అన్వేషించండి

Citroen Basalt X Prices Hiked : వాహనదారులకు షాక్ - సిట్రోయెన్ బసాల్ట్ X ధరలు పెంచుతూ కంపెనీ నిర్ణయం!

సిట్రోయెన్ ఇండియా తన బసాల్ట్ X ఎస్‌యూవీ కూపే ధరలను రూ. 40,000 వరకు పెంచింది. పెరిగిన ఇన్‌పుట్ ఖర్చుల వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.

Citroen Basalt X Prices Hiked News: ప్రముఖ ఫ్రెంచ్ ఆటోమొబైల్ సంస్థ సిట్రోయెన్, తన స్టైలిష్ ఎస్‌యూవీ కూపే 'బసాల్ట్ X' (Basalt X) ధరలను భారీగా పెంచింది. వేరియంట్‌ను బట్టి ఈ పెరుగుదల గరిష్టంగా రూ. 40,000 వరకు ఉంది. 2026 సంవత్సరంలో సిట్రోయెన్ ధరలను పెంచడం ఇది రెండోసారి. అంతకుముందు జనవరి నెలలో ఒకసారి రేట్లు సవరించగా, ఇప్పుడు ఏప్రిల్‌లో మరోసారి పెంచింది. ఆటోమొబైల్ రంగంలో పెరుగుతున్న ముడిసరుకు ఖర్చులు, ద్రవ్యోల్బణం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ధరలు వెంటనే అమలులోకి వస్తాయని కంపెనీ స్పష్టం చేసింది.

కొత్త ధరల వివరాలు..
సిట్రోయెన్ బసాల్ట్ X బేస్ వేరియంట్ అయిన 'యు' (You) ధర ఇప్పుడు రూ. 8.55 లక్షలకు (ఎక్స్‌షోరూమ్) చేరింది. గతంలో ఇది రూ. 8.15 లక్షలుగా ఉండేది, అంటే ఏకంగా రూ. 40,000 పెరిగింది. అలాగే ప్లస్ 1.2 లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ మాన్యువల్ ట్రిమ్ ధర రూ. 37,000 పెరిగి రూ. 9.99 లక్షలకు చేరుకుంది. ఇతర వేరియంట్లపై రూ. 35,000 నుండి రూ. 40,000 వరకు అదనపు భారం పడింది. టర్బో-పెట్రోల్ మాన్యువల్ వెర్షన్లు, డ్యూయల్-టోన్ మోడల్స్ ధరలు కూడా లక్షల్లో పెరిగాయి. ఆటోమేటిక్ వెర్షన్లు (Plus, Max, Max dual-tone) అన్నింటిపై రూ. 40,000 పెరగడం గమనార్హం.

ఇంజిన్ - పర్ఫార్మెన్స్..
ఈ కారు రెండు రకాల 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లతో లభిస్తోంది. అందులో ఒకటి 80 bhp పవర్, 115 Nm టార్క్‌ను ఇచ్చే నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్. దీనికి 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ జత చేశారు. రెండోది మరింత పవర్‌ఫుల్ అయిన టర్బోచార్జ్డ్ వెర్షన్. ఇది 108.5 bhp పవర్, 205 Nm టార్క్‌ను అందిస్తుంది. ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఎంచుకునే అవకాశం ఉంది. బసాల్ట్ X తన యూనిక్ డిజైన్, కంఫర్ట్ లెవల్స్ తో మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ కార్ కు సంబంధించి మార్కెట్లో సపరేట్ వినియోగ దారులు కూడా ఉన్నారని కంపెనీ వర్గాలు పేర్కొంటున్నాయి. 

మార్కెట్ పోటీ..
సిట్రోయెన్ బసాల్ట్ X ప్రధానంగా టాటా కర్వ్ (Tata Curvv), హ్యుందాయ్ క్రెటా, మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి పాపులర్ మోడల్స్ తో పోటీ పడుతోంది. అలాగే రాబోయే టాటా సియెర్రా, రెనాల్ట్ డస్టర్, కియా సెల్టోస్ వంటి కార్లకు కూడా ఇది గట్టి సవాలు విసురుతోంది. ధరలు పెరిగినప్పటికీ, కూపే ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో బసాల్ట్ X తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలుపుకుంది. కొత్తగా కారు కొనాలనుకునే వారు లేటెస్ట్ ఆన్-రోడ్ ధరలు, ఆఫర్ల కోసం స్థానిక డీలర్‌షిప్‌లను సంప్రదించడం మంచిది అని విశ్లేష‌కులు సూచిస్తున్నారు. బడ్జెట్ ఎస్‌యూవీ కోసం చూసే వారికి ఈ ధరల పెరుగుదల కొంచెం నిరాశ కలిగించే విషయమేన‌ని పేర్కొంటున్నారు. ఏదేమైనా మూడు నెలల వ్యవధిలో రెండుసార్లు కార్ల ధరలు పెంచడంతో నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాంతో సేల్స్ కాస్త తగ్గే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 

