ఇబ్రహీం జద్రాన్ అనే ముగ్గురు అఫ్గాన్ బ్యాట్స్‌మెన్‌లను ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్‌లో రోహిత్ శర్మ క్యాచ్ పట్టి ఔట్ చేశాడు. వారంతా అఫ్గానిస్తాన్ టాప్ ఆర్డర్ బ్యాటర్లు.

వన్డే క్రికెట్‌లో ఒకే బౌలర్ బౌలింగ్‌లో 3 క్యాచ్‌లు పట్టిన ఇతర భారత ఫీల్డర్లు ఎవరు?

రోహిత్ శర్మకు ముందు 2004లో ఇర్ఫాన్ పఠాన్ బౌలింగ్‌లో వివిఎస్ లక్ష్మణ్, 2018లో జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో శిఖర్ ధావన్ ఈ ఘనత సాధించారు. రోహిత్ శర్మ ఈ జాబితాలో చేరిన మూడవ భారత ఫీల్డర్.

About the author Shankar Dukanam

జర్నలిజంలో గత పదేళ్లుగా పనిచేస్తున్నారు. గత దశాబ్దకాలంలో పలు ప్రముఖ తెలుగు మీడియా సంస్థలలో పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది. ఏపీ, తెలంగాణ, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక జర్నలిజం కోర్సు పూర్తిచేసి కెరీర్‌గా ఎంచుకున్నారు. నేషనల్ మీడియాకు చెందిన పలు తెలుగు మీడియా సంస్థలలో సీనియర్ కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో గత నాలుగేళ్ల నుంచి న్యూస్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు.  

Read More
Advertisement

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
Advertisement

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Telangana Politics Black Magic Allegations:తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
తెలంగాణ రాజకీయాల్లో క్షుద్రపూజల ఆరోపణలు - రేవంత్ వర్సెస్ బీఆర్ఎస్.. మూఢనమ్మకాలతో మైండ్ గేమ్‌లు?
APPSC Group 1 Scam SIT Report: ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
ఏపీ గ్రూప్-1 అవకతవకల కేసు - సిట్ నివేదికతో కలకలం.. అధికారుల ఉద్యోగాలు రద్దు? జైలు శిక్ష తప్పదా?
IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
CJP Instagram: స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
స్వాతంత్య్ర దినోత్సవం రోజున సీజేఐకి షాక్! ఇన్‌స్టాగ్రామ్ ఖాతా డిలీట్‌! అభిజిత్ దీప్కే ఆగ్రహం !
Independence Day 2026 PM Modi Speech Highlights: సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
సప్తధార పేరుతో మోదీ సరికొత్త నినాదం- జెన్‌జీకి అధిక ప్రాధాన్యం- 80వ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం హైలైట్స్‌!
Embed widget