Brendon McCullum: ఇక ఊచకోతను మించి, మెకల్లమ్ రాకతో మారనున్న బ్యాటింగ్ తీరు
England ODI T20 Coach: ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు బ్రెండెన్ మెక్ కల్లమ్ ను కొత్త కోచ్‌ను నియమించింది. ఈ నియామకం వెనుక ఉన్న ప్రధాన కారణాలు ఏంటో తెలుసా?
Brendon McCullum As England white Ball Coach: బ్రెండెన్ మెక్ కల్లమ్(Brendon McCullum)... అంతర్జాతీయ క్రికెట్ లో దూకుడు బ్యాటింగ్ తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్(England) జట్టు కోచ్ గానూ సమర్థంగా పని చేశాడు. కొత్త వ్యూహాలతో బ్రిటీష్ జట్టును పటిష్టంగా మార్చాడు. 2022లో ఇంగ్లండ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ... టెస్టుల్లో ఆ జట్టు ఆటతీరునే సమూలంగా మార్చేశాడు. ఇప్పుడు వన్డే జట్టుకు కోచ్ గా మెక్ కల్లమ్ కు బాధ్యతలు అప్పగించారు. 2027 వరకు మెక్ కల్లమ్ ఇంగ్లండ్ కోచ్ గా కొనసాగనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025, T20 ప్రపంచ కప్ 2026, వన్డే ప్రపంచ కప్ 2027లను మెకల్లమ్ పర్యవేక్షణలోనే ఇంగ్లండ్ ఆడనుంది. 2022లో టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టు.. 2023 వన్డే ప్రపంచకప్ లో కనీసం సెమీఫైనల్‌కు కూడా చేరలేకపోయింది. ఈ నేపథ్యంలో మెక్ కల్లమ్ కు కోచ్ గా బాధ్యతలు అప్పగించడంపై అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అయితే మెక్ కల్లమ్ ను కోచ్ గా నియమించడం వెనక మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటంటే..?
Read Also: Virat Kohli : రూ. 66 కోట్లు టాక్స్ కట్టిన విరాట్ కోహ్లీ
బాజ్‌బాల్ శకారంభం
బ్రెండన్ మెకల్లమ్ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇంగ్లిష్ జట్టు టెస్టుల్లో ఎటాకింగ్ క్రికెట్ ఆడుతోంది. వన్డేలు, T20Iల్లో మాదిరిగానే టెస్టుల్లోనూ ఎటాకింగ్ క్రికెట్‌ను ఆడి ఫలితాలు రాబట్టింది. మెకల్లమ్ కొత్త కోచ్‌గా రానుండడంతో ఈ బజ్ బాల్ క్రికెట్ మరోస్థాయికి చేరే అవకాశం ఉఁది. టీ 20ల్లో ఇంగ్లండ్ జట్టు పవర్ హిట్టర్స్ తో నిండే అవకాశం ఉంది.
గతం గుర్తుందిగా
బ్రెండన్ మెకల్లమ్ గతంలో పాకిస్తాన్ గడ్డపై ఇంగ్లండ్‌కు చారిత్రాత్మక విజయాన్ని అందించాడు. 2022-23లో ఇంగ్లండ్ 3-0తో పాకిస్థాన్ పై చారిత్రాత్మక టెస్ట్ సిరీస్ విజయాన్ని సాధించడంలో మెకల్లమ్ కీలక పాత్ర పోషించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్‌లో జరుగుతుంది. కాబట్టి మెకల్లమ్ అనుభవం ఉపయోగ పడే అవకాశం ఉంది.
Read Also: Pakistan Cricket: భజన చేసే వారికే చోటు , పాక్ పతనానికి సవాలక్ష కారణాలు
స్టార్ బ్యాటర్ మరి...
2015లో న్యూజిలాండ్‌ను వన్డే ప్రపంచ కప్ ఫైనల్‌కు నడిపించిన మొదటి సారధిగా మెకల్లమ్ చరిత్ర సృష్టించాడు. 2014 తర్వాత తొలిసారిగా 2021లో కోల్‌కతా నైట్ రైడర్స్‌ను IPL ఫైనల్‌కు చేర్చిన మొదటి కోచ్ కూడా మెకల్లమే. అతని నాయకత్వంలో న్యూజిలాండ్ ఆస్ట్రేలియాను ఓడించింది. 2020లో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ను CPL టైటిల్ అందించాడు. ఈ విజయాలు వైట్-బాల్ క్రికెట్ కోచ్ గా మెకల్లమ్ సత్తాను చాటుతున్నాయి.