టాప్ హెడ్ లైన్స్

IND vs SL Galle Test: భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
భారత్ చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరానికి వరుణుడి ముప్పు.. గాలే వేదికగా గిల్ సేన బోణీ కొడుతుందా.? 
IND vs SL 1st Test: ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
ఇండియా చారిత్రాత్మక 600వ టెస్ట్ సమరం.. డబ్ల్యూటీసీ ఫైనల్ టార్గెట్ తో గిల్ సేన ప్లాన్స్.. రేపటి నుంచి తొలి టెస్టు!
Jemimah Injury Shock: జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
జెమిమా రోడ్రిగ్స్ కు గాయం.. ఆసియా కప్ తో పాటు ఏషియన్ గేమ్స్ కు దూరం, రీప్లేస్మెంట్ ఎవ‌రంటే..!
IND vs SL Galle Test: గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!
గాలే స్పిన్ ఉచ్చులో గిల్ సేన..  గంభీర్ రెడ్ బాల్ పవర్ కు అగ్నిపరీక్ష, తొలి టెస్ట్ పై అంద‌రి దృష్టి!

వీడియోలు

IND Spin Attack Strategy vs SL Revealed | గాలే టెస్టులో ముగ్గురు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు
Gundenininda Gudigantalu Serial August 14 | రోహిణి మైండ్ గేమ్‌కు మనోజ్ పడిపోతాడా?
Sreesanth Open Challenge To Harbhajan Singh | భజ్జీకి శ్రీశాంత్ ఓపెన్ ఛాలెంజ్
Vindhya Vishaka in Bigg Boss 10 Telugu | బిగ్ బాస్ 10లో ఐపీఎల్ యాంకర్ వింధ్యా విశాఖ?
VVS Laxman Breaks Silence On Nitish | నితీష్ కుమార్ రెడ్డి గాయంపై లక్ష్మణ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Free Bus For Women In AP: స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
స్త్రీ శక్తి పథకానికి ఏడాది! మహిళలతో కలిసి బస్‌లో ప్రయాణించిన సీఎం చంద్రబాబు!
Telangana Independence Day 2026: గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
గోల్కొండ కోటపై జెండా ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి! నీటి హక్కులు, రైతు సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్ర ప్రగతి ప్రస్థానం!
Independence Day 2026 At Amaravati: అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
అమరావతి గడ్డపై తొలిసారి స్వాతంత్య్ర వేడుకలు! చంద్రబాబు ప్రసంగంలోని ముఖ్యాంశాలు!
Komatireddy Rajagopal Reddy New Party: రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
రాజగోపాల్ రెడ్డి కొత్త పార్టీ పెడతారా? కాంగ్రెస్ పై తిరుగుబాటా లేక మంత్రి పదవి కోసం ప్రెజర్ పాలిటిక్సా?
Anam Ramanarayana Reddy:తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
తిరుపతి స్వాతంత్య్ర వేడుకల్లో ప్రసంగిస్తూ పడిపోయిన మంత్రి ఆనం! వేదికపైనే చికిత్స చేసిన వైద్యులు!
AP Teacher Suspension:మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
మెగా డీఎస్సీపై కేంద్రానికి ఉపాధ్యాయుల ఫిర్యాదు! నలుగురిపై విద్యాశాఖ చర్యలు!
Vande Mataram at Red Fort: ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా
ఎర్రకోటపై చారిత్రక ఘట్టం! 80వ స్వాతంత్య్ర వేడుకల్లో తొలిసారిగా "వందేమాతరం" ఆలాపన!
YS Jagan Press Meets vs Protests: వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
వైఎస్ జగన్ పరామర్శ రాజకీయం - రోడ్డెక్కుతున్న క్యాడర్.. ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్న అధినేత! ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్లాన్ ఏంటి?
Embed widget