World Record Alert: ఇంగ్లాండ్ ప్రపంచ రికార్డు, టెస్టు క్రికెట్లో తిరుగేలేని ఇంగ్లీష్ జట్టు
England cricket news: 147 టెస్టు క్రికెట్లో ఇంగ్లాండ్ జట్టు ఒక బెంచ్ మార్కును సెట్ చేసింది. బజ్ బల్ ఆటతీరుతో తాజాగా ప్రపంచ రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
Eng vs Nz Test Series: ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు వరల్డ్ రికార్డు నమోదు చేసింది. టెస్టు క్రికెట్లో ఐదు లక్షల పరుగుల మార్కును సాధించిన తొలి జట్టుగా రికార్డులకెక్కింది. న్యూజిలాండ్ తో వెల్లింగ్టన్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో ఈ ఘనత సాధించింది. క్రికెట్ కు పుట్టినిల్లుగా భావించే ఇంగ్లాండ్ ఈ ఘనతను చేరుకోవడంపై ఇంగ్లీష్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్ గా 1082 వ మ్యాచ్ ఆడుతున్న ఇంగ్లాండ్ ఈ మార్కును చేరుకుంది. ఇంగ్లాండ్ తర్వాత స్థానంలో ఆస్ట్రేలియా 4, 28,868 పరుగులతో రెండో స్థానంలో ఉంది. ఇక టీమిండియా 2, 78, 751 పరుగులతో మూడో స్థానంలో నిలిచింది.
500,000 reasons to love England ❤️ pic.twitter.com/yvm1wRogeE
— England Cricket (@englandcricket) December 7, 2024
1877 లో ప్రయాణం ప్రారంభం..
1877 నుంచి ఇంగ్లాండ్ జట్టు క్రికెట్ ఆడుతోంది. తొలి మ్యాచ్ ను ఆస్ట్రేలియాతో ఆడింది. ఇప్పటివరకు జరిగిన 1081 టెస్టుల్లో 399 మ్యాచ్ ల్లో గెలుపు నమోదు చేయగా, 327 మ్యాచ్ ల్లో అపజయం పాలైంది. మరో 355 మ్యాచ్ లు డ్రాగా ముగిశాయి.
400వ విజయం ముంగిట..
కివీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో బెన్ స్టోక్స్ సేన ఆల్మోస్ట్ పట్టు బిగించింది. శనివారం రెండోరోజు ఆట ముగిసేరికి ఐదు వికెట్లకు 378 పరుగులు చేసింది. దీంతో ఓవరాల్ గా 533 పరుగుల ఆధిక్యంలో ఉంది. దీంతో తన 400వ టెస్టు విజయం కోసం రంగం సిద్ధం చేసుకుందని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 280 పరుగులు చేయగా, కివీస్ 125 రన్స్ కే కుప్పకూలింది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే మూడు మ్యాచ్ ల సిరీస్ ఇంగ్లాండ్ సొంతమవుతుంది. ఇప్పటివరకు అత్యధిక లక్ష్య ఛేదన కేవలం 418 కాబట్టి, ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ విజయం దాదాపుగా ఖరారైనట్లే.
డబ్ల్యూటీసీ అందని ద్రాక్షే..
బజ్ బాల్ తో టెస్టు క్రికెటలో తనదైన ముద్ర వేస్తున్న ఇంగ్లాండ్.. ఇప్పటికీ రెండుసార్లు జరిగిన ప్రపంచ టెస్టు చాంపియనషిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ కు అర్హత సాధించలేకపోయింది. ముచ్చటగా మూడోసారి అయినా తుదిపోరుకు అర్హత సాధించాలని భావించినా మళ్లీ చుక్కెదురైంది. ముఖ్యంగా భారత్ చేతిలో ఐదు టెస్టుల సిరీస్ ఎదురైన ఓటమి బ్యారీ అర్మీ ఆశలపై తీవ్ర ప్రభావం చూపింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరోవైపు ఇప్పటికి రెండుసార్లు డబ్ల్యూటీసీ ఇంగ్లాండ్ గడ్డపై జరుగగా,, ముచ్చటగా మూడోసారి కూడా ఇంగ్లాండ్ గడ్డపైనే నిర్వహించాలని ఐసీసీ నిర్ణయించడం విశేషం.
కివీస్ ఆశలు గల్లంతు..
ఇక ప్రపంచ చాంపియన్ షిప్ లో రెండోసారి ఫైనల్ కు సాధించాలన్న న్యూజిలాండ్ ఆశలు దాదాపుగా ఆవిరయ్యాయి. భారత్ పై అనూహ్యంగా 3-0తో మూడు టెస్టుల సిరీస్ ను వైట్ వాష్ చేసిన కివీస్.. డబ్ల్యూటీసీ రేసులోకి వచ్చింది. అయితే సొంతగడ్డపై ఇంగ్లాండ్ చేతిలో తొలిటెస్టులో ఓటమిపాలు కావడంతో కివీస్ ఆశలు గల్లంతయ్యాయి. దీనికి తోడు స్లో ఓవర్ రేటుతో పాయింట్లను కోల్పోవడం కూడా దెబ్బ తీసింది. ఇప్పటికే రెండో టెస్టులో ఓటమి దిశగా సాగుతున్న కివీస్.. అప్రధాన్యమైన మూడో టెస్టులో గెలిచిన ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇక 2021లో తొలిసారి ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్ కు చేరిన కివీస్.. డార్క్ హార్స్ గా బరిలోకి దిగి టైటిల్ ఫేవరెట్ భారత్ ను ఓడించింది.
Also Read: Ind Vs Aus 2nd Test: సిరాజ్ మియా.. వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ @ 181.6 కేపీహెచ్.. ఏది నిజం..?