అన్వేషించండి

First-Time Car Buyer's Guide: మొదటిసారి కారు కొంటున్నారా? ఈ 7 స్టెప్స్ పాటిస్తే మీ డ్రీమ్ కార్ ఎంపిక పక్కా! బడ్జెట్ నుంచి సేఫ్టీ వరకు కంప్లీట్ గైడ్!

తొలిసారి కారు కొనేవారు బడ్జెట్, ఫ్యూయల్ టైప్, సేఫ్టీ ఫీచర్లను ఎలా చెక్ చేయాలో అని చాలా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతుంటారు. సరైన నిర్ణయం కోసం ఈ కింది టిప్స్ ఫాలో అవ్వండి.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ముందుగా బడ్జెట్, ఆన్-రోడ్ ధర, EMI పై దృష్టి పెట్టండి.
  • నగర ప్రయాణాలకు హాచ్‌బ్యాక్, హైవేలకు సెడాన్ ఎంచుకోండి.
  • కిలోమీటర్లను బట్టి పెట్రోల్, డీజిల్, CNG లేదా EV ఎంచుకోండి.
  • ఎయిర్‌బ్యాగ్స్, ABS, క్రాష్ రేటింగ్స్ వంటి సేఫ్టీ ఫీచర్లు ముఖ్యం.
  • సర్వీసింగ్ ఖర్చులు, ఆఫర్లు పరిశీలించి కొనుగోలు చేయండి.

First-Time Car Buyer's Tips: ఇండియాలో సొంత కారు కొనడం అనేది ఒక ఎమోషనల్ మైల్‌స్టోన్. ఆఫీసు ప్రయాణాలు కావచ్చు లేదా ఫ్యామిలీతో కలిసి వెళ్లే ట్రిప్స్ కావచ్చు, కారు వల్ల లైఫ్ స్టైల్ మారిపోతుంది. అయితే ఇప్పుడు మార్కెట్లో బోలెడన్ని ఆప్షన్లు, వేరియంట్లు ఉండటంతో ఏ కారు తీసుకోవాలో తేల్చుకోవడం కష్టంగా మారింది. కేవలం కారు లుక్స్ చూసి కాకుండా, మీ అవసరాలకు తగ్గట్టుగా బెస్ట్ డీల్ ఎలా దక్కించుకోవాలో ఇప్పుడు చూద్దాం.

బడ్జెట్ ఫిక్స్ చేసుకోండి..
చాలామంది ఎక్స్‌షోరూమ్ ధర చూసి కారును షార్ట్‌లిస్ట్ చేస్తారు. కానీ ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ వంటివన్నీ కలిపితే ఆన్-రోడ్ ధర పెరుగుతుంది. కారు కొనేటప్పుడు మీ నెలవారీ ఆదాయంలో ఈఎంఐ (EMI) వాటా 15 నుండి 20 శాతం మించకుండా చూసుకోవడం ఫైనాన్షియల్ గా సేఫ్. డౌన్ పేమెంట్, ఇతర యాక్సెసరీస్ ఖర్చులను కూడా ముందే లెక్కించుకోవాలి.

అవసరాలను గుర్తించండి..
మీరు కారును ఎక్కడ వాడతారు అనే దానిపై స్పష్టత ఉండాలి. రోజూ సిటీ ట్రాఫిక్‌లో తిరిగే ప్లాన్ ఉంటే చిన్న హాచ్‌బ్యాక్ లేదా కాంపాక్ట్ ఎస్‌యూవీలు బాగుంటాయి. అదే హైవేలపై ఎక్కువగా వెళ్లే వారైతే పవర్‌ఫుల్ సెడాన్లు లేదా పెద్ద ఎస్‌యూవీలను ఎంచుకోవచ్చు. ఫ్యామిలీ మెంబర్స్ సంఖ్య, లగేజీ స్పేస్ వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కేవలం ట్రెండ్ కోసం కాకుండా మీ కంఫర్ట్ కోసం బాడీ స్టైల్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.

ఇంధనం - గేర్ బాక్స్ ఎంపిక..
తిరిగే కిలోమీటర్లను బట్టి పెట్రోల్, డీజిల్ లేదా సీఎన్జీని ఎంచుకోవాలి. తక్కువగా తిరిగే వారికి పెట్రోల్ కారు బెటర్. రన్నింగ్ ఖర్చులు తక్కువ ఉండాలంటే సీఎన్జీ ఆప్షన్ బాగుంటుంది. ఇక ట్రాఫిక్ ఎక్కువగా ఉండే నగరాల్లో ఆటోమేటిక్ గేర్ బాక్స్ కారు నడపడం చాలా సులభం. మాన్యువల్ వేరియంట్లు కొంచెం చౌకగా దొరుకుతాయి. ఛార్జింగ్ సదుపాయం ఉంటే ఎలక్ట్రిక్ వాహనాలను (EV) కూడా పరిశీలించవచ్చు అని విశ్లేషకులు సూచిస్తున్నారు.

