Virat Kohli : రూ. 66 కోట్లు టాక్స్ కట్టిన విరాట్ కోహ్లీ - దరి దాపుల్లో మరో క్రికెటర్ లేడుగా !
Cricket : క్రికెటర్లలో విరాట్ కోహ్లీ సంపాదనకు ఎవరూ దరి దాపుల్లో లేరు. ఆ విషయం ఆయన కట్టిన పన్నులతోనే తేలిపోతోంది.
Virat Kohli Paid 660000000 In Taxes In 2023-24 : భారత క్రికెట్ సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన సంపాదన కూడా అంతే ఉంటుంది. అయితే ఒక్క క్రికెట్ ద్వారా మాత్రమే కాదు.. ఆయన పెట్టుబడులు, వ్యాపారాలు, బ్రాండ్ వాల్యూ మీద కూడా పెద్ద మొత్తంలో సంపాదిస్తారు. వ్యక్తిగతంగా తన ఆదాయంపై విరాట్ కోహ్లీ గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రూ. 66 కోట్ల రూపాయలు పన్ను కట్టారు. ఆయన దరి దాపుల్లో మరో క్రికెటర్ లేరు.
రిటైరైనా భారీగా పన్నులు కడుతున్న గంగూలీ , టెండూల్కర్
మాజీ కెప్టెన్ ధోనీ.. వ్యాపార రంగంలో అద్భుతంగా రాణిస్తున్నారు. ఆయన 38కోట్లు పన్ను కట్టారు. క్రికెటర్లలో సచిన్ 28కోట్లు, గంగూలీ 23కోట్లు, హర్ధిక్ పాండ్యా 13కోట్లు పన్ను కట్టారు. హార్దిక్ పాండ్యా పదమూడు కోట్లు, రిషబ్ పంత్ పది కోట్ల రూపాయల పన్ను కట్టారు. ఆశ్చర్యకరంగా కెప్టెన్ రోహిత్ శర్మ కు ఇంత భారీగా పన్ను కట్టేంత ఆదాయం రాలేదు. రిటైరై చాలా కాలం అయినప్పటికి సచిన్ టెండూల్కర్, గంగూలీ పెద్ద మొత్తంలో ఆర్జిస్తున్నారు. దానికి వారు కట్టిన పన్నే సాక్ష్యంగా కనిపిస్తోంది.
భజన చేసే వారికే చోటు , పాక్ పతనానికి సవాలక్ష కారణాలు
హీరోల్లో అత్యధిక పన్ను చెల్లింపు దారు షారుఖ్
క్రీడాకారుల కన్నా సినీ హీరోలే ఎక్కువగా పన్నులు కట్టారు. సూపర్ స్టార్ షారుఖ్ అత్యధికంగా వ్యక్తిగత పన్ను రూ. 92 కోట్లు కట్టారు. ఆయన సినిమాల్లో నటించడంతో పాటు బ్రాండ్ లకు ప్రచారకర్తగా ఉన్నారు. ఐపీఎల్ టీమ్ ఉంది. సినిమా ప్రొడక్షన్ హౌస్ కూడా ఉంది. ఇంకా పలు వ్యాపారాలు ఉన్నాయి. షారుఖ్ తర్వాత సౌత్ హీరో విజయ్ రూ. 80 కోట్ల పన్ను కట్టి.. విరాట్ కోహ్లీ కన్నా ఎక్కువ సంపాదన ఉందని నిరూపించారు. తర్వాత సల్మాన్ ఖాన్ 75 కోట్లు అమితాబ్ బచ్చన్ - 71 కోట్లు పన్నులు కట్టారు. మరో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ 42కోట్లు, రణబీర్ కపూర్ 36కోట్ల రూపాయల పన్నులు చెల్లించారు.
ధోనీ అద్దంలో ముఖం చూసుకో , నిన్ను ఎప్పటికీ క్షమించను
తెలుగు నుంచి రూ. 14 కోట్లు ట్యాక్స్ కట్టిన అల్లు అర్జున్
తెలుగు సినీ ఇండస్ట్రీ నుండి అల్లు అర్జున్ 14కోట్ల రూపాయల ఆదాయపు పన్ను కట్టారు. మరో స్టార్ ఇంత పెద్ద మొత్తంలో పన్నులు కట్టలేదని ఫార్చ్యూన్ ఇండియా తెలిపింది. దేశంలో అత్యధికంగా వ్యక్తిగత ఆదాయపు పన్ను కట్టే వారిలో సినీ, స్పోర్ట్స్ స్టార్లే ఎక్కువగా ఉంటారు. వారు తమ ఆదాయంలో ముఫ్ఫై శాతానికిపైగా పన్ను కట్టాల్సి ఉంటుంది.