ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లేదా ఏసీ యూనిట్‌లో సాంకేతిక సమస్యల వల్ల ఈ ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
Hyderabad Bus Fire: ఆగని ట్రావెల్ బస్ అగ్ని ప్రమాదాలు! స్లీపర్స్‌పై నిషేధానికి పెరుగుతున్న డిమాండ్! ఆ దేశాలే ఆదర్శం!
Hyderabad Bus Fire:హైదరాబాద్‌లో మరో స్లీప్ బస్ ప్రమాదానికి గురైంది. 18 మంది ప్రయాణికులు తృటిలో తప్పించుకున్నారు. దీంతో స్లీపర్ బస్‌లను నిషేధించాలనే డిమాండ్ పెరుగుతోంది.

- కూకట్‌పల్లిలో ప్రయాణిస్తున్న స్లీపర్ బస్‌లో మంటలు చెలరేగాయి.
- డ్రైవర్ అప్రమత్తతతో 18 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు.
- ప్రమాదం స్లీపర్ బస్‌ల భద్రతపై, దేశంలో వాటి వాడకంపై ప్రశ్నలు లేవనెత్తింది.
- చాలా దేశాల్లో నిషేధించబడిన స్లీపర్ బస్‌లపై చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Hyderabad Bus Fire:హైదరాబాద్ మహానగరంలో నడి రోడ్డుపై స్లీపర్ బస్ తగలబడిపోయింది. ప్రయాణికులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. నిత్యం వేలాది వాహనాలతో రద్దీగా ఉంటే కూకట్‌పల్లి- కేపీహెచ్‌బీ రహదారిపై ఈ దుర్ఘటన జరిగింది. ఇది ప్రయాణికులను, స్థానికులను భయాందోళనలకు గురి చేసింది. ఈ ఘటన కేవలం ఒక ప్రమాదంగానే కాకుండా దేశంలో నడుస్తున్న స్లీపర్ బస్‌ల భద్రతపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
శుక్రవారం రాత్రి మియాపూర్ నుంచి పాలకొల్లుకు బయల్దేరిన శ్రీ దుర్గా మహేశ్వరి ట్రావెల్స్ కు చెందిన ఏసీ స్లీపర్ బస్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కేపీహెచ్‌బీ పరిధిలోని పద్మావతీ ప్లాజా బస్ స్టాప్, మెట్రో పిల్లర్ 734 సమీపంలోకి రాగానే బస్ డ్రైవర్ క్యాబిన్ నుంచి దట్టమైన పొగలు రావడం గమనించాడు. వెంటనే డ్రైవర్, సహాయకుడు అప్రమత్తమయ్యారు.
బస్‌ను పక్కకు నిలిపివేసి అందులోని 18 మంది ప్రయాణికులను వెంటనే కిందకు దించేశారు. ప్రయాణికులు కిందకు దిగిన కొద్ది నిమిషాల్లోనే మంటలు బస్ అంతటా వ్యాపించి, వాహనం పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు అదుపు చేసినప్పటికీ బస్ పూర్తిగా కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేసినప్పటికీ బస్ అస్తిపంజరంలా మారిపోయింది. ప్రాథమిక సమాచారం మేరకు ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ లేదా ఏసీ యూనిట్‌లో తలెత్తిన సాంకేతిక సమస్యలే ఈ ప్రమాదానికి కారణమని అధికారులు భావిస్తున్నారు.
స్లీపర్ బస్సులు ఎందుకు ప్రమాదకరం?
ప్రపంచవ్యాప్తంగా స్లీపర్ బస్‌ల డిజైన్‌పై తీవ్ర విమర్శలు ఉన్నాయి. వీటిని కొన్ని దేశాలు డెత్ బస్‌లుగా అభివర్ణిస్తారు. స్లీపర్ బస్సుల్లో బెర్త్‌ల మధ్య ఉండే గ్యాలరీలు చాలా ఇరుకుగా ఉంటాయి. ప్రమాదం జరిగినప్పుడు ప్రయాణికులు త్వరగా బయటకు రావడానికి వీలుపడదు. సాధారణ బస్సులతో పోలిస్తే స్లీపర్ బస్సుల్లో ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు అందుబాటులో ఉండం తక్కువ. పైగా ఉన్న ఎగ్జిట్‌లు కూడా బెర్త్‌ల వల్ల మూసుకుపోయే అవకాశం ఉంది. కూకట్‌పల్లి ఘటనలో డ్రైవర్ అప్రమత్తమవ్వడం, ప్రయాణికులు మెళకువగా ఉండటం వల్ల పెను ప్రమాదం తప్పింది. కాని గతంలో జరిగిన ప్రమాదాలు చూస్తే ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటం వల్ల ఏదైనా జరిగితే వెంటనే స్పందించే సమయం చాలా తక్కువగా ఉంటుంది. పై బెర్త్‌ల నుంచి కిందకు దిగి బయటకు రావడం అత్యవసర సమయంలో కష్టమవుతుంది.