సేఫ్టీకే ప్రాధాన్యత..
కారులో సన్‌రూఫ్ ఉందా లేదా అనే దానికంటే సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయా లేదా అనేది ముఖ్యం. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్ (ABS) విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి ఉండాలి. అలాగే క్రాష్ టెస్ట్ రేటింగ్స్ చెక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. రివర్స్ కెమెరా, పార్కింగ్ సెన్సార్లు ఉండటం వల్ల కారును సేఫ్‌గా పార్క్ చేయవచ్చు అని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 

మెయింటెనెన్స్ - ఆఫర్లు..
కారు కొన్న తర్వాత దాని సర్వీసింగ్ ఖర్చులు ఎలా ఉంటాయో ఆరా తీయాలి. సర్వీస్ సెంటర్లు అందుబాటులో ఉన్న బ్రాండ్లను ఎంచుకుంటే భవిష్యత్తులో ఇబ్బందులు ఉండవు. డీలర్లు ఇచ్చే డిస్కౌంట్లు, కార్పొరేట్ స్కీమ్స్ గురించి ఎంక్వైరీ చేయండి. అన్ని కంపెనీల ఆఫర్లను కంపేర్ చేసి బేరమాడితే మంచి డీల్ దొరుకుతుంది. సేల్స్ మెన్ ఇచ్చే ఆఫర్లకు లోబడి తొందరగా నిర్ణయం తీసుకోకుండా, అన్ని విధాలా ఆలోచించి మీ డ్రీమ్ కారును సొంతం చేసుకోండి అని నిపుణులు సూచిస్తున్నారు.

Frequently Asked Questions

కారు కొనేముందు బడ్జెట్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి?

ఎక్స్‌షోరూమ్ ధరతో పాటు ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్, రోడ్ ట్యాక్స్ వంటివి కలిపి ఆన్-రోడ్ ధరను అంచనా వేయాలి. నెలవారీ ఆదాయంలో EMI 15-20% మించకుండా చూసుకోవాలి.

నా అవసరాలకు తగ్గట్టు కారును ఎలా ఎంచుకోవాలి?

మీరు కారును ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తారో (సిటీ/హైవే) గుర్తించండి. ఫ్యామిలీ సైజు, లగేజీ స్పేస్, కంఫర్ట్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి.

ఇంధనం మరియు గేర్‌బాక్స్ ఎంపికలో ఏది ముఖ్యం?

మీరు తిరిగే కిలోమీటర్లను బట్టి పెట్రోల్, డీజిల్, సీఎన్జీ లేదా ఎలక్ట్రిక్ ఎంచుకోవాలి. నగర ట్రాఫిక్‌లో ఆటోమేటిక్ గేర్‌బాక్స్ సౌకర్యవంతంగా ఉంటుంది.

కారు కొనేటప్పుడు సేఫ్టీ ఫీచర్లకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి?

సన్‌రూఫ్ కంటే డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ఏబీఎస్, ఈబీడీ, ఈఎస్‌సీ వంటి సేఫ్టీ ఫీచర్లకు ప్రాధాన్యత ఇవ్వాలి. క్రాష్ టెస్ట్ రేటింగ్స్‌ను తప్పక చెక్ చేయాలి.

కారు కొనేటప్పుడు ఆఫర్లు మరియు మెయింటెనెన్స్‌ను ఎలా పరిశీలించాలి?

సర్వీసింగ్ ఖర్చులను, సర్వీస్ సెంటర్ల లభ్యతను ఆరా తీయాలి. డీలర్లు ఇచ్చే డిస్కౌంట్లు, స్కీమ్స్‌ను పోల్చి బేరమాడితే మంచి డీల్ లభిస్తుంది.

