Ind Vs Aus 2nd Test: సిరాజ్ మియా.. వరల్డ్ ఫాస్టెస్ట్ బౌలర్ @ 181.6 కేపీహెచ్.. ఏది నిజం..?
Mohammed Siraj: భారత బౌలర్ సిరాజ్.. ఒక్కసారిగా క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశాడు. కొంతసేపటి వరకు ప్రపంచ క్రికెట్లోనే స్పీడ్ స్టర్ గా వైరలయ్యాడు.
Adelaide Pink Ball Test: హైదరాబాదీ పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ పేరు క్రికెట్ ప్రపంచంలో ఒక్కసారిగా మార్మోగిపోయింది. కాసేపటివరకు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన బౌలర్ తనేనా అనే ప్రశ్న మదిని తొలిచింది. అసలు తాము చూస్తుంది నిజమా..? కాదా అనే డోలాయామానంలో పడి పోయే ప్రదర్శన మన సిరాజ్ మియా నుంచి వచ్చింది. నిజానికి ఇది ఒక టెక్నాలజీ గ్లిఛ్ ద్వారా జరిగిందని తెలుసుకుని క్రికెట్ ప్రేమికులు రిలాక్సయ్యారు. ప్రజెంట్ ఈ విషయం సోషల్ మీడియాలో వైరలైంది.
గంటకు 181.6 కిమీ వేగంతో బంతి..
ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. శుక్రవారం తొలిరోజున ఆసీస్ తొలి ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఆ ఓవర్ ఆఖరు బంతని లెంగ్త్ బాల్ గా వేయగా, కంగారూ బ్యాటర్ మార్నస్ లబుషేన్ దాన్ని బ్యాక్ పాయింట్ దిశగా బౌండరీకి తరలించాడు. అయితే స్కోరు బోర్డు దగ్గర బంతి వేగం అసాధారణంగా నమోదైంది. 181.6 కిమీ వేగంతో బంతి బౌల్ అయిందని రికార్డైంది. దీంతో ఆ ఫిగర్ ను చూసిన ప్రేక్షకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇప్పటిరకు 161.3 కిమీ వేగంతో విసిరిందే అత్యంత వేగవంతమైన డెలీవరి. అది కూడా దాదాపు 21 ఏళ్ల కిందట నమోదైంది. ఈ బంతి కంటే కూడా దాదాపు 23 కిమీ అధిక వేగంతో బంతి బౌల్ కావడంతో ప్రేక్షకులు ముక్కున వేలేసుకున్నారు. అయితే కాసేపటి తర్వాత అసలు నిజం తెలిసి, చిరునవ్వు నవ్వారు. టెక్నికల్ గ్లిచ్ వలన బంతి వేగంలో పొరపాటు నమోదైందని తేలింది. అయితే ఈ సంఘటనకు సంబంధించిన క్లిప్పింగులతో సోషల్ మీడియాలో క్రికెట్ అభిమానులు ఫన్నీ ట్వీట్లు చేస్తున్నారు. దీంతో కాసేపటివరకు ఈ అంశం వైరల్ గా మారింది.
ప్రపంచ రికార్డు అక్తర్ పేరిటే..
ఇక ప్రపంచ క్రికెట్లోని మూడు ఫార్మాట్లలో కలిపి అత్యంత వేగవంతమైన బంతిని విసిరిన ఘనత పాకిస్థాన్ మాజీ స్టీడ్ స్టర్ షోయబ్ అక్తర్ పేరిటే ఉంది. 2003లో వన్డే ప్రపంచకఫ్ లో భాగంగా కేప్ టౌన్ లో ఇంగ్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో రావాల్పిండి ఎక్స్ప్రెస్ ఈ ఘనత నమోదు చేశాడు. 161.3 కిమీ (100.23 మైళ్లు) వేగంతో బంతిని విసిరి ప్రపంచ క్రికెట్లోనే స్పీడ్ స్టర్ గా ఘనత వహించాడు. ఈ క్రమంలో అంతర్జాతీయంగా వంద మైళ్లతో అక్తర్ మినహా ఇప్పటివరకు ఎవరు బౌలింగ్ చేయక పోవడం విశేషం.
కుప్పకూలిన భారత్..
మరోవైపు ఆసీస్ తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ బ్యాటింగ్ వైఫల్యం కొనసాగింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 180 పరుగులకు ఆలౌటయ్యాడు. తెలుగు ఆల్రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి 42 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ స్పీడ్ స్టర్ కెరీర్ ఉత్తమ గణాంకాలు (6/48)తో భారత పతనాన్ని శాసించాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కంగారూలు.. తొలి రోజు ఆటముగిసే సరికి వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. ఆసీస్ కోల్పోయిన ఉస్మాన్ ఖవాజా వికెట్ బర్త్ డే బాయ్ జస్ప్రీత్ బుమ్రాకు దక్కింది. ఓవరాల్గా ఆసీస్ ఇంకా 94 పరుగుల వెనుకంజలో ఉంది. ఐదు టెస్టుల సిరీస్ లో పెర్త్ లో జరిగిన తొలి మ్యాచ్ లో నెగ్గిన భారత్ 1-0తో సిరీస్ లో ఆధిక్యంలో ఉంది.
Also Read:స్టార్ క్రికెటర్ల వీడ్కోలు, తల్లడిల్లిన 2024 హృదయం