చాలా దేశాల్లో స్లీపర్ బస్‌లు నిషేధం
భారత్‌లో స్లీపర్ బస్సులు విరివిగా వాడుకలో ఉన్నప్పటికీ అనేక అభివృద్ధి చెందిన దేశాలు వీటిని నిషేధించాయి. చైనా ప్రభుత్వం వీటిని 2012లోనే నిషేధించింది. ఉత్పత్తి, రిజిస్ట్రేషన్లపై పూర్తిగా బ్యాన్ వేశారు. 2012, 2011లో జరిగిన ఘోర ప్రమాదాల్లో దాదాపు 77 మంది చనిపోయారు. దీంతో చైనా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జర్మనీలో కూడా 2006 నుంచి స్లీప్ కోచ్‌లను నిషేధించారు. బస్ కదులుతున్నప్పుడు సీటు బెల్ట్ పెట్టుకోవాలని అక్కడి రూల్. అయితే స్లీపర్ పొజిషన్‌లో అది వీలుపడదని తేలడంతో బ్యాన్ వేశారు యూకేలో 2000 నుంచి నిషేధం ఉంది. కేవలం కొన్ని ప్రత్యేక టూరిస్ట్ కోచ్‌లకు మాత్రమే పరిమిత అనుమతి ఉంది. వియత్నాంలో పూర్తిగా నిషేధం లేకపోయినా కొండ ప్రాంతాల్లో, కొన్ని ప్రధాన హైవేలపై స్లీపర్ బస్‌ల రాకపోకలపై కఠిన ఆంక్షలు విధించారు.
మనం ఎక్కడ ఉన్నాం?
భారత్‌లో చాలా ప్రాంతాల్లో స్లీపర్ బస్‌లు ప్రమాదాల బారిన పడుతున్నాయి. రోజూ ఏదో ప్రాంతంలో స్లీపర్ బస్‌లు ప్రమాదానికి గురి అవుతున్న వార్తలు చూస్తున్నాం. మేజర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు అధికారులు, ప్రభుత్వాలు హడావిడి చేయడమే తప్ప వాటిపై సీరియస్‌గా చర్యలు తీసుకున్న ఒక్క ఘటన కూడా లేదు. దీంతో ఉల్లంఘనలు, ప్రమాదాలు సర్వసాధారణమైపోయాయి.
కేపీహెచ్‌బీ ఘటనలో 18 మంది ప్రాణాలతో బయటపడటం కేవలం డ్రైవర్ సమయస్ఫూర్తి వల్ల జరిగిన అదృష్టం మాత్రమే. కానీ ప్రతి సారీ అదృష్టం తోడు ఉండకపోవచ్చు. అందుకే ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకొని సరైన చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Frequently Asked Questions
హైదరాబాద్‌లో జరిగిన బస్ అగ్ని ప్రమాదానికి కారణం ఏమిటి?
ప్రమాదం జరిగినప్పుడు బస్‌లో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు?
బస్‌లో మొత్తం 18 మంది ప్రయాణికులు ఉన్నారు, డ్రైవర్, సహాయకుడితో పాటు వీరంతా సురక్షితంగా బయటపడ్డారు.
స్లీపర్ బస్‌లు ఎందుకు ప్రమాదకరమైనవిగా పరిగణించబడతాయి?
స్లీపర్ బస్సుల్లో బెర్త్‌ల మధ్య ఇరుకైన గ్యాలరీలు, తక్కువ ఎమర్జెన్సీ ఎగ్జిట్‌లు ఉండటం వల్ల ప్రమాద సమయంలో త్వరగా బయటపడటం కష్టం.
స్లీపర్ బస్‌లను ఇతర దేశాల్లో నిషేధించారా?
అవును, చైనా, జర్మనీ, యూకే వంటి అనేక దేశాలు భద్రతా కారణాల దృష్ట్యా స్లీపర్ బస్‌లను నిషేధించాయి.
ట్రెండింగ్ వార్తలు




