టాప్ హెడ్ లైన్స్

ఫ్రెష్‌ లుక్‌తో బజాజ్ పల్సర్ 125 మార్కెట్‌లోకి వచ్చింది - తక్కువ EMI పడే ఫైనాన్స్ ఆఫర్ల పూర్తి వివరాలు!
యూత్‌కు మెచ్చే మార్పులతో Bajaj Pulsar 125 లాంచ్‌ - కేవలం రూ.11,000 డౌన్‌పేమెంట్‌తో మీ సొంతం!
కొత్త బజాజ్‌ పల్సర్ 150లో ఫీచర్లు ఎక్కువే.. కానీ పాత మోడల్‌లో ఉన్న ఈ సదుపాయాలు మిస్!
కొత్తదే కదా అని కొంటున్నారా? బజాజ్ పల్సర్ 150 కొత్త - పాత మోడళ్ల మధ్య తేడాలు ఇవే!
రూ.15 వేల EMIకి ఏయే కార్లు కొనుగోలు చేయవచ్చు ? లిస్ట్ చూసి డిసైడ్ చేసుకోండి
రూ.15 వేల EMIకి ఏయే కార్లు కొనుగోలు చేయవచ్చు ? లిస్ట్ చూసి డిసైడ్ చేసుకోండి
Buying Car EMI: 30,000 జీతం ఉన్నవారు కారు కొనడం సాధ్యమేనా? అందుకు ఏం చేయాలి
30,000 జీతం ఉన్నవారు కారు కొనడం సాధ్యమేనా? అందుకు ఏం చేయాలి

వీడియోలు

IND vs SL 2nd Test Day 1 | కోహ్లీ రికార్డ్‌ను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Yashasvi Jaiswal Fight With Asitha Fernando | అసిథ ఫెర్నాండోతో జైస్వాల్ గొడవ
Serial Actor Charishma Shreekhar Profile | అమ్మోరు' సీరియల్ నటి సక్సెస్ స్టోరీ ఇదే
Anasuya Bharadwaj Emotional Comments | సమాజంపై అనసూయ ఎమోషనల్ వీడియో
Gundenininda Gudigantalu Serial August 24 | రోహిణి, మనోజ్ రూమ్‌కి తాళం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Kodad Road Accident:కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!
కోదాడలో ఘోర ప్రమాదం!- కంటైనర్‌ను ఢీకొట్టిన ట్రావెల్ బస్‌! ఐరన్ రాడ్స్‌ దూసుకెళ్లి ఆరుగురు మృతి!
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్ వల్లా కావట్లేదు - తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పోరాటాలను దారికి తెచ్చేదెవరు?
మీనాక్షి నటరాజన్ వల్లా కావట్లేదు - తెలంగాణ కాంగ్రెస్ అంతర్గత పోరాటాలను దారికి తెచ్చేదెవరు?
Vijayasai Reddy Hindutva Politics: విజయసాయిరెడ్డి హిందూత్వ లైన్ - ఏపీ రాజకీయాల్లో రైట్ వింగ్ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది?
విజయసాయిరెడ్డి హిందూత్వ లైన్ - ఏపీ రాజకీయాల్లో రైట్ వింగ్ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది?
NH 365 BB Development: తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
తెలుగు రాష్ట్రాల వారికి అలర్ట్.. ఎన్‌హెచ్ 365 బీబీ అభివృద్ధికి రూ. 840 కోట్లు మంజూరు
Prabhas Spirit Update : వారణాసి Vs స్పిరిట్ - అవసరమైతే వెనక్కి జరుగుతాం... సందీప్ వంగా క్లారిటీ
వారణాసి Vs స్పిరిట్ - అవసరమైతే వెనక్కి జరుగుతాం... సందీప్ వంగా క్లారిటీ
ఫ్రెష్‌ లుక్‌తో బజాజ్ పల్సర్ 125 మార్కెట్‌లోకి వచ్చింది - తక్కువ EMI పడే ఫైనాన్స్ ఆఫర్ల పూర్తి వివరాలు!
యూత్‌కు మెచ్చే మార్పులతో Bajaj Pulsar 125 లాంచ్‌ - కేవలం రూ.11,000 డౌన్‌పేమెంట్‌తో మీ సొంతం!
Raksha Bandhan 2026: రక్షా బంధన్ రోజు ఆలస్యంగా నిద్రలేవకండి! ఈ టైమ్ లోగా రాఖీ కట్టేయాలి!
రక్షా బంధన్ రోజు ఆలస్యంగా నిద్రలేవకండి! ఈ టైమ్ లోగా రాఖీ కట్టేయాలి!
AE Nookaraju Grandson: సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
సాధిక్‌ వల్ల నా కుటుంబం సర్వనాశనం, నన్ను అనాథగా మార్చాడు: కార్తికేయరెడ్డి ఆవేదన
Embed widget